For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టూత్ పేస్ట్ ఒకే ఒక పదార్థం కలిపి అప్లై చేస్తే బ్లాక్ హెడ్స్ మాయం

టూత్ పేస్ట్ లో పుదీనా ఉంటుంది. ఇది యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. టూత్ పేస్ట్ లో ఉండే మరో పదార్థం చర్మంలో ఉన్న బ్లాక్ హెడ్స్ ని బయటకు తీసేస్టాయి.

By Swathi
|

బ్లాక్ హెడ్స్..!! ఇతి ప్రతి అమ్మాయిని ఇబ్బందిపెట్టే సమస్య. ఒకసారి బ్లాక్ హెడ్స్ మొదలయ్యాయంటే... పూర్తీగా పోగొట్టుకోవడం చాలా కష్టం. అలాగే వీటిని తొలగించుకునేటప్పుడు చాలా నొప్పి కూడా బాధిస్తుంది. బ్లాక్ హెడ్స్ లోపలి భాగంలో హెయిర్ తోపాటు పెరుగుతూ బయటివైపు ప్రభావం చూపుతాయి.

Mix Toothpaste With This One Ingredient, It Will Remove Blackheads Right Off!

నుదురు భాగం, ముక్కు, గడ్డం వంటి ప్రాంతాల్లో ఎక్కువగా బ్లాక్ హెడ్స్ వేధిస్తూ ఉంటాయి. ఈ ప్రాంతాల్లో కాస్త ఆయిల్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ బ్లాక్ హెడ్స్ ఎక్కువగా వస్తాయి. అయితే ఈ పార్ట్స్ అన్నీ.. చాలా సెన్సిటివ్ గా ఉంటాయి. దీంతో వీటిని తొలగించుకోవాలంటే.. చాలా నొప్పిగా ఉంటుంది.

సాధారణంగా బ్లాక్ హెడ్స్ ని పార్లర్లలో తొలగిస్తాయి. కానీ ఇవి చాలా మంట, నొప్పి కలిగిస్తాయి. కానీ ఇంట్లోనే హోం రెమెడీస్ ఫాలో అయితే చాలా తేలికగా వీటిని తొలగించుకోవచ్చు. ముఖ్యంగా టూత్ పేస్ట్ మాస్క్ సహాయపడుతుంది. టూత్ పేస్ట్ పుదీనా ఉంటుంది. ఇది యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. టూత్ పేస్ట్ లో ఉండే మరో పదార్థం చర్మంలో ఉన్న బ్లాక్ హెడ్స్ ని బయటకు తీసేస్టాయి.

స్టెప్ 1

స్టెప్ 1

ఒక కప్పు తీసుకుని, 1 టీస్పూన్ టూత్ పేస్ట్ తీసుకోవాలి. ముఖ్యంగా వైట్ కలర్ పేస్ట్ తీసుకోవాలి.

స్టెప్ 2

స్టెప్ 2

అందులోకి రిఫైన్డ్ సాల్ట్ కలిపి.. రెండింటినీ బాగా మిక్స్ చేయాలి. రెండూ బాగా కలిసిపోయేంతవరకు కలపాలి.

స్టెప్ 3

స్టెప్ 3

ముందుగా ముఖానికి ఆవిరి పట్టుకోవాలి. దీనివల్ల రంధ్రాలు లూజ్ గా మారుతాయి. ఆవిరి పెట్టే వాటర్ లో లావెండర్ ఆయిల్, టీట్రీ ఆయిల్ కలపాలి. ఇవి పోషణ అందిస్తాయి.

స్టెప్ 4

స్టెప్ 4

ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని అప్లై చేయాలి. 5 నిమిషాల తర్వాత కొన్ని చుక్కల నీటితో.. ప్యాక్ అప్లై చేసిన దానిపై చల్లుకోవాలి. తర్వాత గుండ్రంగా, సున్నితంగా 2 నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి.

స్టెప్ 5

స్టెప్ 5

తర్వాత ఐస్ క్యూబ్స్ తో చర్మాన్ని రుద్దుకోవాలి. దీనివల్ల ముక్క ఎర్రగా కనిపించవచ్చు. కానీ.. వెంటనే తగ్గిపోతుంది.

స్టెప్ 6

స్టెప్ 6

ఒకవేళ మీకు చాలా పొడి చర్మం ఉందంటే.. ఆ ప్రాంతంలో మాయిశ్చరైజర్ తో మసాజ్ చేసుకోవాలి. ఈ ట్రిక్ ని వారానికి ఒకసారి కంటే ఎక్కువసార్లు ప్రయత్నించకూడదు. అలా చేస్తే వెంటనే బ్లాక్ హెడ్స్ మాయమవుతాయి.

English summary

Mix Toothpaste With This One Ingredient, It Will Remove Blackheads Right Off!

Mix Toothpaste With This One Ingredient, It Will Remove Blackheads Right Off! To get rid of those stubborn deep-rooted blackheads, try this perfect trick!
Story first published: Tuesday, December 6, 2016, 16:26 [IST]
Desktop Bottom Promotion