For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫెయిర్ నెస్ స్కిన్ పొందడం కోసం సింపుల్ బ్యూటీ టిప్స్

|

సాధారణంగా ఫేస్ ప్యాక్ ను చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడం కోసం మరియు మరింత అందంగా కనబడుట కోసం వివిధ రకాల ఫేస్ ప్యాక్ లను వేసుకుంటుంటారు. ముఖ్యంగా ప్రకటనల్లో వచ్చే క్రీములను, మార్కెట్లో లభించే రసాయనిక క్రీములను అప్లై చేయడం వల్ల స్కిన్ కంప్లెక్షన్ లో ఎలాంటి మార్పులుండవు. దానికి తోడు, ఖర్చైతో కూడిన పని. కాబట్టి, చర్మ సౌందర్యం మెరుగుపరుచుకోవడానికి హోం మేడ్ ఫేస్ ప్యాక్ లను వారానికొకసారి అప్లై చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

ఈ హోం మేడ్ ఫేస్ ప్యాక్స్ మీ చర్మంను ఫెయిర్ గా మార్చుతుంది. ఎందుకంటే వీటిలో బ్లీచింగ్ లక్షనాలు ఎక్కువగా ఉండటం వల్ల స్కిన్ టోన్ ను మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా ఫేస్ ప్యాక్ ల కోసం ఉపయోగించే అన్ని రకాల ఫేస్ ప్యాక్ లలో నిమ్మరసం జోడించబడి ఉంటుంది. ఎందుకంటే వీటిలో బ్లీచింగ్ ప్రోపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీ స్కిన్ కంప్లెక్షన్స్ (చర్మం యొక్క సహజ రంగు)ను మెరుగుపరచడంలో మరియు చర్మంలో డార్క్ స్పాట్స్ ను నివారించడంలో నిమ్మరసం గ్రేట్ గా సహాయపడుతుంది.

మరో విధంగా చర్మం టానింగ్ కు గురి అయినప్పుడు కూడా ఈ ఫేస్ ప్యాక్స్ గ్రేట్ గా సహాయపడుతాయి. డార్క్ కంప్లెక్షన్ నివారించే ఫేస్ ప్యాక్స్ సెన్సిటివ్ స్కిన్ కు కూడా ఉపయోగించవచ్చు. ఎందుకంటే వీటి వల్ల చర్మానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అయితే మీరు ఏదైనా స్కిన్ అలర్జీ ఉన్నట్లైతే ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసి తర్వాత నేరుగా ముఖానికి అప్లై చేసుకోవచ్చు. ప్రకాశవంతమైన చర్మం పొందడానికి న్యాచురల్ పద్ధతులు ఎంచుకుంటే మంచిది. స్కిన్ ని బ్రైట్ గా మార్చడానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా.. సేఫ్టీగా ఉండే న్యాచురల్ రెమిడీస్ చాలానే ఉన్నాయి. ఈ పదార్థాలతో మీరు 7 రోజుల్లో తెల్లగా మారిపోవచ్చు. ఫెయిర్, బ్రైట్ స్కిన్ పొందడానికి ఇవి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. చేయాల్సిందల్లా ఒక్కటే.. రెగ్యులర్ గా ఈ రెమిడీస్ ఫాలో అవడం.

1. టమోటా జ్యూస్:

1. టమోటా జ్యూస్:

సగం టమోటా గుజ్జుకి ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, ఒక టేబుల్ స్పూన్ తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడపై బాగా రుద్దాలి. 5 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై పేరుకున్న డెడ్ స్కిన్ సెల్స్ తగ్గిపోయి, చర్మాన్ని యూవీ కిరణాల నుంచి కాపాడి, జిడ్డు తనం తగ్గించి మెరిసేలా చేస్తుంది.

2. బొప్పాయి:

2. బొప్పాయి:

దోసకాయ బొప్పాయి, దోసకాయ ముక్కలను సమానంగా తీసుకుని మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. అందులోకి ఒక టేబుల్ స్పూన్ తాజా మీగడ కలిపి.. ముఖానికి, మెడకి అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఈ ప్యాక్ లో స్కిన్ వైటెనింగ్ ఎంజైమ్స్, హెల్తీ విటమిన్స్, పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి నల్లటి మచ్చలు, పిగ్మెంటేషన్ ని తగ్గించి.. కొంతకాలంలో.. ఫెయిర్ స్కిన్ పొందేలా చేస్తాయి. స్కిన్ పిగ్మెంటేషన్ ను నివారించే ఉత్తమ హోం రెమెడీస్.

3. పసుపు:

3. పసుపు:

పెరుగు వెంటనే ఫెయిర్ అండ్ లవ్లీగా మారిపోవాలంటే.. ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఒక టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ తేనె, 3 టేబుల్ స్పూన్ల పెరుగు కలిపి 20 నిమిషాల పాటు ఫ్రిజ్ లో పెట్టాలి. ఆ తర్వాత చల్లగా ఉన్న ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 15 నిమిషాల తర్వాత కడిగేసుకుంటే.. ఫెయిరీ స్కిన్ మీ సొంతం.

