For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోజ్ వాటర్ తో అద్భుతమైన ఫేస్ ప్యాక్ లు ...

|

పురాతన కాలం నుండి , రోజ్ వాటర్ ను వివిధ రకాల బ్యూటీ కోసం ఉపయోగిస్తున్నారు. దీన్ని టోనర్ గాను లేదా ఫేస్ ప్యాక్స్ లోను ఉపయోగిస్తున్నారు. రోజ్ వాటర్ ను ఇతర బ్యూటీ ప్రొడక్ట్స్ తో జోడించి ఉపయోగించుకోవడం వల్ల అనేక బ్యూటీ ప్రయోజనాలను పొందుతున్నారు.

సాధారణంగా , ఫేస్ ప్యాక్స్ కోసం మనం తయారుచేసుకొనే హోం మేడ్ రిసిపిలు , మనం మార్కెట్లో కొనుగోలు చేసే వాటికంటే ఎక్కువ మన్నికైనవి, మరియు ఆరోగ్యకరమైనవి . అంతే కాదు , మార్కెట్లో లభించే కెమికల్ ప్రొడక్ట్స్ వివిధ రకాల రసాయనాలు ఉపయోగించడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి .

కానీ, రోజ్ వాటర్ ను ఫేస్ ప్యాక్ గా ఉపయోగించడం వల్ల ఫెయిన్ స్కిన్ మరింత డీప్ గా శుభ్రం చేయబడి మరింత అదనపు అందాన్ని అందిస్తుంది.

కాబట్టి, ఫెయిర్ స్కిన్ పొందడానికి ఎలాంటి ఫేస్ ప్యాక్ లు బెస్ట్ అని తెలుసుకొని ఉపయోగించడం మంచిది? నిజానికి, ఫేస్ ప్యాక్స్ లో చాలా ఉన్నాయి. ముక్యంగా, మీరు ఉపయోగించే రెగ్యులర్ ఫెయిర్ నెస్ ఫేస్ ప్యాక్స్ కు రోజ్ వాటర్ ను ఉపయోగించుకోవచ్చు.

ఉదాహరణకు, మీరు లెమన్, మరియు హనీ ప్యాక్ తయారుచేసుకొనేటప్పుడు, వాటిలో కొన్ని చుక్కల రోజ్ వాటర్ మిక్స్ చేయడం వల్ల . ఈ ప్యాక్ ముఖంలో నేచురల్ గ్లోను తీసుకొస్తుంది. ఇంకా రోజ్ వాటర్ ఉపయోగించడం వల్ల మరిన్ని బెనిఫిట్స్ ను అందిస్తుంది.

మీరు ఫెయిర్ స్కిన్ పొందడానికి , వీటితో పాటు , రోజ్ వాటర్ మెటిమలను నివారిస్తుంది మరియు వండర్ ఫుల్ గా పనిచేస్తుంది .ముఖంను కాంతివంతంగా మార్చుతుంది.

కాబట్టి, రేడియంట్ స్కిన్ పొందాలంటే రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్ ను ఉపయోగించాలి. మరి అందుకోసం కొన్ని బెస్ట్ రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి.

1. రోజ్ వాటర్:

1. రోజ్ వాటర్:

ముల్తానీ మట్టి ప్యాక్:పుల్లర్స్ ఎర్త్ లేదా ముల్తానీ మట్టి , ఇది కొత్తగా ఉపయోగించే బ్యూటీ ట్రీట్మెంట్ కాదు. కొన్ని వేల సంవత్సరాల నుండి దీన్ని ఆయిల్ కంట్రోల్ గా ఉపయోగిస్తున్నారు. మరియు స్కిన్ టోన్ ను మెరుగుపరచడంలో కూడా గ్రేట్ గా ఉపయోగిస్తున్నారు . రోజ్ వాటర్ మిమ్మల్ని అందంగా తీర్చిదిద్దుతుంది మరియు ఇది చర్మంలోని స్పాట్స్ మరియు మార్క్స్ ను తొలగిస్తుంది.

2. రోజ్ వాటర్ -శెనగపిండి:

2. రోజ్ వాటర్ -శెనగపిండి:

మీ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి రోజ్ వాటర్ ప్యాక్ గ్రేట్ గా సహాయపడుతుంది. అందుకే దీన్ని నిర్లక్ష్యం చేయకండి . ఇక శెనగపిండి మహిళల సౌందర్యాన్ని మెరుగుపరచుకోవడంలో ఆల్ టైమ్ ఫేవరెట్ . ఇది తక్షణ మెరుపును అందిస్తుంది. రోజ్ వాటర్ చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది . శెనగపిడి వల్ల స్కిన్ డ్రై నెస్ ను నివారిస్తుంది.

3. రోజ్ వాటర్ మరియు టమోటో జ్యూస్:

3. రోజ్ వాటర్ మరియు టమోటో జ్యూస్:

సన్ టాన్ మరియు సన్ బర్న్ చాలా సాదారణ సమస్య మరియు సమ్మర్లో ఇది చీకాకు కలిగించే సమస్య. మీ బాడీ పార్ట్స్ లో అనుకోని చర్మం కాంతిని మెరుగుపరుస్తుంది. సింపుల్ గా టమోటో జ్యూస్ ను మరియు రోజ్ వాటర్ మిశ్రమాన్ని స్కిన్ టాన్ ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి . దీన్ని రెగ్యులర్ గా ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.

