Latest Updates
-
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి! -
సైలెంట్ కిల్లర్స్: పైకి ముక్కుసూటి.. వెనుక మహా కిలాడీలు!..ఈ 3 రాశులు ఎవరో తెలుసా? -
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే.. -
ఫోన్ పక్కనపెట్టి ఇది ట్రై చేయండి.. హృతిక్ చెబుతున్న హెల్త్ టిప్స్! -
నార్త్ స్టైల్ చోలే మసాలా.. పూరీ, చపాతీలోకి వేళ్లు చప్పరిస్తూ లాగించేస్తారు.! -
చికెన్, మటన్ కంటే 50 రెట్లు బలం..ఏడాది పాటు నిల్వ ఉండే బోడకాకరకాయ పచ్చడి ఇలా చేయండి -
వయసు పైబడితేనే అల్జీమర్స్ వస్తుందా.. మతిమరుపునకు దారితీసే ప్రమాదకర కారకాలివే.!
ఎప్పుడూ యంగ్ గా, ఎట్రాక్టివ్ గా కనిపించడానికి ఎఫెక్టివ్ హోం రెమిడీస్
ఎప్పుడూ యంగ్ అండ్ డైనమిక్ గా కనిపించాలని ఎవరు కోరుకోరు. వయసు పెరిగినా.. చర్మంపై ముడతలు లేకుండా, యంగ్ గా కనిపించడానికి రకరకాల క్రీములు ఉన్నాయి. కానీ.. క్రీములు వాడితే.. చర్మంపై మరింత దుష్ర్పభావం ఉంటుంది. కాబట్టి.. ఇంట్లోనే తయారు చేసుకునే ఎఫెక్టివ్ హోం రెమిడీస్ తో.. ఎల్లప్పుడూ యంగ్ గా కనిపించవచ్చు.
ఫేషియల్ వల్ల మీకు తెలియకుండా కలిగే సైడ్ ఎఫెక్ట్స్..
ముఖంపై ముడతలకు ప్రీమెచ్యూర్, మీ చర్మం ఎలాస్టిసిటీని, మాయిశ్చరైజర్ ని కోల్పోవడం వల్ల కూడా చర్మంపై ముడతలు ఏర్పడతాయి. ఏజింగ్, స్మోకింగ్, ఒత్తిడి, పోషకాలు అందకపోవడం, డీహైడ్రేషన్, కాలుష్యం వంటి కారణాల వల్ల చర్మంపై ముడతలు ఏర్పడతాయి. ఒకవేళ మీ ముఖంపై ఫైన్ లైన్స్ ని గుర్తించారంటే.. వెంటనే హానికర ట్రీట్మెంట్స్ ఫాలో అవకండి. ఎందుకంటే.. అవి చర్మంపై దుష్ర్పభావం చూపడమే కాదు.. అవి పనిచేస్తాయన్న నమ్మకం కూడా లేదు.
డ్రై అండ్ డ్యామేజ్ జుట్టుని స్మూత్ గా మార్చే హోం రెమిడీస్
కాబట్టి చర్మంపై ముడతలు గుర్తించిన వెంటనే.. హోం రెమిడీస్ పై ఓ లుక్కేయండి. ఈ హోం రెమిడీస్ మొదట్లో నెమ్మదిగా పనిచేసినా.. తర్వాత అమేజింగ్ ఫలితాలు అందిస్తాయి. కాబట్టి అలాంటి రెమిడీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

పాల పొడి, తేనె
2 టేబుల్ స్పూన్ల తేనె, 2 టేబుల్ స్పూన్ల గోరువెచ్చని నీళ్లు, పాల పొడి తీసుకుని అన్నింటినీ బాగా మిక్స్ చేయాలి. గడ్డలు లేకుండా మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. దీన్ని ముఖానికి ఒక లేయర్ లా అప్లై చేయాలి. 10 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. పాల పొడి చర్మాన్ని స్మూత్ గా మారుస్తుంది. తేనె చర్మానికి గ్లో ఇస్తుంది.

గ్రీన్ టీ
గ్రీన్ టీ చర్మాన్ని డెటాక్సిఫై చేస్తుంది. కాబట్టి ప్రతి రోజూ గ్రీన్ టీ తాగుతూ ఉండాలి. దీనివల్ల అనేక బెన్ఫిట్స్ పొందవచ్చు. ముడతలు లేని చర్మాన్ని ఇవ్వడంతో పాటు, ముఖంపై గుంతలు కనిపించకుండా చేసి.. నిగారింపు చర్మాన్నిస్తుంది.

ఆలివ్ ఆయిల్
ఆలివ్ ఆయిల్ తో రెగ్యులర్ గా మసాజ్ చేస్తే.. మంచి ఫలితం ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఏ, ఈ పుష్కలంగా ఉంటాయి. దీన్ని తేనె లేదా గ్లిజరిన్ లో మిక్స్ లో చేసి రాకుంటే.. డెడ్ సెల్స్ నివారించి, చర్మాన్ని కొత్త మెరుపు అందిస్తుంది. ఆలివ్ ఆయిల్ గ్రేట్ యాంటీ ఏజింగ్ ప్రొడక్ట్.

అలోవెరా
చర్మానికి ఎలాస్టిటీ పెంచడంలో అలో వెరా ఎఫెక్టివ్ గా హెల్ప్ చేస్తుంది. ఇందులో మాలిక్ యాసిడ్ ఉండటం వల్ల ముడతలు తగ్గిస్తుంది. కాబట్టి అలోవెరా తీసుకుని దానిలో జెల్ బయటకు తీయాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి.. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

అరటిపండు గుజ్జు
రెండు బాగా పండిన అరటిపండ్లను మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దీన్ని ముఖానికి అప్లై చేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. తర్వాత కండిషనింగ్ లోషన్ తో మసాజ్ చేయాలి. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేసి, డ్రై నెస్ తొలగించి.. యంగ్ లుక్ అందిస్తుంది.

అల్లం టీ
అల్లం టీ ఎఫెక్టివ్ యాంటీ వ్రింకిల్ రెమెడీ. రోజుకి రెండుసార్లు అల్లం టీ తాగడం వల్ల మంచి పోషణ అందుతుంది. అల్లంలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల టాక్సిన్స్ ని బయటకు పంపి, బ్లడ్ సర్క్యులేషన్ ని మెరుగుపరుస్తుంది. చర్మం యంగ్ గా కనిపించడానికి సహాయపడుతుంది.

రైస్ పౌడర్, రోజ్ వాటర్
కొద్దిగా రైస్ పౌడర్ తీసుకుని రోజ్ వాటర్ కలపాలి. పేస్ట్ తయారు చేసుకుని.. ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. రైస్ పౌడర్ కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి, స్కిన్ ఎలాస్టిసిటీని పెంచుతుంది.

కొబ్బరినూనె
ఇది న్యాచురల్ మాయిశ్చరైజర్. డైలీ ఉపయోగించడం వల్ల చర్మం హైడ్రేట్ అవుతుంది. యంగ్ గా కనిపిస్తారు. ఉదయం లేదా రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని కొబ్బరినూనెతో మసాజ్ చేసుకుంటే చాలు. చర్మం అలసిపోకుండా.. న్యాచురల్ గ్లో అందిస్తుంది.



Click it and Unblock the Notifications