4. ఆరంజ్:

4. ఆరంజ్:

ఆరంజ్ జ్యూస్ లో ఉండే విటమిన్ సి, విటమిన్ ఏ న్యాచురల్ ఫెయిర్ నెస్ తీసుకొస్తాయి. 3 టేబుల్ స్పూన్ల ఆరంజ్ జ్యూస్ లో దూది ముంచి ముఖంపై అప్లై చేయాలి. 5 నుంచి 7 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే సరి. ఇలా వారం రోజులు కంటిన్యూగా చేస్తే.. నిగారింపు మీ సొంతం.

5. బాదం:

5. బాదం:

బాదాంపప్పును మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ కు రోజ్ వాటర్ చేర్చి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు పట్టించి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల మీ ముఖం, మెడ సహజ సౌందర్యాన్ని పొందుతుంది. కొబ్బరి నీళ్ళు కీరదోసయను మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రెగ్యులర్ గా ముఖం, మెడ, చేతులకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది అప్లై చేసిన అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్ర పరచుకోవడం వల్ల దుమ్ము, ధూళిని పోగొట్టి, ఎండ వేడిమి నుండి చర్మాన్ని కాపాడి, ముఖాన్ని కాంతివంతంగా మార్చుతుంది.

6. గంధం:

6. గంధం:

ముఖంగా ప్రకాశవంతంగా మెరవడానికి ప్రతి రోజూ పసుపు, గంధం పొడి రెండూ మిక్స్ చేసి అందులో రోజ్ వాటర్ కానీ, లేదా పాలు కానీ లేదా అలోవరా జెల్ కానీ కలిపి మెత్తటి పేస్ట్ లా తయారు చేసుకొని ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల శరీర ఛాయ పెరుగుదులకు దోహదపడుతుంది. చర్మం మంచి రంగును సంతరించుకొంటుంది.

7. అలోవెర:

7. అలోవెర:

ఆలోవెరా జెల్ ని షాంపూలాగా ఫేష్ వాష్ కు ఉపయోగించవచ్చు. ఈ ఆలోవెరా జెల్ లో చర్మానికి ఉపయోగపడే తగినన్ని పోషకాలు ఉన్నాయి. అలాగే ఇది క్లెన్సర్ గా కూడా ఉపయోగపడుతుంది. ఈ జెల్ ను తరచూ వాడడం వల్ల చర్మ ఛాయ మెరుగుపడతుంది.

8. దాల్చిన చెక్క:

8. దాల్చిన చెక్క:

సాధారణంగా మనం ఇంట్లో తరచూ కూరల్లో ఉపయోగించే దాల్చిన చెక్కను తీసుకొని బాగా మెత్తని పొడి చేసి, అందులో కొద్దిగా తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్ర పరచుకొన్నట్లైతే ముఖంలో ఫెయిర్ నెస్ వస్తుంది.

9. బాదం ఆయిల్ :

9. బాదం ఆయిల్ :

మీ చర్మాన్ని బాదాం ఆయిల్ లేదా ఆలివ్ ఆయిల్ తో మసాజ్ చేయడం వల్ల సున్నితమైన, మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది. ఇంకా ఇందులో ముసాజ్ చేసే ముందు కుంకుమ పువ్వు వేసుకొని మసాజ్ చేయడం వల్ల మరింత మెరుపునిస్తుంది. ఇదే పద్దతి ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు కూడా చేయవచ్చు.

10. పుదీనా:

10. పుదీనా:

ముఖంలో మంచి మెరుపు కోసం పుదీనా ఆకులును బాగా మెత్తగా పేస్ట్ చేసి, ముఖం, మెడకూ బాగా పట్టించి ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్ర పరచుకోవాలి.

11. నిమ్మరసం-కీరదోస:

11. నిమ్మరసం-కీరదోస:

అలాగే రెండు చెంచాల నిమ్మరసం, రెండు చెంచాల కీరదోసకాయ రసం రెండు బాగా మిక్స్ చేసి ముఖానికే కాకుండా పూర్తి శరీరానికంతటికీ పట్టించి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల శరీరం, ముఖం తాజాగా మెరుస్తుంటుంది. ఫ్రెష్ నెస్ ను కలిగిస్తుంది. ఒక వేళ పొడి చర్మం కలిగిన వారైతే తేనె మరియు నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి తర్వాత శుభ్ర పరచుకొంటే మంచి ఫలితం ఉంటుంది.

English summary

Natural Remedies to Get Fairness Skin in Fast..!

Skin Care tips in Telugu. These face packs that make your skin fair have bleaching properties which enhance the skin tone. Lemon is one of the main ingredients that is added to most of the face packs as it has the highest amount of bleaching properties.
Story first published:Thursday, July 21, 2016, 11:51 [IST]
Desktop Bottom Promotion