Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
గ్లోయింగ్ స్కిన్ పొందడానికి గ్రీన్ టీ మాస్క్ చేసే మ్యాజిక్..
గ్రీన్ టీ అందరికీ సుపరిచితమే..గ్రీన్ టీ ఆరోగ్యానికి మాత్రమే కాదు, అందాన్ని కూడా గ్రేట్ హెల్త్ బెనిఫిట్స్ అందిస్తుంది. గ్రీన్ టీ ఇంటర్నల్ గాను మరియు ఎక్సటర్నల్ గాను ఉపయోగపడుతుంది, ఏజింగ్, లైఫ్ స్టైల్ , ఎన్విరాన్మెంటల్ ఫోర్స్ వంటి సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . స్కిన్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది మరియు మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
సరైన శుభ్రత పాటించకపోవడం, పోషకాహారలోపం, వాతావరణ కాలుష్యం వంటి అనేక కారణాల వల్ల చర్మ సంబంధిత సమస్యలు, మొటిమలు, మచ్చలు ఏర్పడుట వల్ల చర్మం వదులుగా , నిర్జీవంగా మరియు డల్ గా కనబడుతుంది.
అయితే, ఇలాంటి చర్మ సమస్యలను నివారించడంలో నేచురల్ రెమెడీస్ గ్రేట్ గా సహాయపడుతాయి. ఇటువంటి నేచురల్ రెమెడీస్ ను శాతాబ్దాల కాలం నుండి ఉపయోగిస్తున్నారు. అటువంటి నేచురల్ రెమెడీస్ లో గ్రీన్ టీ ఒకటి.

గ్రీన్ టీలో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలున్నాయి. మరియు ఫాలీఫినాల్స్ వంటి ఇతర కాంపోనెంట్స్ చర్మం మీద అద్భుతంగా పనిచేస్తాయి.
ముఖ్యంగా, చర్మాన్ని కాంతివంతంగా మార్చడానికి ఈ ఏజ్ ఓల్డ్ రెమెడీ గ్రేట్ గా పనిచేస్తుంది . ఈ రెమెడీ తయారుచేయడం చాలా సులభం మరియు ఫేస్ మాస్ చాలా సింపుల్ గా ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు . వదులైన చర్మాన్ని మరింత టైట్ గా మార్చుతుంది.

ఈ హోం మేడ్ మాస్క్ డెడ్ స్కిన్ సెల్స్ తొలగిస్తుంది మరియు హానికరమైన బ్యాక్టీరియాను తొలగిస్తుంది. ఇది బ్రేక్ అవుట్స్ మరియు స్కిన్ డిస్కలర్ కు కారణమవుతుంది.
మరి ఈ హోం మేడ్ మాస్క్ తయారుచేయడానికి కావల్సిన పదార్థాలు, తయారు చేయు విధానం గూర్చి తెలుసుకుందాం..

2 టీస్పూన్ల గ్రీన్ టీ
2 టీస్పూన్ల బేకింగ్ సోడ
1 టేబుల్ స్పూన్ తేనె
తయారుచేయు విధానం:
ఒక కప్పు గ్రీన్ టీ తీసుకోవాలి.
అరగంట చల్లరనివ్వాలి . తర్వాత అందులో పైన సూచించిన ఇతర పదార్థాలను మిక్స్ చేయాలి.
తర్వాత మిక్స్ చేసి ముఖానికి మెడ మొత్తానికి అప్లై చేయాలి. ఈ మిశ్రమం అరగంటపాటు అలాగే ఉంచి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఒక వారంలో రెండు మూడు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది, ముఖంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి.



Click it and Unblock the Notifications