Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
మీ స్కిన్ కు బెస్ట్ ఫ్రెండ్ కుకుంబర్ : అదెలాగో మీరే చూడండి...
కుకుంబర్ కీరదోసకాయలోని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల వల్ల దీన్ని ఒక సూపర్ ఫుడ్ గా భావిస్తుంటారు . ఒక్క ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాదు, ఇందులో స్కిన్ మరియు హెయిర్ కు సంబంధించిన ఈక్వెల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. చర్మం విషయంలో వండర్ ఫుల్ గా పనిచేస్తుంది.
కీరదోసకాయలో 90శాతం నీళ్ళు ఉంటుంది. అవసరం అయిన న్యూట్రీషియన్స్ ముఖ్యంగా విటమిన్ సి మరియు కాఫిక్ యాసిడ్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది చాలా స్మూతింగ్ ఎఫెక్ట్ ను మరియు హైడ్రేషన్ ను మరియు చర్మానికి పునరుత్తేజాన్ని తీసుకొస్తుంది . ఇది చర్మం యొక్క దురద మరియు వాపును తగ్గిస్తుంది.
బ్రిలియంట్ ఐడియా: 7 రోజుల్లో 7 కేజీలు తగ్గే ఛాన్స్.. !
హెల్తీ స్కిన్ మెయింటైన్ చేయడానికి అమేజింగ్ బెనిఫిట్స్ ఉన్నాయి . కుకుంబర్లో బెనిఫీషియల్ న్యూట్రీషియన్స్ విటమిన్ కె, విటమిన్ సి, బీటా కెరోటిన్ మరియు మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యకరమైన చర్మం మరియు హెయిర్ హెల్త్ కు గ్రేట్ గా సహాయపడుతుంది. అంతే కాదు మంచి కండీషన్లో ఉంచుతాయి.
ఫేవ్ లెస్ స్కిన్ పొందడానికి కుకుంబర్ ను డైలీ బేసిస్ లో ఉపయోగించడం మంచిది. ఇది చర్మాన్ని తేమగా మరియు సాఫ్ట్ గా ఉంచుతుంది . మరియు చర్మంలోని టాక్సిన్స్ ను బయటకు ఫ్లష్ చేయడానికి సహాయపడుతుంది.
కీరదోసకాయ జ్యూస్ లోని ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు
అంతే కాదు, కుకుంబర్ కళ్ళ ఉబ్బు మరియు కళ్ల అలసటను నివారిస్తుంది.ఇందులో ఉండే స్మూతింగ్ ప్రొపర్టీస్ అలసిన కళ్ళకు ఉపశమనం కలిగిస్తుంది. ఇంకా ఇది స్కిన్ లైటనింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది , స్కిన్ కలర్ ఇంప్రూవ్ చేస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో ప్రయోజనాలను అందిస్తుంది. అందుకే ఈ ఆర్టికల్లో మరిన్ని బెనిఫిట్స్ ను మీ స్కిన్ హెయిర్ బ్యూటీని పెంచుకోవడానికి కొన్ని చిట్కాలను క్రింది లిస్ట్ ద్వారా తెలపడం జరిగింది.

సన్ బర్న్ నివారిస్తుంది:
సన్ బర్న్ నివారించడంలో కుకుంబర్ గ్రేట్ రెమెడీ. ఇది చర్మాన్ని స్మూత్ గా మరియు సపెల్ గా చేస్తుంది. ఇందులో ఉండే హీలింగ్ ప్రొపర్టీస్ సహాయపడుతుంది . ఇది చర్మంలోని ఎరుపును మరియు ఇరిటేషన్ ను తగ్గిస్తుంది . ఎఫెక్ట్ అయిన ప్రదేశంలో కుకుంబర్ స్లైస్ ను కొద్ది సమయం ఉంచితే ఎంతో ఉపశమనం కలుగుతుంది.

సెల్యులైట్ ను నివారిస్తుంది:
సెల్యులైట్ అనేది తొడలు, మోకాళ్లు, పిరుదుల, చేతులు మరియు స్టొమక్ మీద సహజంగా ఏర్పడుతుంటాయి. ఈ సమస్యను నివారించుకోవడానికి కీరదోసకాయ రసాన్ని తేనెతో మిక్స్ చేసి ఎఫెక్ట్ అయిన ప్రదేశంలో అప్లై చేయాలి. ఇది చర్మంను టైట్ చేయడానికి మరియు కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది.

స్కిన్ కలర్ మెరుగుపరుస్తుంది:
కీరదోసకాయ స్కిన్ లైటనింగ్ మరియు స్కిన్ టాన్ మెరుగుపరుస్తుంది మరియు స్కిన్ కలర్ ను పెంచడంలో బూస్ట్ లా పనిచేస్తుంది. కీరదోస రసానికి కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి చర్మానికి ఎఫెక్టెడ్ స్కిన్ కు అప్లై చేయడం వల్ల అద్భుతమైన ప్రకాశంతమైన చర్మం పొందవచ్చు.

.డార్క్ సర్కిల్స్ తగ్గిస్తుంది:
కళ్ళ క్రింద ఏర్పడ్డ డార్క్ సర్కిల్స్ ను తొలగిస్తుంది . కుకుంబర్ లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ మరియు సిలికా కళ్ళక్రింద వదులైన చర్మాన్ని టైట్ గా మార్చుతుంది. కళ్ళ మీద కీరదోస ముక్కలను పెట్టి కొద్దిసేపటి తర్వాత తీసేయాలి.

