Latest Updates
-
గుండెకు బ్యాడ్ మార్నింగ్.. ఆ సమయాల్లో ఆహార ఎంపికలతో పెను ముప్పు.! -
జూన్ 26 సాయంత్రం ఈ 5 రాశుల వారికి అదృష్టం.. ధనయోగం, కెరీర్ సక్సెస్ మీ సొంతం! -
ఈరోజు సాధ్య యోగం.. ఈ పనులు మొదలుపెడితే తిరుగులేని విజయం మీదే! -
ఒత్తిడికి గురవుతున్నారా.. ఇది మీ జుట్టుపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసా.? -
హిందూ ధర్మంలో క్షేత్రపాలక దేవతల పాత్ర ఏమిటి? -
వృశ్చిక రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారు ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త! -
ఇడ్లీ, దోశలు కాదు..జుట్టు రాలడం తగ్గించి, రోగనిరోధక శక్తి పెంచే సూపర్ హెల్తీ బ్రేక్ ఫాస్ట్ కరివేపాకు ఉప్మా.. -
తుల, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. భారీ ధనలాభం! - శుక్రవారం, 26 జూన్ 2026 -
భార్య ఎల్లప్పుడూ భర్తకి ఎడమవైపునే ఎందుకు కూర్చుంటుందో తెలుసా.? -
మగవారికి షాకింగ్ న్యూస్.. మీ శరీరంలో ఈ హార్మోన్ లెవెల్స్ పడిపోవడం గమనిస్తున్నారా.?
ఆరంజ్ ఫేస్ ప్యాక్‌తో డే అండ్ నైట్ ఫ్రెష్ లుక్
ఆరంజ్ ఆరోగ్యానికే కాదు.. అందానికి చాలా సూపర్ పవర్ ఉన్న రెమిడీ. ఇందులో రిచ్ గా ఉండే విటమిన్ సి చర్మ సౌందర్యానికి పవర్ ఫుల్ గా ఉపయోగపడుతుంది. ఆరంజ్ జ్యూస్ నుంచి తొక్క వరకూ అంతా ఉపయోగకరమో. వేస్ట్ అని తీసిపారేసే తొక్క కాదు.. ఆరంజ్ పీల్. అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మాన్ని స్మూత్ గా, హెల్తీగా మార్చేస్తాయి. మీరు మీ చర్మానికి యంగ్ అండ్ హెల్తీ లుక్ తీసుకురావాలని కోరుకుంటే.. ఇకపై రోజుకి ఒకసారి ఆరంజ్ ప్యాక్ అప్లై చేయండి.
బొప్పాయి ఆకులో మనకు తెలియని ఆరోగ్య రహస్యాలెన్నో..ఎన్నెన్నో...
ఆరంజ్ పీల్ అందానికి మంచిది అని చెప్పామని.. మార్కెట్ లో దొరికేది కాకుండా.. ఇంట్లోనే ఆరంజ్ తిన్న తర్వాత తొక్కలు పారేయకుండా.. హోంమేడ్ ఆరంజ్ పీల్ పౌడర్ తయారు చేసుకోండి. ఆరంజ్ పీల్ పౌడర్ తయారు చేసుకునే విధానమేంటో చూద్దాం. ముందు నారింజ తొక్కలను ముక్కలుగా కట్ చేయాలి. ఒక ట్రేలో వెడల్పుగా చల్లేసి.. ఎండలో 3 లేదా 4 రోజులపాటు ఎండనివ్వండి. పూర్తీగా ఎండిన తర్వాత మిక్సీ పట్టి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఒక డబ్బాలో నిల్వ ఉంచుకోవాలి. ఈ పౌడర్ ని రకరకాలుగా ఫేస్ కి అప్లై చేసుకోవచ్చు. మెరిసే చర్మం పొందడానికి ఈ నారింజ తొక్క పొడి ఎలా వాడుకోవాలో ఇప్పుడు చూద్దాం..

పెరుగు, తేనెతో
చర్మంపై డడ్ స్కిన్ సెల్స్ తొలగించి గ్లోయింగ్ స్కిన్ పొందడానికి పెరుగు సహాయపడుతుంది. అలాగే డార్క్ స్పాట్స్ తొలగించి, ఏజింగ్ ని నివారించవచ్చు. కాబట్టి 2 టీ స్పూన్ల ఆరంజ్ పీల్ పౌడర్, 1 టీ స్పూన్ తేనె, 1 టీస్పూన్ పెరుగు తీసుకోవాలి. అన్నింటినీ బాగా మిక్స్ చేసి.. మందంగా ముఖంపై అప్లై చేసుకోవాలి. 15నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోవాలి. అంతే.. యంగ్ అండ్ బ్యూటీఫుల్ లుక్ సొంతం చేసుకోవచ్చు.

