Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
30 ఏళ్లు దాటిన మహిళలు అందం విషయంలో ఎలాంటి కేర్ తీసుకోవాలి ?
వయసు మరిచిపోయి జీవితాన్ని అనుభవించాలని ఒక ఫేమస్ రచయిత చెప్పాడు. కానీ.. మనుషులకు అది చాలా కష్టం. వయసు మరిచిపోవడం అనేది మనుషులకు సాధ్యం కానిది. ఎందుకంటే.. చర్మం విషయంలో అది చెప్పకనే కనిపిస్తుంది. వయసు పెరిగే కొద్దీ.. చర్మంలో వచ్చే మార్పులు.. వయసును ఇట్టే ప్రతిబింబిస్తాయి.
ముడతలు, ఫైన్ లైన్స్, పిగ్మెంటేషన్ రకరకాల మార్పులు.. ఏజింగ్ ని సూచించడానికి ప్రధాన లక్షణాలు కావచ్చు. 30 ఏళ్ల వయసు దాటిందని.. తెలుపుతాయి ఈ లక్షణాలు. ఈ సంకేతాలన్నీ.. మీ అందాన్ని దెబ్బతీయడమే కాకుండా.. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పైనా ప్రభావం చూపుతాయి. కాబట్టి 30 ఏళ్లలో ఖచ్చితంగా చర్మంపై సరైన కేర్, అటెన్షన్ చాలా అవసరం.
ఈ టిప్స్ ఫాలో అవడం వల్ల.. మీ చర్మం ఆరోగ్యం, ఆకర్షణ రెండు పెరుగుతాయి. మీలో వయసు ఛాయలు కనిపించకుండా అందంగా ఆకట్టుకోవడానికి సహాయపడతాయి. మరి.. 30 ఏళ్లలో 20 ఏళ్ల యంగ్ లుక్ సొంతం చేసుకోవడానికి ఫాలో అవ్వాల్సిన సింపుల్ టిప్స్ ఏంటో తెలుసుకోండి..

ఎక్కువ నీళ్లు తాగడం
చాలామంది ఈ టిప్ ఫాలో అవడంలో నిర్లక్ష్యం చేస్తారు. మిమ్మల్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం వల్ల.. చర్మానికి చాలా సహాయపడుతుంది. 30లోకి అడుగుపెట్టిన వాళ్లు.. నీళ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల.. హెల్తీగా ఉండటమే కాదు.. చర్మంలో వయసు పెరిగిన గుర్తులు కనిపించకుండా ఉంటుంది. చర్మం హెల్తీగా ఉంటుంది.

యాంటీ ఏజింగ్ ఫేస్ మాస్క్
యాంటీ ఏజింగ్ మాస్క్ లు అంటే.. ముఖ్యంగా హోంమేడ్ అయితే.. అద్భుతంగా పనిచేస్తాయి. మీ స్కిన్ టోన్ ని మెరుగుపరుస్తాయి. కనీసం వారానికి 2 నుంచి 3 సార్లు.. హోంమేడ్ యాంటీ ఏజింగ్ ఫేస్ ప్యాక్ అప్లై చేయడం వల్ల యంగ్ గా కనిపిస్తారు.

ఎక్స్ ఫోలియేషన్
ఎక్స్ ఫోలియేషన్ ద్వారా చర్మంపై డెడ్ స్కిన్ సెల్స్ తొలగించి.. చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చుకోవచ్చు. పంచదార, నిమ్మ, తేనెలతో స్క్రబ్ తయారు చేసుకుని ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.

హెల్తీగా ఉండటం
మీ ఏం తింటే అలా ఉంటారు మీరు. అంటే.. హెల్తీ ఫుడ్స్ తీసుకుని, రెగ్యులర్ గా వ్యాయామం చేయడం, హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవడం వల్ల హెల్తీగా ఉంటారు. ఈ హ్యాబిట్స్ అన్నీ మీకు యంగ్ లుక్ తీసుకొస్తాయి.

సన్ స్క్రీన్
సన్ స్క్రీన్ రాసుకోకుండా.. ఎట్టిపరిస్థితుల్లో బయటకు వెళ్లకండి. ఇది చర్మానికి మంచి రక్షణ ఇస్తుంది. యూవీ రేస్ స్కిన్ ని మళ్లీ నయం చేయలేని విధంగా డ్యామేజ్ చేస్తాయి.

నైట్ క్రీమ్స్
నైట్ క్రీమ్స్ ముఖ్యంగా 30 ఏళ్ల మహిళలకు అందుబాటులో ఉండేవి ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. రాత్రంతా వాడిని చర్మానికి ఉంచడం వల్ల.. చర్మానికి పోషణ అందించి, ఏజ్ అయిన లక్షణాలు కనిపించకుండా చేస్తుంది. న్యాచురల్ పదార్థాలు ఉండేవాటిని ఉపయోగించడం మంచిది.

మాయిశ్చరైజర్
చర్మాన్ని ఎల్లప్పుడూ మాయిశ్చరైజర్ ఉంచడం చాలా అవసరం. లేదంటే.. ఏజ్ అయినట్టు కనిపిస్తారు. 30 ఏళ్లు దాటిన మహిళలకు మాయిశ్చరైజర్ చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే.. వాళ్ల చర్మం డ్రైగా మారే అవకాశం ఉంటంుది. కాబట్టి ఏజింగ్ సంకేతాలు కనిపించకుండా చేయడంలో మాయిశ్చరైజర్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.



Click it and Unblock the Notifications