For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మెంతులలో దాగున్న.. అద్భుతమైన చర్మ సౌందర్యం..!!

By Swathi
|

మెంతిని ఇండియన్ వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. దీన్ని ఆకు రూపంలోనూ, మెంతులను స్పైస్ గానూ ఉపయోగిస్తారు. మెంతులను జుట్టు సంరక్షణకు చాలా మంది ఉపయోగిస్తారు. అయితే.. మెంతి ఆకును.. ముఖానికి కూడా ఉపయోగించడం వల్ల.. అమేజింగ్ బెన్ఫిట్స్ పొందవచ్చనేది చాలామందికి తెలియని విషయం.

మెంతి ఆకు కొద్దిగా చేతుగా, కొంచెం ఘాటుగా ఉంటుంది. అందుకే చాలామంది మెంతి ఆకును ఇష్టపడరు. కానీ.. మెంతిలోని పోషకాలు చాలా విలువైనవి కాబట్టి.. మెంతిని విభిన్నంగా వంటకాల్లో చేర్చి తీసుకుంటూ ఉంటారు.

మెంతిలో ఫ్లేవనాయిడ్స్, ఆల్కలాయిడ్స్, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. మహిళలు ఎదుర్కొనే తీవ్రమైన రుతుక్రమ నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి మెంతి ఆకు సహాయపడుతుంది. అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలే కాదు.. మెంతిలో చర్మానికి, జుట్టుకి అద్భుత ప్రయోజనాలను అందిస్తుంది.

చుండ్రు, జుట్టు రాలడం వంటి రకరకాల జుట్టు సమస్యలను నివారించడానికి ఉపయోగిస్తారు. అయితే చర్మానికి మెంతి ఎలా ఉపయోగపడుతుందో.. తెలుసుకుందాం..

యాక్నె

యాక్నె

యాక్నె సమస్య నుంచి దాదాపు అనేక మంది బాధపడుతుంటారు. ముఖ్యంగా టీనేజ్ సమయంలో.. ఎక్కువ సమస్యను ఫేస్ చేస్తాయి. కాబట్టి.. కొన్ని మెంతులను నీటిలో ఉడికించి.. ఆ నీటిని చల్లారిన తర్వాత ముఖం శుభ్రం చేసుకోవడానికి ఉపయోగిస్తే.. మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి.

ఫెయిర్ నెస్

ఫెయిర్ నెస్

మెంతుల పొడిని పెరుగులో కలిపి మిక్స్ చేసి.. ఫేస్ కి అప్లై చేస్తే.. మంచి నిగారింపు పొందవచ్చు.

ఇన్ల్ఫమేషన్

ఇన్ల్ఫమేషన్

యాక్నె, పింపుల్స్ వల్ల ఏర్పడే ఇన్ల్ఫమేషన్, దురద, నొప్పిని తగ్గించడంలో మెంతి ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మెంతి ఆకుల రసం.. ఇన్ల్ఫమేషన్ ని ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది.

యాంటీ ఏజింగ్

యాంటీ ఏజింగ్

వయసు ఛాయలను.. తొలగించడంలో.. మెంతులు ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ముడతలు, ఫైన్ లైన్స్ నుంచి రిలీఫ్ పొందడానికి మెంతులు చక్కడి ఆప్షన్. మెంతులను, పెరుగులో కలిపి పేస్ట్ చేసి.. ముఖానికి అప్లై చేస్తే.. అందులోని యాంటీ ఆక్సిడెంట్స్.. ముడతలు తగ్గించడానికి సహాయపడతాయి.

మాయిశ్చరైజర్

మాయిశ్చరైజర్

మెంతులు చర్మానికి మాయిశ్చరైజర్ ని అందించి.. డ్రై అవకుండా అడ్డుకుంటుంది. మెంతి పౌడర్ ని నీటిలో కలిపి.. చర్మానికి రాసుకోవడం వల్ల.. పొడిబారిన చర్మాన్ని అరికట్టవచ్చు.

క్లియర్ స్కిన్

క్లియర్ స్కిన్

మెంతులు చర్మాన్ని క్లియర్ గా మారుస్తాయి. మెంతి పొడిని.. పాలలో మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

డార్క్ స్పాట్స్

డార్క్ స్పాట్స్

మెంతిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్.. డార్క్ స్పాట్స్ ని ఎఫెక్టివ్ గా తొలగిస్తాయి. ఇది చాలా త్వరగా, శాశ్వతంగా.. డార్క్ స్పాట్స్ కనిపించకుండా నివారిస్తుంది.

క్లెన్సర్

క్లెన్సర్

మెంతులు చర్మానికి డీప్ క్లెన్సర్ లా పనిచేస్తాయి. మెంతి పౌడర్ ని.. నీటిలో కలిపి చర్మానికి రాసుకుంటే.. క్లెన్సర్ గా సహాయపడుతుంది.

ఎక్స్ ఫోలియేషన్

ఎక్స్ ఫోలియేషన్

డెడ్ స్కిన్ సెల్స్ ని చాలా తేలికగా తొలగించడానికి మెంతులు సహాయపడతాయి. రంధ్రాలను కూడా.. మూసుకుపోయేలా చేస్తాయి. తేనెలో మెంతి పొడి కలిపి మిక్స్ చేసుకుని అప్లై చేస్తే.. ఎఫెక్టివ్ ఫలితాలను పొందవచ్చు

గ్లోయింగ్ స్కిన్

గ్లోయింగ్ స్కిన్

మెంతులు డెడ్ స్కిన్ సెల్స్ ని తొలగించడం ద్వారా చర్మాన్ని గ్లోయింగ్ గా మారుస్తాయి. బ్లడ్ ని కూడా ప్యూరిఫై చేయడం వల్ల చర్మం నిగారిస్తుంది.

స్కిన్ ట్యాన్

స్కిన్ ట్యాన్

ఎక్కువ సమయం ఎండలో గడపడం వల్ల.. కమిలిన చర్మాన్ని మెంతి చక్కటి పరిష్కారం. మెంతి పొడిని నిమ్మరసంలో కలిపి.. రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల.. స్కిన్ ట్యాన్ తొలగిపోతుంది.

English summary

Skin Care Benefits Of Methi For Skin That Needs To Be Pampered

Skin Care Benefits Of Methi For Skin That Needs To Be Pampered. Methi, or fenugreek, is very widely used in Indian cooking. It is used as a herb, spice and even a vegetable in Indian cooking.
Desktop Bottom Promotion