For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెరుగు, మిరియాల మిశ్రమంతో చర్మంలో కనిపించే అద్భుత మార్పులు

చర్మ సమస్యలు నివారించుకోవడానికి నల్లమిరియాలు లేదా నల్ల మిరియాల ఆయిల్ ని ఉపయోగించవచ్చు. మరి.. నల్లమిరియాలను ఎలా ఉపయోగిస్తే.. మీ చర్మం అమేజింగ్ లుక్ సొంతం చేసుకుంటుంది.

By Swathi
|

కేవలం రెండే రెండు పదార్థాలు.. అవి కూడా మన వంటింట్లో అందుబాటులో ఉన్న పదార్థాలను మిక్స్ చేసి.. చర్మానికి పట్టించడం వల్ల కొన్ని నిమిషాల్లోనే.. అద్భుత ఫలితాలు పొందవచ్చు. ఈ రెండు పదార్థాలు.. చర్మానికి కావాల్సిన పోషణ అందించి.. ఎలాంటి సమస్యనైనా నివారిస్తాయి.

నల్లమిరియాలు.. వీటిల్లో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో బీటా కెరోటిన్ ఉంటుంది.. ఆరోగ్యానికి చాలాముఖ్యమైనది. అలాగే ఇందులో ఉండే పొటాషియం, సెలీనియం, క్యాల్షియం.. చర్మ ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి.

పొటాషియం బ్లడ్ ప్రెజర్ ని రెగ్యులేట్ చేసి.. జుట్టు, గోళ్లు, ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మ సమస్యలు నివారించుకోవడానికి నల్లమిరియాలు లేదా నల్ల మిరియాల ఆయిల్ ని ఉపయోగించవచ్చు. మరి.. నల్లమిరియాలను ఎలా ఉపయోగిస్తే.. మీ చర్మం అమేజింగ్ లుక్ సొంతం చేసుకుంటుంది.

కావాల్సిన పదార్థాలు

కావాల్సిన పదార్థాలు

ఒక టేబుల్ స్పూన్ మిరియాలు, 2 టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకోవాలి.

తయారుచేసేవిధానం

తయారుచేసేవిధానం

ఈ రెండింటినీ బాగా మిక్స్ చేసి.. పేస్ట్ చేసుకోవాలి. ముందుగా చర్మాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుని.. ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి. ఇప్పుడు.. గుండ్రంగా స్క్రబ్ చేసుకోవాలి. కొన్ని నిమిషాల తర్వాత.. చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే.. మీ చర్మం షైనీగా మారుతుంది.

కావాల్సిన పదార్థాలు

కావాల్సిన పదార్థాలు

1 టేబుల్ స్పూన్ తేనె, అర టీస్పూన్ నల్లమిరియాలు, 1 గుడ్డులోని తెల్లసొన తీసుకోవాలి.

తయారు చేసేవిధానం

తయారు చేసేవిధానం

అన్నింటినీ.. బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.. అరగంట ఆరనివ్వాలి. తర్వాత.. గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. అంతే.. ఇలా రెగ్యులర్ గా చేస్తే.. మొటిమలు మాయం అవుతాయి.

తయారు చేసేవిధానం

తయారు చేసేవిధానం

నల్ల మిరియాల్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని స్క్రబర్ లా ఉపయోగిస్తే.. బ్యాక్లీరియాను నాశనం చేసి.. బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరిచి.. ముడతలతో.. పోరాడుతుంది.

కావాల్సిన పదార్థాలు

కావాల్సిన పదార్థాలు

3 చుక్కల బ్లాక్ పెప్పర్ ఆయిల్, 100 ఎమ్ ఎల్ బాడీ లోషన్.

తయారు చేసేవిధానం

తయారు చేసేవిధానం

మూడుచుక్కల మిరియాల ఆయిల్ ని.. బాడీ లోషన్ లో మిక్స్ చేసి.. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం రుద్దుకోవాలి. ఇది.. సెల్యులైట్ (చర్మంపై ఏర్పడే చారలను) ఎఫెక్టివ్ గా నివారిస్తుంది.

English summary

Mix These 2 Ingredients And See What Happens To Your Skin

Mix These 2 Ingredients And See What Happens To Your Skin. You can use black pepper, or black pepper oil to solve a lot of skin issues.
Story first published: Wednesday, October 19, 2016, 12:08 [IST]
Desktop Bottom Promotion