For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సమ్మర్లో బ్యూటీ సమస్యలను నివారించే బనానా ఫేస్ ప్యాక్స్

|

మన దైనందిన జీవితంలో గమనించినట్లైతే ఓక్కో సీజన్ లో రకరకాల పండ్లు ప్రకతి మనకు ప్రసాధిస్తుంటుంది. ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకూ ఎన్నో రకాలపండ్లు తింటాం. దానిలో తక్కువ ధరలో ప్రతి ఒక్కరీ ఇంట్లో ఎక్కువగా కన బడేది అరటిపండు. సాధారణంగా వేసవికాలం వచ్చిందంటే చర్మ సమస్యలు, ముఖం పొడిబారిపోవటం, మొటిమలు.. లాంటి సమస్యలు వేధిస్తుంటాయి.

అయితే ఈ సమస్యల్ని దూరం చేసేందుకు అరటిపండ్లు ప్రభావవంతంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. విటమిన్ బీ, సీ, ఏలతోపాటు పొటాషియం కూడా పుష్కలంగా లభించే ఈ పండ్లు ఇటు చర్మానికి, అటు జుట్టుకు పోషకంగా ఉపయోగపడుతాయని అంటున్నారు.

ముఖ సౌందర్యం రెట్టింపు

ముఖ సౌందర్యం రెట్టింపు

బాగా మిగలమగ్గిన అరటిపండును గుజ్జుగా చేసి అందులో రెండు స్పూన్ల గట్టి పెరగు లేదా ఓట్స్ పొడి వేసి బాగా కలిపి ముఖం, మెడకు పట్టించి బాగా ఎండిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ చిట్కా వలన ముఖ సౌందర్యం రెట్టింపు అవుతుంది.

ముఖం మిలమిల మెరుస్తూ ఆరోగ్యంగా ఉంటుంది.

ముఖం మిలమిల మెరుస్తూ ఆరోగ్యంగా ఉంటుంది.

అరటిపండు గుజ్జులో ఒక టీస్పూన్ తేనె, లేదా ఒక టీస్పూన్ పచ్చిపాలు వేసి కలపి ముఖానికి పట్టించి బాగా ఆరనివ్వాలి. కొద్దిసేపటి గోరువెచ్చటి నీళ్ళతో ముఖం కడుక్కోవాలి. ఇలా ఒక నెలా పాటు క్రమం తప్పకుండా చేసినట్లైతే ముఖం మిలమిల మెరుస్తూ ఆరోగ్యంగా ఉంటుంది.

ముఖంలో మొటిమలతో బాధపడేవారికి

ముఖంలో మొటిమలతో బాధపడేవారికి

ముఖంలో మొటిమలతో బాధపడేవారికి అరటిపండు ఓ వరమనే చెప్పవచ్చు. బాగా పండిన అరటిపండును ఒక దానిని తీసుకుని మెత్తగా చిదిమి, ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే.. ఇన్‌ ఫెక్షన్‌ తో కూడిన మొటిమలలో ఉండే బ్యాక్టీరియాను అరటిపండులోని పొటాషియం హరించివేయటంతో అవి త్వరగా తగ్గిపోతాయి.

ముఖం మీద మచ్చలతో బాధపడేవారు

ముఖం మీద మచ్చలతో బాధపడేవారు

ముఖం మీద మచ్చలతో బాధపడేవారు అరటిపండు తొక్కతో మచ్చలున్న ప్రదేశంలో సున్నితంగా రుద్ది ఓ అరగంట తర్వాత ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. రోజూ మొత్తంమీద వీలైనన్నిసార్లు ఈ విధంగా చేసినట్లైతే మచ్చలు మాయం అవుతాయి.

 పొడి చర్మం కలవారు

పొడి చర్మం కలవారు

పొడి చర్మం కలవారు అరటిపండు గుజ్జలు గుడ్డలోని తెల్లసొన, ఒక టేబుల్ స్పూన్ క్రీమ్ జత చేసి బాగా కలిపి ముఖం, మెడకు పట్టించి ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో కనీసం మూడు సార్లు చేసినట్టయితే మంచి ఫలితాన్ని పొందవచ్చు.....

చర్మం తాజాగా కనిపిస్తుంది.

చర్మం తాజాగా కనిపిస్తుంది.

అరటిపండుని మెత్తటి గుజ్జుగా చేసుకుని ఓ చెమ్చా చిక్కటి పాలు, ఓ చెమ్చా ఓట్మీల్ పొడిని కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, ఆరాక సున్నితంగా రుద్దాలి. ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో ముఖాన్ని కడిగితే చర్మం తాజాగా కనిపిస్తుంది.

మృత కణాలు పోయి ముఖం తాజాగా వుంటుంది.

మృత కణాలు పోయి ముఖం తాజాగా వుంటుంది.

అలాగే అరటి గుజ్జులో ఓ చెమ్చా శనగపిండి, ఓ చెమ్చా పాలు కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకోవచ్చు. పది నిమిషాల తర్వాత కడిగేస్తే, మృత కణాలు పోయి ముఖం తాజాగా వుంటుంది.

ముఖానికున్న మురికి సులువుగా వదులుతుంది.

ముఖానికున్న మురికి సులువుగా వదులుతుంది.

అరటిగుజ్జులో నిమ్మరసం, పెరుగు కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకుంటే ముఖానికున్న మురికి సులువుగా వదులుతుంది.

అరటిగుజ్జుతో మోచేతులు, మెడ వంటి చోట రుద్దితే కూడా మంచి ఫలితం వుంటుంది.

అరటిగుజ్జుతో మోచేతులు, మెడ వంటి చోట రుద్దితే కూడా మంచి ఫలితం వుంటుంది.

అరటిపండులో వుండే యాంటి బ్యాక్టీరియల్ గుణాలు, అందులోని విటమిన్ - ఎ, పొటాషియం వంటివి చర్మానికి మృదుత్వాన్ని అందిస్తాయి. కాబట్టి వారానికి ఒకసారి అయినా అరటిపండుని చర్మ సౌందర్యానికి వాడటం మంచిది.

అరటిపండుతో కంటి కింద ముడతలకు గుడ్‌బై చెప్పొచ్చు.

అరటిపండుతో కంటి కింద ముడతలకు గుడ్‌బై చెప్పొచ్చు.

అరటిపండుతో కంటి కింద ముడతలకు గుడ్‌బై చెప్పొచ్చు. అరటిగుజ్జును కంటి చుట్టూ రాసుకుని, 15 నిమిషాల తర్వాత చల్లని నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ముఖంపై ముడతలు తగ్గుముఖం పడతాయి.

English summary

Summer Skin Care: Benefits of Banana face packs for Skin

Summer Skin Care: Benefits of Banana face packs for Skin,In many countries, banana fruit and the peel are considered to be the ‘golden fruit’ of nature because the fruit helps promote natural beauty and keep the body healthy. Eating bananas regularly can keep the digestive system running at an optimal level,
Story first published: Saturday, April 16, 2016, 16:35 [IST]
Desktop Bottom Promotion