For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కళ్ల కింద నల్లటి వలయాలకు ముల్తానీ మట్టి చేసే అద్భుతం

By Super
|

నల్లని వలయాలను వదిలించుకోవటానికి హోం రెమిడీస్ గురించి చర్చించటానికి ముందు, కంటి చుట్టూ నల్లటి వలయాలు రావటానికి కారణాలు తెలుసుకోవాలి. ఈ నల్లటి వలయాలు రావటానికి అనేక కారణాలు ఉన్నాయి.

నల్లటి వలయాలు పొట్టలో సమస్యలు, జన్యువుల కారణంగా రావచ్చు. కానీ వీటిని వదిలించుకోవటం చాలా కష్టం. అంతేకాక నిద్ర లేమి, పని ఒత్తిడి కారణంగా కూడా ఈ నల్లటి వలయాలు వస్తాయి. నల్లటి వలయాలు ఏర్పడ్డాయంటే ఇబ్బందిగా, చికాకుగా ఉంటాయి. వీటిని నివారించడానికి చక్కటి సింపుల్ హోం రెమిడీస్ ఉన్నాయి.

నల్లని వలయాల కోసం ముల్టానా మట్టిని ఎలా ఉపయోగించాలి? ముల్టానా మట్టి చర్మానికి అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది.
ముల్టానా మట్టి చర్మంలో ముడుతలను తగ్గించడం మరియు నూనెను నియంత్రించడం, నల్లని వలయాలు, మచ్చలు, పిగ్మెంటేషన్ తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. పురాతన కాలం నుంచి అందానికి ముల్తానీ మట్టిని ఉపయోగిస్తున్నారు. అలాంటి పవర్ ఫుల్ టిప్స్ ఇప్పుడు చూద్దాం..

1. దోసకాయ రసంతో ప్యాక్

1. దోసకాయ రసంతో ప్యాక్

ముల్టానా మట్టిలో దోసకాయ రసం వేసి పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ని కంటి కింద నల్లటి వలయాలు ఉన్న ప్రదేశంలో రాసి పది నిమిషాల పాటు కళ్ళు మూసుకోవాలి. ఈ విధంగా చేయుట వలన చల్లదనం కలగటమే కాకుండా నల్లటి వలయాలు కూడా తొలగిపోతాయి.

2. బాదంతో ప్యాక్

2. బాదంతో ప్యాక్

ముల్టానా మట్టి,కొంచెం గ్లిజరిన్ మరియు బాదం పేస్ట్ తో ఒక ప్యాక్ తయారుచేయాలి. ఈ పేస్ట్ ని కంటి చుట్టూ నల్లటి వలయాలు ఉన్న ప్రాంతంలో రాసి ఆరాక చల్లని నీటితో కడగాలి.

3. పాలతో ప్యాక్

3. పాలతో ప్యాక్

పాలు కంటి చుట్టూ ఉన్న ప్రాంతం తేమగా ఉంచటానికి మరియు ముల్టానా మట్టి రక్తప్రసరణ పెంచటానికి సహాయపడుతుంది. ఈ ప్యాక్ ని వారంలో రెండు సార్లు వేసుకుంటే మంచి పలితం కనపడుతుంది.

4. పెరుగుతో ప్యాక్

4. పెరుగుతో ప్యాక్

ముల్టానా మట్టిలో పెరుగు,తేనే కలిపి పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ని కంటి చుట్టూ రాయాలి. పెరుగు తేమను అందిస్తే తేనే అలసిన కళ్ళకు ఉపశమనాన్ని అందిస్తుంది.

5. నిమ్మరసంతో ప్యాక్

5. నిమ్మరసంతో ప్యాక్

నిమ్మరసం నల్లటి వలయాలను తగ్గించటంలో మేజిక్ వలే పనిచేస్తుంది. నిమ్మరసం ముల్టానా మట్టితో కలిస్తే సూపర్ ప్యాక్ అవుతుంది. ఈ ప్యాక్ ని వారంలో రెండు సార్లు వేసుకుంటే మంచి పలితం కనపడుతుంది.

6. రోజ్ వాటర్

6. రోజ్ వాటర్

రోజ్ వాటర్ చర్మం లోపల నుండి పోషణను అందిస్తుంది. రోజ్ వాటర్,ముల్టానా మట్టి కలిసి నల్లటి వలయాల మీద పోరాటం చేస్తాయి. అంతేకాక కంటి చుట్టూ ముడతలను కూడా తగ్గిస్తాయి.

7. బంగాళదుంపతో ప్యాక్

7. బంగాళదుంపతో ప్యాక్

బంగాళదుంపను మెత్తని పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ లో ముల్టానా మట్టి కలిపి కంటి చుట్టూ రాసి 15 నిముషాలు అయ్యాక నిదానంగా కడగాలి. ఈ విధంగా చేస్తే నల్లటి వలయాలు మాయం అవుతాయి.

ఈ ప్యాక్ లను రాత్రి సమయంలో వేసుకుంటే కళ్ళకు తగినంత విశ్రాంతి కలుగుతుంది. అంతేకాక కూరగాయలు, పండ్లు తింటూ తగినంత నీటిని త్రాగాలి.

English summary

How To Use Multani Mitti For Dark Circles

How To Use Multani Mitti For Dark Circles. Before discussing about the home remedies for dark circles, you should know the reasons of those irritating black marks present around your eyes.
Desktop Bottom Promotion