For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముఖంపై అన్ వాంటెడ్ హెయిర్ ఇబ్బంది పెడుతోందా ?

By Swathi
|

ముఖంపై అన్ వాంటెడ్ హెయిర్ ఉంటే అమ్మాయిలకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి కండిషన్ లో ఉన్నవాళ్లు బయటకు వెళ్లడానికి కూడా ఇబ్బంది పడతారు. అందుకే ఈ అన్ వాంటెడ్ హెయిర్ రిమూవ్ చేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అలాగే మార్కెట్ లో అవాంఛిత రోమాలు తొలగించడానికి అనేక పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. థ్రెడ్డింగ్, వ్యాక్సింగ్, ఎలక్ర్టాలసిస్ వంటి పద్ధతులు అందుబాటులో ఉన్నాయి.

READ MORE: చర్మ నిగారింపు కోసం తేనెతో ఫేస్ ఫ్యాక్...

కానీ కొంచెం ఓపిక, తీరిక తీసుకుంటే.. న్యాచురల్ రెమిడీస్ ఫాలో అయితే ముఖంపై హెయిర్ తొలగించడం చాలా ఈజీ. ఇవి చాలా చీప్ మాత్రమే కాదు.. సురక్షితం కూడా. కాకపోతే రెగ్యులర్ గా ప్రయత్నిస్తేనే ఫలితాలు పొందవచ్చు. రెగ్యులర్ గా ఈ రెమిడీస్ ఫాలో అయితే.. పర్మనెంట్ గా అవాంఛిత రోమాలకు చెక్ పెట్టవచ్చు.

turmeric

పసుపు
ముఖంపై అవాంఛిత రోమాలు తొలగించడానికి పసుపు ఉపయోగించడం వల్ల.. గ్రోత్ తగ్గడమే కాకుండా.. కొత్తగా అన్ వాంటెడ్ హెయిర్ వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. కాబట్టి పసుపుని నీటితో కలిపి పేస్ట్ లా తయారు చేసుకుని ముఖానికి రెగ్యులర్ గా అప్లై చేస్తూ ఉంటే.. ముఖంపై అవాంఛిత రోమాల సమస్యకు గుడ్ బై చెప్పవచ్చు.

READ MORE: మీరు ఎంతటి ఆరోగ్యవంతలో మీ ఫేస్ ను బట్టి తెలుసుకోవచ్చు...

శనగపిండి
ముఖంపై హెయిర్ రిమూవ్ చేయడానికి శనగపిండి ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. శనగపిండి, పసుపు, నిమ్మరసం, మీగడను పేస్ట్ లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో.. గుండ్రంగా రుద్దుతూ క్లీన్ చేసుకుంటే మంచి ఫలితం పొందవచ్చు.

egg white

గుడ్డులోని తెల్లసొన
గుడ్డులోని తెల్లసొన, పంచదార, కార్న్ ఫ్లోర్ కలిపి మిశ్రమం తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ ని ముఖంపై హెయిర్ గ్రోత్ ఉన్న ప్రాంతంలో రాసుకోవాలి. అది ఆరిన తర్వాత తడి చేతులతో.. రబ్ చేయాలి. ఇది చర్మంపై చాలా ఎఫెక్టివ్ గా పనిచేసి.. చర్మంపై అవాంఛిత రోమాలను తొలగిస్తుంది.

READ MORE: ఎదటివాళ్ల మనస్తత్వం తెలుసుకోవడానికి ఫేస్ చూస్తే చాలు !! READ MORE: ఎదటివాళ్ల మనస్తత్వం తెలుసుకోవడానికి ఫేస్ చూస్తే చాలు !!

బొప్పాయి
బొప్పాయి గుజ్జు, పసుపు, పచ్చి పాలు కలిపి ముఖానికి అప్లై చేస్తే.. అన్ వాంటెడ్ హెయిర్ ఈజీగా తొలగిపోతాయి. పపాయ చర్మంపై బ్లీచింగ్ ఏజెంట్ లా పనిచేస్తుంది. ఈ సింపుల్ టిప్ ని రెగ్యులర్ గా ఫాలో అయితే మంచి రిజల్ట్స్ పొందవచ్చు.

green gram

పెసరపిండి
పెసరపిండిన రోజ్ వాటర్, నిమ్మరసం కలిపి మిశ్రమం తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై అవాంఛిత రోమాలు ఉన్న ప్రాంతంలో అప్లై చేసి.. ఆరిన తర్వాత శుభ్రం చేసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు. నిమ్మరసం ఆస్ర్టిజెంట్ లా పనిచేస్తుంది.

English summary

Natural Remedies to get rid of Unwanted Facial Hair

Excessive facial hair is a touchy subject with many women. The benefit of these techniques is that the ingredients are readily available in our kitchens and are known to be generally agreeable to sensitive skins.
Story first published: Saturday, January 16, 2016, 13:51 [IST]
Desktop Bottom Promotion