ఓట్ మీల్, ఆరంజ్ పీల్
మొటిమలతో బాధపడుతుంటే.. ఆరంజ్ పీల్ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి. ఇది డర్ట్, ఆయిల్ తగ్గించి బ్లాక్ హెడ్స్ ని కూడా తొలగిస్తుంది. 2 టీస్పూన్ల ఆరంజ్ పీల్ పౌడర్, 1 టీస్పూన్ ఓట్ మీల్, 1 టీ స్పూన్ బేకింగ్ సోడా తీసుకుని బాగా మిక్స్ చేయాలి. చేతివేళ్లతో ముఖానికి అప్లై చేసుకోవాలి. గుండ్రంగా మసాజ్ చేస్తూ నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

స్ర్కబ్
స్క్రబ్ చేసుకోవడానికి ఆరంజ్ పీల్ పౌడర్ అవసరం లేదు. డైరెక్ట్ గా నారింజ తొక్కతో స్క్రబ్ చేసుకోవచ్చు. ఒక కప్ లో కొద్దిగా పంచదార, కొంచెం ఆరంజ్ పీల్, కొంచెం తేనె, కొంచెం కొబ్బరినూనె కలిపి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని శరీరానికి కూడా ఉపయోగించవచ్చు. దీంతో స్ర్కబ్ చేయడం వల్ల స్కిన్ ప్రకాశవంతంగా మారుతుంది.

పాలు, నారింజ తొక్క పొడి
పాలు, నారింజ తొక్క పొడి సమానంగా తీసుకుని బాగా పేస్ట్ లా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, నెక్ కి పట్టించి 30 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ మాస్క్ స్కిన్ పై ఉండే అదనపు జిడ్డుని, మృతకణాలను తొలగించి చర్మం ప్రకాశించేలా చేస్తుంది.

క్లెన్సర్ మాస్క్
చర్మంపై ఉండే అదనపు ఆయిల్ ని తొలగించడంతో పాటు, చర్మాన్ని హైడ్రెట్ చేస్తుంది ఈ మాస్క్. రెండు టీ స్పూన్ల ఆరంజ్ పీల్ పౌడర్, 1 టీ స్పూన్ పాలు, 1 టీస్పూన్ కొబ్బరినూనె తీసుకుని అన్ని బాగా మిక్స్ చేయాలి. ఈ మాస్క్ తరచుగా వేసుకోవడం వల్ల.. చర్మం అందం, స్మూత్ గా మారుతుంది.

గ్లోయింగ్ స్కిన్ కి
నారింజ తొక్క పొడి, ఎండిన నిమ్మ ఆకులు, దానిమ్మ తొక్క అన్నింటినీ నిమ్మరసం కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఈ ప్యాక్ ని రెగ్యులర్ గా అప్లై చేస్తే.. చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. ఇది చాలా ఎఫెక్టివ్ గ్లో తీసుకొస్తుంది.

ఆరంజ్ పీల్ లిప్ బామ్
ఒక కప్పులో నారింజ తొక్క పొడి, చక్కెర, ఆల్మండ్ ఆయిల్ మిక్స్ చేయాలి. అయితే నారింత తొక్క పొడి ఎంత తీసుకుంటామో, అంత పరిమాణంలోనే పంచదార తీసుకోవాలి. ఈ లవ్లీ లిప్ బామ్.. మంచి సువాసన వెదజల్లుతూ.. మీ పెదాలకు స్మూత్ ఫీలింగ్ తీసుకొస్తుంది.

చర్మంపై ముడతలకు
2 టీస్పూన్ల నారింజ తొక్క పొడి, 1 టీస్పూన్ చందనం తీసుకుని రోజ్ వాటర్ కలిపి.. పేస్ట్ తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకి అప్లై చేసి అరగంట తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు అప్లై చేస్తూ.. యూత్ ఫుల్ గ్లోయింగ్ స్కిన్ పొందడమే కాకుండా.. చర్మంపై ముడతలు మాయమవుతాయి.

ముల్తానీ మట్టి
ఒక టేబుల్ స్పూన్ నారింజ తొక్క పొడి, 1 టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి, 2 టీస్పూన్ల పాలు తీసుకుని అన్నింటినీ కలిపి చక్కగా పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. రోజు మార్చి రోజు ఈ ప్యాక్ అప్లై చేయడం వల్ల ముఖంపై ఉండే నల్లటి మార్క్స్ తొలగిపోతాయి.



Click it and Unblock the Notifications