Latest Updates
-
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే..
ఆరంజ్ ఫేస్ ప్యాక్ లతో 7రోజుల్లో మెరిసే చర్మ సౌందర్యం..!!
కేవలం గుజ్జుని మాత్రమే ఫేస్ ప్యాక్ లా ఉపయోగిస్తే మీరు పోషకాలు మిస్ అవుతారు. కాబట్టి ఆరంజ్ తొక్కలో ఎక్కువ పోషకాలు పొందవచ్చు. మరి ఆరంజ్ ఫేస్ ప్యాక్ లు ఉపయోగించి 7రోజుల్లో మెరిసే స్కిన్ పొందే టిప్స్.
పుల్లగా, కాస్త తియ్యగా ఉండే ఆరంజ్.. చర్మానికి అద్భుతాలు చేస్తుంది. ఆరంజ్ ఫేస్ ప్యాక్స్ లో పోషకాలు, ఫైటో న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మానికి అద్భుత ప్రయోజనాలు అందిస్తాయి. ఏజింగ్ లక్షణాలు, నిర్జీవమైన చర్మం, అదనపు ఆయిల్ తగ్గించడం వంటి రకరకాల ప్రయోజనాలు అందిస్తాయి.

ఆరంజ్ లో ఎక్కువ మొత్తంలో విటమిన్ సి ఉంటుంది. ఇది కణాలను నాశనం చేసే ఫ్రీరాడికల్స్ తో పోరాడుతుంది. ట్యాన్ తొలగించి.. చర్మానికి కొత్త నిగారింపు అందిస్తుంది. అలాగే ఆరంజ్ లో యాంటీ ఆక్సిడెంట్స్, క్యాల్షియం, చర్మానికి ఉపయోగపడే విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి.
ఇన్ని పోషకాలు.. డెడ్ స్కిన్ సెల్స్ ని తొలగించి, కొత్త కణాలు ఉత్పత్తి అవడానికి సహాయపడతాయి. అలాగే చర్మ రంధ్రాలను మూసుకుపోయేలా చేసి.. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఆరంజ్ ఫేస్ ప్యాక్ ని చర్మానికి ఉపయోగించేటప్పుడు చాలామంది చేసే పొరపాటు.. ఆరంజ్ గుజ్జు మాత్రమే ఉపయోగిస్తారు.
కానీ ఇలా కేవలం గుజ్జుని మాత్రమే.. ఫేస్ ప్యాక్ లా ఉపయోగిస్తే.. మీరు చాలా పోషకాలు మిస్ అవుతారు. కాబట్టి.. ఆరంజ్ తొక్కలో రెండింతలు ఎక్కువ పోషకాలు పొందవచ్చు. మరి ఆరంజ్ ఫేస్ ప్యాక్ లు ఉపయోగించి.. 7రోజుల్లో గ్లోయింగ్ స్కిన్ పొందడం ఎలాగో చూద్దాం..

ఆరంజ్, తేనె, పసుపు
ఒక టేబుల్ స్పూన్ ఆరంజ్, ఒక టీస్పూన్ తేనె, చిటికెడు పసుపు కలపాలి. అన్నింటినీ బాగా మిక్స్ చేసి.. ముఖాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత ఈ ప్యాక్ అప్లై చేయాలి. 15 నుంచి 30 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇది అలసిపోయిన చర్మానికి పోషణ అందిస్తుంది.

పెరుగు, ఆరంజ్
ఈ ప్యాక్ చర్మాన్ని హైడ్రేట్ చేసి స్మూత్ గా మారుస్తుంది. ఆరంజ్ పీల్ ని ఎండలో 24గంటలు ఎండబట్టి.. పౌడర్ చేసుకోవాలి. ఒక టీస్పూన్ ఈ పౌడర్ లో 1టేబుల్ స్పూన్ పెరుగు కలపాలి. మెత్తగా పేస్ట్ అయిన తర్వాత.. ముఖానికి, మెడకు అప్లై చేయాలి. 30 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

పాలు, ఆరంజ్ పౌడర్
ఈ మాస్క్ చర్మ రంధ్రాల్లో దుమ్ముని తొలగించి, మొటిమలను నివారించి.. సెబమ్ ఉత్పత్తిని కంట్రోల్ చేస్తుంది. ఒక టేబుల్ స్పూన్ ఆరంజ్ పీల్ పౌడర్, కొద్దిగా పాలు కలిపి పేస్ట్ చేసుకోవాలి. తర్వాత మైల్డ్ క్లెన్సర్ తో శుభ్రం చేసుకున్న తర్వాత.. ప్యాక్ అప్లై చేయాలి. బాగా ఆరిపోయిన తర్వాత.. నీళ్లు చల్లి.. స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లటినీటితో శుభ్రం చేసుకోవాలి.

గంధం, ఆరంజ్ పీల్ పౌడర్
ఒక టీస్పూన్ నారింజ తొక్కపొడి, అదే మోతాదులో గంధం, రోజ్ వాటర్ మిక్స్ చేసి పేస్ట్ చేసుకోవాలి. బ్రష్ ఉపయోగించి.. ప్యాక్ అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ చర్మంపై ట్యాన్ తొలగించి గ్లోయింగ్ గా మారుస్తుంది.

ఆరంజ్, ఓట్స్
1టీస్పూన్ వాల్ నట్ పౌడర్, టీస్పూన్ ఓట్స్ పౌడర్ లో అవసరమైనంత ఆరంజ్ జ్యూస్ కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఈ ప్యాక్ ని ముఖానికి అప్లై చేసి.. 20 నిమిషాల తర్వాత 2నిమిషాల పాటు స్క్రబ్ చేయాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. ఇలా తరచుగా చేస్తూ ఉంటే.. డెడ్ స్కిన్ లేయర్ తొలగిపోయి.. చర్మం సాఫ్ట్ గా మారుతుంది.

పాలమీగడ, ఆరంజ్
1 టీస్పూన్ ఆరంజ్ పౌడర్, 2టేబుల్ స్పూన్ల పాలమీగడ కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమంతో.. చర్మానికి 5నిమిషాలు మసాజ్ చేయాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంలో కొల్లాజెన్ లెవెల్ పెరిగి, ఎలాస్టిసిటీ పెరుగుతుంది. దీనివల్ల ఫైన్ లైన్స్ ను అరికట్టవచ్చు.

మసాజ్ కి
ఆరంజ్ పీల్ ని సగానికి మడిచి.. జ్యూస్ ని ముఖంపై పిండాలి. స్మూత్ గా జ్యూస్ ని వేలితో ముఖమంతా స్ప్రెడ్ చేయాలి. కాస్త మంటగా అనిపించవచ్చు. కానీ 5 నిమిషాల అలానే వదిలేసి.. శుభ్రం చేసుకుంటే.. చర్మం గ్లోయింగ్ గా మారుతుంది.



Click it and Unblock the Notifications