For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టుకి, చర్మానికి నువ్వుల నూనె అందించే అద్భుత ప్రయోజనాలు..!!

By Swathi
|

నువ్వుల నూనెను ఇండియాలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇందులోని అమోఘమైన హెల్త్ బెన్ఫిట్స్ మనందరికీ బాగా తెలుసు. కానీ..వాటిని చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఇది ఆరోగ్యానికే కాదు.. చర్మ సౌందర్యానికి, జుట్టు సౌందర్యానికి కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

చర్మ ఆరోగ్యానికి నువ్వుల నూనె ఏంతో మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. నువ్వుల నూనె మన చర్మానికి సహజ కాంతిని ఇవ్వడమే కాకుండా ముఖం మీద మొటిమలు, మచ్చలు లేకుండా చేస్తుంది. జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలకు కూడా చెక్ పెడుతుంది.

నువ్వుల విత్తనాల నుంచి తయారు చేసే నువ్వుల నూనె వంటకాలలో, ఆయుర్వేదంలో ప్రపంచ వ్యాప్తంగా విరివిగా వినియోగించబడుతోంది. అన్ని నూనెల్లోకి నువ్వుల నూనె శ్రేష్టమైనది. నువ్వులలో నూనె పదార్థంతోపాటు ప్రొటీన్ కూడా ఎక్కువ మోతాదులో ఉంటుంది. అందుకే.. ఇది ఆరోగ్యానికే కాదు.. జుట్టు, చర్మ సౌందర్యానికి కూడా అద్భుత ప్రయోజనాలు అందిస్తుంది.

యాక్నె

యాక్నె

నువ్వుల నూనెలో యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. ఇవి.. మొటిమలు నివారించడంతో పాటు, కొత్తగా వచ్చే మొటిమలు రాకుండా.. నివారిస్తుంది.

ముడతలు రాకుండా

ముడతలు రాకుండా

నువ్వుల నూనెలో ఫ్యాటీ యాసిడ్స్, ఓలెక్, పామిటిక్, స్టియారిక్, లినోలెక్ యాసిడ్ ఉంటాయి. ఇవి.. చర్మాన్ని స్మూత్ గా మార్చడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. అలాగే ఇందులో విటమిన్ ఏ, సి ఉండటం వల్ల.. ఫైన్ లైన్స్, ముడతలను నివారిస్తాయి.

పొడి జుట్టుకి

పొడి జుట్టుకి

డ్రైగా మారిన జుట్టు, స్కాల్ప్ డాండ్రఫ్ కి దారితీస్తుంది. నువ్వుల నూనెలో ఉండే విటమిన్స్, పోషకాలు, మినరల్స్ తో పాటు యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్.. పొడి జుట్టుని, స్కాల్ఫ్ ని నివారించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

ఎండకు కమిలిన చర్మానికి

ఎండకు కమిలిన చర్మానికి

నువ్వుల నూనెలో యూవీ కిరణాల ద్వారా చర్మంపై ఏర్పడే ప్యాచ్ లు నివారించే సత్తా ఉంటుంది. సూర్య కిరణాల వల్ల డ్యామేజ్ అయిన చర్మానికి ఇది పర్ఫెక్ట్ రెమిడీ. అలాగే.. దుమ్ము, పొగ వంటికాలుష్యం నుంచి కూడా నువ్వుల నూనె రక్షణ కల్పిస్తుంది.

జుట్టు పెరుగుదలకు

జుట్టు పెరుగుదలకు

నువ్వుల నూనెను జుట్టుకి హాట్ ఆయిల్ ట్రీట్మెంట్ గా ఉపయోగిస్తే.. జుట్టు హెల్తీగా, ఒత్తుగా, షైనీగా పెరుగుతుంది. కాబట్టి కొద్దిగా నువ్వుల నూనెను గోరువెచ్చగా చేసి.. తలకు, జుట్టుకి బాగా మసాజ్ చేయాలి. జుట్టుకి పోషణ అంది.. పెరుగుదలకు సహాయపడుతుంది.

జుట్టు చిట్లిపోవడాన్ని నివారించడానికి

జుట్టు చిట్లిపోవడాన్ని నివారించడానికి

జుట్టుకి న్యాచురల్ కండిషనర్ గా పనిచేస్తుంది నువ్వుల నూనె.జుట్టుకి మాయిశ్చరైజర్ అందించి.. చిట్లిపోవడాన్ని అరికట్టి.. జుట్టుని సాఫ్ట్ గా మారుస్తుంది. రెగ్యులర్ హెయిర్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్, ఒక టేబుల్ స్పూన్ నువ్వుల నూనె కలిపి జుట్టుకి పట్టించాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

పిల్లల చర్మానికి

పిల్లల చర్మానికి

చిన్నపిల్లల చర్మం పొడిబారకుండా.. స్మూత్ గా ఉండటానికి గ్రేట్ గా సహాయపడుతుంది నువ్వుల నూనె. అలాగే పిల్లల్లో డైపర్ ర్యాషెస్ రాకుండా.. చర్మాన్ని స్మూత్ గా మారుస్తుంది.

గాయాలు

గాయాలు

నువ్వుల నూనెలో విటమిన్ ఈ ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇవి గాయాలు, తెగిన దెబ్బలు నివారించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.

పగిలిన పాదాలకు

పగిలిన పాదాలకు

కొద్దిగా నువ్వుల నూనె తీసుకుని.. రాత్రి పడుకోవడానికి ముందు పగిలిన పాదాలకు మసాజ్ చేయాలి. కాటన్ సాక్స్ లు వేసుకోవాలి. ఇలా కొన్ని రోజులపాటు చేస్తే.. మీ పాదాలు సాఫ్ట్ గా, స్మూత్ గా మారతాయి.

డ్యామేజ్ అయిన చర్మానికి

డ్యామేజ్ అయిన చర్మానికి

చర్మ కణాలు డ్యామేజ్ అయినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ కి ఆటంకం ఏర్పడి చర్మం నిర్జీవంగా మారుతుంది. కాబట్టి నువ్వుల నూనెతో మసాజ్ చేయడం వల్ల డ్యామేజ్ అయిన కణాలను.. రిపేర్ చేసి.. బ్లడ్ సర్క్యులేషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. దీనివల్ల చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.

English summary

Reasons you must use sesame seed oil for your skin and hair

Reasons you must use sesame seed oil for your skin and hair. Sesame oil is widely used in Indian cuisine, and we are well aware of its health benefits, but it's beauty benefits are often ignored.
Story first published:Tuesday, July 12, 2016, 15:39 [IST]
Desktop Bottom Promotion