Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
7 రోజుల్లో మెరిసే చర్మం పొందడం ఎలా ?
మీరు చాలా ఫెయిర్ గా మారాలనుకుంటున్నారా ? ప్రకాశవంతమైన చర్మంతో.. నలుగురిలో ఎట్రాక్టివ్ గా కనిపించాలనుకుంటున్నారా ? ఇది మీ ఒక్క కోరిక మాత్రమే కాదు. చాలామంది.. మెరిసే చర్మం పొందాలని కోరుకుంటారు. అందుకే ఫెయిర్ స్కిన్ కోసం స్కిన్ లైటెనింగ్ క్రీమ్స్, పిల్స్ వాడుతూ ఉంటారు. కానీ.. ఈ క్రీములలో డేంజరస్ కెమికల్స్ ఉంటాయి. ఇవి చర్మంపై దురద, ఇన్ఫెక్షన్స్ సోకే ప్రమాదం ఉంది.

ప్రకాశవంతమైన చర్మం పొందడానికి న్యాచురల్ పద్ధతులు ఎంచుకుంటే మంచిది. స్కిన్ ని బ్రైట్ గా మార్చడానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా.. సేఫ్టీగా ఉండే న్యాచురల్ రెమిడీస్ చాలానే ఉన్నాయి. ఈ పదార్థాలతో మీరు 7 రోజుల్లో తెల్లగా మారిపోవచ్చు. ఫెయిర్, బ్రైట్ స్కిన్ పొందడానికి ఇవి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. చేయాల్సిందల్లా ఒక్కటే.. రెగ్యులర్ గా ఈ రెమిడీస్ ఫాలో అవడం.
పొడి చర్మం: హోం మేడ్ నేచురల్ ఫేస్ ప్యాక్

టమోటా జ్యూస్
సగం టమోటా గుజ్జుకి ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, ఒక టేబుల్ స్పూన్ తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడపై బాగా రుద్దాలి. 5 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై పేరుకున్న డెడ్ స్కిన్ సెల్స్ తగ్గిపోయి, చర్మాన్ని యూవీ కిరణాల నుంచి కాపాడి, జిడ్డు తనం తగ్గించి మెరిసేలా చేస్తుంది.

బొప్పాయి, దోసకాయ
బొప్పాయి, దోసకాయ ముక్కలను సమానంగా తీసుకుని మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. అందులోకి ఒక టేబుల్ స్పూన్ తాజా మీగడ కలిపి.. ముఖానికి, మెడకి అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఈ ప్యాక్ లో స్కిన్ వైటెనింగ్ ఎంజైమ్స్, హెల్తీ విటమిన్స్, పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి నల్లటి మచ్చలు, పిగ్మెంటేషన్ ని తగ్గించి.. కొంతకాలంలో.. ఫెయిర్ స్కిన్ పొందేలా చేస్తాయి.
స్కిన్ పిగ్మెంటేషన్ ను నివారించే ఉత్తమ హోం రెమెడీస్

పసుపు, పెరుగు
వెంటనే ఫెయిర్ అండ్ లవ్లీగా మారిపోవాలంటే.. ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఒక టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ తేనె, 3 టేబుల్ స్పూన్ల పెరుగు కలిపి 20 నిమిషాల పాటు ఫ్రిజ్ లో పెట్టాలి. ఆ తర్వాత చల్లగా ఉన్న ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 15 నిమిషాల తర్వాత కడిగేసుకుంటే.. ఫెయిరీ స్కిన్ మీ సొంతం.

ఆరంజ్
ఆరంజ్ జ్యూస్ లో ఉండే విటమిన్ సి, విటమిన్ ఏ న్యాచురల్ ఫెయిర్ నెస్ తీసుకొస్తాయి. 3 టేబుల్ స్పూన్ల ఆరంజ్ జ్యూస్ లో దూది ముంచి ముఖంపై అప్లై చేయాలి. 5 నుంచి 7 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే సరి. ఇలా వారం రోజులు కంటిన్యూగా చేస్తే.. నిగారింపు మీ సొంతం.



Click it and Unblock the Notifications