చర్మ రంద్రాలను క్లోజ్ చేస్తుంది మరియు టైట్ చేస్తుంది.
కుకుంబర్ స్కిన్ టోనర్ గా పనిచేస్తుంది. రోజ్ వాటర్, తేనె లేదా నిమ్మరసంలో కుకుంబర్ జ్యూస్ మిక్స్ చేసి ముఖానికి పట్టించడం ద్వారా చర్మ రంధ్రాలను టైట్ చేస్తుంది. ఈ మిశ్రమం ముఖం మొత్తం అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసిన కొద్దిసేపటికి శుభ్రం చేసుకోవచ్చు.

కళ్ళక్రింద ఉబ్బును తగ్గిస్తుంది:
కుకుంబర్ లో ఎక్కువగా ఆస్కారోబిక్ ఉండటం వల్ల వాటర్ రిటెన్షన్ తగ్గిస్తుంది. దాంతో శరీరంలో వాటర్ రిటెన్షన్ తగ్గుతుంది . కేవలం రెండు కుకుంబర్ స్లైస్ ను కళ్ళమీద పెట్టి కొద్ది సేటి తర్వాత తొలగించడం ద్వారా అలసని కళ్ళకు స్వాంతన కలుగుతుంది.

ముఖం కాంతిమంతంగా ఉండాలంటే
ముఖం కాంతిమంతంగా ఉండాలంటే రెండు టీ స్పూన్ల కీరదోసకాయ రసంలో రెండు టీ స్పూన్ల నిమ్మ రసం, రెండు టీ స్పూన్ల ముల్తానీ మట్టి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకుని 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మం మెరుస్తూ కోమలంగా ఉంటుంది

జిడ్డు పోయి ముఖం కాంతివంతంగా ఉంటుంది.
కీరదోసకాయ, కోడిగుడ్డు తెల్లసొన, టీ స్పూను నిమ్మరసం, గుప్పెడు పుదీనా ఆకులు... అన్నిటినీ మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్‌ను సుమారు పది నిమిషాల సేపు ఫ్రిజ్ లో ఉంచి తీసేయాలి. చల్లగా ఉండగానే ఈ పేస్ట్ ను ముఖానికి పట్టించాలి. పదిహేను నిమిషాల తరవాత ముఖాన్ని చన్నీటితో కడగాలి. ఇలాచేస్తే జిడ్డు పోయి ముఖం కాంతివంతంగా ఉంటుంది.

స్కిన్ కు తగినంత హైడ్రేషన్ అందిస్తుంది:
హైడ్రేషన్: కీర దోసకాయలో ప్రధానంగో నీరు ఎక్కువగా ఉంటుంది. ఇది సాధారణ నీరుతో పోల్చితే దీనిలోని నీరు చాలా ఉపయోగకరం. ఇందులో ఎన్నో ఔషధ గుణములు ఉన్నాయి. సి-విటమిన్, ఏ విటమిన్, పోలిక్ యాసిడ్, పొటాషియం, సిలికా, మేగ్నిషియంలకు కీరాదోసకాలయులు మంచి నిల్వలు. శరీరంలో పేరుకున్న వ్యర్ధ, విష పదార్ధములను చక్కగా తొలగించగలదు. శరీరంలోని ఉష్గోగ్రతను నియంత్రిస్తుంది. చర్మాన్ని ఎప్పుడూ తేమగా(హైడ్రేటషన్ లో) ఉంచడానిక చాలా బాగా సహాయపడుతుంది.

మృతచర్మం తొలగిపోతుంది.
రెండు చెంచాల కీరరసానికి చెంచా పాలు, రోజ్‌వాటర్ చేర్చి.. ముఖానికి రాసుకుని మర్దనా చేస్తే, మృతచర్మం తొలగిపోతుంది.

డ్రై స్కిన్ నివారిస్తుంది
ముఖంపై చర్మం తరచు పొడిబారుతుంటే, కీరదోస గుజ్జులో కాస్త పెరుగు, శనగపిండి కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, అరగంట సేపు ఆరనిచ్చాక గోరువెచ్చని నీటితో కడిగేస్తే చాలు. ముఖానికి కాంతి వస్తుంది.

ముడతలు మాయం
ముఖంపై ముడతలు మొదలవుతుంటే... ముల్తానీమట్టిలో కీరదోస గుజ్జును, కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా రోజ్ వాటర్ కలిపి ముఖానికి పట్టించండి. ఈ మిశ్రమం పూర్తిగా ఆరిపోయిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి.

జుట్టు ఆరోగ్యానికి:
కీరదోసకాయలో ఉండే సిలికాన్ మరియు సల్ఫర్ జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది. పాలకూర, క్యారెట్ రసాలకు కాస్త కీర రసం కలపి తరచు తాగితే శీరోజాలు చక్కగా పెరుగుతాయి.

జుట్టు ఆరోగ్యానికి:
శిరోజాలు చిక్కుపడుతున్నాయా? గుడ్డులోని తెల్లసొనకు రెండు చెంచాల ఆలివ్‌నూనె, కొద్దిగా కీరగుజ్జును కలిపి కుదుళ్లకు పట్టించి, అరగంటయ్యాక తలస్నానం చేస్తే సరిపోతుంది.

జుట్టు ఆరోగ్యానికి:
వారానికోసారి కీర, క్యారెట్ రసాలను తలకు రాసుకుంటే, జుట్టు రాలకుండా ఆరోగ్యంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications











