For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జిడ్డు చ‌ర్మాన్ని, ఆయిలీ స్కిన్ నివారించే.. బొప్పాయి ఫేస్ ప్యాక్స్..!!

By Swathi
|

బొప్పాయిలో పోషకాలతో పాటు అందాన్ని పెంచే గుణాలు కూడా ఉన్నాయి. చర్మం నిగారింపు సంతరించుకోవాలంటే బొప్పాయిని ఫేస్‌ప్యాక్‌గా వాడాల్సిందే. ఇది మృతకణాలను తొలగించి చర్మాన్ని మృదువుగా చేస్తుంది. కాబ‌ట్టి చ‌ర్మాన్ని బ‌ట్టి బొప్పాయితో ఎలాంటి ఫేస్‌ప్యాక్‌లు వేసుకోవాలో చూద్దాం.

బొప్పాయితో పాటు కొన్ని న్యాచుర‌ల్ ప‌దార్థాలు మిక్స్ చేసి అప్లై చేయ‌డం వ‌ల్ల‌.. అద్భుత‌మైన ఫ‌లితాలు పొంద‌వ‌చ్చు. ఇవి న్యాచుర‌ల్ గ్లోయింగ్‌ని, జిడ్డుని తొల‌గిస్తాయి. బొప్పాయిలో ఉండే పోష‌కాలు చ‌ర్మ సౌంద‌ర్యాన్ని రెట్టింపు చేస్తాయి.

యాంటీ ఏజింగ్‌ స్కిన్‌ :

యాంటీ ఏజింగ్‌ స్కిన్‌ :

బొప్పాయి గుజ్జులో ఒక టేబుల్‌స్పూన్‌ తేనె, ఒక టేబుల్‌ స్పూన్‌ గంధం వేసి బాగా కలుపుకుని ముఖానికి, మెడకు అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

డ్రై స్కిన్‌:

డ్రై స్కిన్‌:

కొన్ని బొప్పాయి ముక్కలను తీసుకుని గుజ్జుగా చేసి ఒక టేబుల్‌ స్పూన్‌ తేనె, పాలు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించాలి. ఈ ప్యాక్‌ను 20 నిమిషాల పాటు అలా వదిలేసి తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఈ ప్యాక్‌ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది.

ఆయిలీ స్కిన్‌ :

ఆయిలీ స్కిన్‌ :

బొప్పాయి గుజ్జులో ముల్తాని మట్టిని కలిపి ముఖానికి పట్టించాలి. ఈ మిశ్రమం ఆరిపోయే దాక ఉంచుకుని తర్వాత చల్లని నీటితో కడిగేసుకుంటే తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ముల్తాని మట్టి ముఖంపై వస్తున్న అదనపు ఆయిల్‌ను గ్రహిస్తుంది. బొప్పాయి మృదుత్వాన్ని అందిస్తుంది. మొటిమలు బాధిస్తున్నట్లయితే ఈ ప్యాక్‌ను ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

అన్ని రకాల స్కిన్‌ టైపులకు :

అన్ని రకాల స్కిన్‌ టైపులకు :

బొప్పాయిని గుజ్జుగా చేసుకుని అందులో రెండు టేబుల్‌ స్పూన్ల అలొవెరా జెల్‌ను కలిపి ముఖానికి, మెడకు పట్టించాలి. 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్‌ ఆయిల్‌ను కంట్రోల్‌ చేయడమే కాకుండా చర్మం పొడిబారిపోకుండా చూస్తుంది.

పిగ్మెంటేషన్‌ :

పిగ్మెంటేషన్‌ :

బొప్పాయి గుజ్జులో పది చుక్కల నిమ్మరసం వేసి బాగా కలియబెట్టి ముఖానికి ప్యాక్‌ మాదిరిగా వేసుకోవాలి. పదినిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచుగా చేయడం వల్ల ముఖంపై నల్లమచ్చలు కనుమరుగైపోతాయి.

English summary

Papaya Face packs and Masks for All Skin Types

Papaya Face packs and Masks for All Skin Types. Papaya can be extremely good when you desire for a healthy looking youthful glow. I will be sharing some good homemade papaya face packs and masks that will definitely give you a radiant and glowy skin.
Story first published:Saturday, August 13, 2016, 11:04 [IST]
Desktop Bottom Promotion