Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
చర్మాన్ని రిపేర్ చేసి, టోన్ ని మెరుగుపరిచే నారింజ తొక్క ఫేస్ ప్యాక్..!
ఆరంజ్ పీల్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మాన్ని స్మూత్ గా, హెల్తీగా మార్చేస్తాయి. నారింజ తొక్కలో బాదాం, పాలు, తేనె కలిపి ఫేస్ ప్యాక్ అప్లై చేస్తే మెరుగైన ఫలితాలు పొందవచ్చు.
బిజీ లైఫ్, ఒత్తిడి, చర్మం డ్రైగా మారడం, ఏసీల వల్ల చర్మం చాలా నిర్జీవంగా మారుతుంది. డ్రైగా, లైఫ్ లెస్ గా మారుతుంది. ఇలాంటప్పుడు చర్మానికి నూతనోత్తేజాన్ని అందించే మాస్క్ అప్లై చేసుకోవాలి. అందుకు అద్భుతమైన పదార్థం ఆరంజ్.
ఆరంజ్ ఆరోగ్యానికే కాదు.. అందానికి చాలా సూపర్ పవర్ ఫుల్ రెమిడీ. ఇందులో రిచ్ గా ఉండే విటమిన్ సి చర్మ సౌందర్యానికి పవర్ ఫుల్ గా ఉపయోగపడుతుంది. ఆరంజ్ జ్యూస్ నుంచి తొక్క వరకూ అంతా ఉపయోగకరమో. ఆరంజ్ పీల్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మాన్ని స్మూత్ గా, హెల్తీగా మార్చేస్తాయి.
ఆరంజ్ పీల్ అందానికి మంచిది అని చెప్పామని.. మార్కెట్ లో దొరికేది కాకుండా.. ఇంట్లోనే ఆరంజ్ తిన్న తర్వాత తొక్కలు పారేయకుండా.. హోంమేడ్ ఆరంజ్ పీల్ పౌడర్ తయారు చేసుకోండి. ఇలా ఇంట్లో తయారు చేసుకున్నఆరంజ్ పౌడర్ అయితే మెరుగైన ఫలితాలు చూడవచ్చు.
నారింజ తొక్కలో బాదాం, పాలు, తేనె కలిపి ఫేస్ ప్యాక్ అప్లై చేస్తే మెరుగైన ఫలితాలు పొందవచ్చు. బాదాంలో ఉండే విటమిన్ ఈ కొత్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. తేనెలో ఉండే ఎమినో యాసిడ్స్ చర్మానికి మాయిశ్చరైజర్ ని అందిస్తుందపాలలో ఉండే లాక్టిక్ యాసిడ్ స్కిన్ టోన్ ని మెరుగుపరుస్తుంది. చర్మానికి పోషణ అందిస్తుంది.

స్టెప్ 1
4 నుంచి 5 బాదాంలను కప్పు నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయం దాన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.

స్టెప్ 2
ఆరంజ్ తొక్కను తీసుకుని ఎండలో ఎండబెట్టాలి. వాటి రంగు బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత వాటిని మిక్సీ పట్టి పౌడర్ చేసుకోవాలి.

స్టెప్ 3
ఒక గిన్నె తీసుకుని బాదాం పేస్ట్, ఒక టీస్పూన్ ఆరంజ్ పీల్ పౌడర్, టీ స్పూన్ తేనె కలిపి పాలతో మెత్తటి పేస్ట్ చేసుకోవాలి.

స్టెప్ 4
ముఖాన్ని క్లీన్ గా క్లెన్స్ చేసుకోవాలి. మైల్డ్ క్లెన్సర్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

స్టెప్ 5
మనం తయారు చేసుకున్న మాస్క్ ని ముఖానికి, మెడకు పట్టించాలి. కళ్లచూట్టూ అప్లై చేయకూడదు. 30 నిమిషాల తర్వాత ప్యాక్ డ్రై అయిన తర్వాత కొన్ని వాటర్ చల్లుకోవాలి. ఇప్పుడు స్క్రబ్ చేసుకోవాలి.

స్టెప్ 6
ఇప్పుడు చర్మాన్ని గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. తర్వాత చర్మానికి లైట్ మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. అంతే చర్మానికి కావాల్సిన పోషణ అందుతుంది.



Click it and Unblock the Notifications