4. రోజ్ వాటర్ మరియు పొటాటో జ్యూస్:

4. రోజ్ వాటర్ మరియు పొటాటో జ్యూస్:

మీకు బెస్ట్ రోజ్ వాటర్ బేస్డ్ ఫేస్ ప్యాక్ కోరుకుంటే , మంచి ఫెయిర్ స్కిన్ పొందాలనుకుంటే, ఈ రెండింటి మిశ్ర మం యొక్క ఫేస్ ప్యాక్ ను వారానికొకసారి అప్లై చేయాలి. పొటాటో జ్యూస్ లేదా పేస్ట్ లో కొద్దిగా రోజ్ వాటర్ మిక్స్ చేసి బాడీ పార్ట్స్ కు అప్లై చేయాలి . 15నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

5. రోజ్ వాటర్ మరియు మెంతులు:

5. రోజ్ వాటర్ మరియు మెంతులు:

మొటిమలు మరియు మచ్చలు కలిగిన ముఖంతో నలుగురిలోకి వెళ్ళడానికి ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది. . మొటిమలకు కారణమయ్యే వ్యర్థాలను తొలగించడంలో రోజ్ వాటర్ గ్రేట్ గా సహాయపడుతుంది . రాత్రంతా నీటిలో నానబెట్టిని మెంతులకు కొద్దిగా రోజ్ వాటర్ జోడించి మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి . తర్వాత ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసి, డ్రై అయిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఫెయిర్ స్కిన్ పొందడానికి ఇది ఒక వండర్ ఫుల్ ఫేస్ ప్యాక్.

6. రోజ్ వాటర్ మరియు పెరుగు:

6. రోజ్ వాటర్ మరియు పెరుగు:

రోజ్ పెటల్స్ ను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఆ నీటిని వంపేసి, పెటల్స్ ను మెత్తగా పేస్ట్ చేయాలి . దీనికి కొద్దిగా పెరుగు జోడించి, ముఖం మరియు మెడ మొత్తానికి అప్లై చేయాలి . దీన్ని బాడీకి కూడా అప్లై చేసి సాప్ట్ అండ్ గ్లోయింగ్ స్కిన్ పొందవచ్చు.

7. రోజ్ వాటర్ మరియు సాండిల్ వుడ్ పౌడర్:

7. రోజ్ వాటర్ మరియు సాండిల్ వుడ్ పౌడర్:

ఫెయిర్ నెస్ స్కిన్ పొందడానికి ఇది గ్రేట్ రెమెడీ. అన్ని రకాల చర్మ తత్వాలకు ఇది ఉత్తమం . ఇది స్మూతింగ్ ఎఫెక్ట్ ను కలిగిస్తుంది . మొటిమలు మరియు మచ్చలను నివారిస్తుంది. ఫెయిర్ స్కిన్ పొందడానికి ఇది ఒక బెస్ట్ నేచురల్ హెయిర్ ప్యాక్.

8. రోజ్ వాటర్ , తేనె మరియు గుడ్డు:

8. రోజ్ వాటర్ , తేనె మరియు గుడ్డు:

ఇది యాంటీ ఏజింగ్ ఫేస్ మాస్క్, ఇది చర్మరంద్రాలను టైట్ చేస్తుంది . చర్మానికి ఫెయిర్ కాంప్లెక్షన్ ను అందిస్తుంది మరియు గుడ్డు ముడుతలను నివారిస్తుంది . తేనె ఒక నేచురల్ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది . మీ చర్మం డ్రైగా లేకుండా చేస్తుంది.

9. రోజ్ వాటర్ -మామిడిపండ్లు:

9. రోజ్ వాటర్ -మామిడిపండ్లు:

ఈ రుచికరమైన ఫ్రూట్ రేడియంట్ స్కిస్ అందిస్తుంది, ఇందులో విటమిన్స్ మరియు మినిరల్స్ అధికంగా ఉండటం వల్ల ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది .

10. రోజ్ వాటర్ టోనర్ గా పనిచేస్తుంది:

10. రోజ్ వాటర్ టోనర్ గా పనిచేస్తుంది:

ఫెయిర్ స్కిన్ పొందడానికి రోజ్ వాటర్ బేస్డ్ ఫేస్ ప్యాక్ చాలా ఉత్తమమైనది. . ఎలాంటి ఫేస్ ప్యాక్ ఉపయోగించినా, రోజ్ వాటర్ ను టోనర్ గా ఉపయోగించడం మర్చిపోకూడదు. ఇది చర్మానికి నేచురల్ గ్లో ను అందిస్తుంది మరియు డ్యామేజ్ స్కిన్నివారిస్తుంది.

English summary

Rose Water Based Face Packs For Fair Skin

From ancient time, rose water has been used for several beauty purposes. Be it in the form of a toner or in face packs, the benefits of rose water are incomparable to any other beauty products. Usually, the homemade recipes for face packs are always preferable than buying the market-made products. After all, you don’t know what chemicals they have and what effects those chemicals can cause.
Desktop Bottom Promotion