Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
నిమిషాల్లో మీ చర్మాన్ని గ్లోయింగ్ గా మార్చే హోం రెమిడీస్..!
ముఖ సౌందర్యాన్ని అసహ్యంగా మార్చే మొటిమలు, మచ్చలు, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ తొలగించాలంటే.. సింపుల్ గా హోం రెమిడీస్ ఫాలో అవవచ్చు. ప్రకాశవంతమైన ముఖం సొంతం చేసుకోవడానికి కేవలం నిమిషాల్లో ఫాలో అయ్యే కొన్
ముఖ సౌందర్యాన్ని అసహ్యంగా మార్చే మొటిమలు, మచ్చలు, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ తొలగించాలంటే.. సింపుల్ గా హోం రెమిడీస్ ఫాలో అవవచ్చు. ప్రకాశవంతమైన ముఖం సొంతం చేసుకోవడానికి కేవలం నిమిషాల్లో ఫాలో అయ్యే కొన్ని సింపుల్ రెమిడీస్ మీ వంటింట్లోనే అందుబాటులో ఉన్నాయి.

ఇలాంటి చర్మ సమస్యలతో బాధపడేవాళ్లు.. మేకప్ తో కవర్ చేసుకుని బయటకు వెళ్తుంటారు. కానీ.. మేకప్ మరీ ఎక్కువగా ఉపయోగించినా.. చర్మానికి హానిచేస్తుంది. కాబట్టి.. చర్మ సమస్యలను వెంటనే తగ్గించుకుని.. స్మూత్ అండ్ గ్లోయింగ్ స్కిన్ పొందే.. సౌందర్య రహస్యాలు మీకోసం..

కొబ్బరినూనె
చలికాలంలో ప్రతి ఒక్కరినీ వేధించే సమస్య చర్మం పొడిబారిపోవడం. చర్మం తేమను కోల్పోయినప్పుడు స్కిన్ డ్రైగా మారుతుంది. కాబట్టి రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరినూనెలో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి.. చర్మానికి కాసేపు మసాజ్ చేసుకోవాలి. తర్వాత కాటన్ బాల్ తో శుభ్రం చేసుకుంటే.. చర్మానికి కావాల్సిన మాయిశ్చరైజర్ అందుతుంది.

బేకింగ్ సోడా
బేకింగ్ సోడా చర్మానికి కావాల్సిన మాయిశ్చరైజర్ ని అందిస్తుంది. ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను చర్మానికి రాసుకోవాలి. తర్వాత రెండు నిమిషాలపాటు మసాజ్ చేసి.. చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే.. స్కిన్ గ్లోయింగ్ గా మారుతుంది.

యాపిల్
గ్రీన్ యాపిల్ తో చర్మాన్ని స్మూత్ అండ్ గ్లోయింగ్ గా మార్చుకోవచ్చు. ఒక గ్రీన్ యాపిల్ తీసుకుని మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ ని ముఖానికి అప్లై చేసి.. 15 నిమిషాల పాటు మసాజ్ చేసుకుంటే.. చర్మం కాంతివంతంగా తయారవుతుంది.



Click it and Unblock the Notifications