Latest Updates
-
టైమ్ తక్కువ, టేస్ట్ ఎక్కువ..లంచ్ బాక్సులకు పర్ఫెక్ట్ పుదీనా పులావ్ చేసేయండిలా -
మొహర్రం పవిత్ర మాసం సందర్భంగా మీ ప్రియమైన వారికి విషెస్ ఇలా తెలియజేయండి.! -
గుండెకు బ్యాడ్ మార్నింగ్.. ఆ సమయాల్లో ఆహార ఎంపికలతో పెను ముప్పు.! -
జూన్ 26 సాయంత్రం ఈ 5 రాశుల వారికి అదృష్టం.. ధనయోగం, కెరీర్ సక్సెస్ మీ సొంతం! -
ఈరోజు సాధ్య యోగం.. ఈ పనులు మొదలుపెడితే తిరుగులేని విజయం మీదే! -
ఒత్తిడికి గురవుతున్నారా.. ఇది మీ జుట్టుపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసా.? -
హిందూ ధర్మంలో క్షేత్రపాలక దేవతల పాత్ర ఏమిటి? -
వృశ్చిక రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారు ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త! -
ఇడ్లీ, దోశలు కాదు..జుట్టు రాలడం తగ్గించి, రోగనిరోధక శక్తి పెంచే సూపర్ హెల్తీ బ్రేక్ ఫాస్ట్ కరివేపాకు ఉప్మా.. -
తుల, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. భారీ ధనలాభం! - శుక్రవారం, 26 జూన్ 2026
ఆరెంజ్, ఆరెంజ్ జ్యూస్-ఆరెంజ్ తొక్కలోని సర్ప్రైజింగ్ బ్యూటీ సీక్రెట్స్
ప్రస్తుత సమాజంలో తొందరపాటు తనంతో, సమయాన్ని వృదా చేసుకోకూడదు అనే తత్వంతో మన చర్మ సం రక్షణ కోసం మనం మార్కెట్లో దొరికే అనేక వాటిపై ఆదారపడతాము, సరిగ్గా గమనిస్తే మనం వాడేవాటిల్లో ఎన్నో మనం ఇంట్లో ఉపయోగించుకునే వస్తువులతోనే తయరు చేస్తారు, అలాంటప్పుడు, డబ్బులు ఖర్చుపెట్టి, ఆ రసాయనాల ప్రభావం వల్ల ఇబ్బందులు పడే కన్నా మీరే ఈ "ఫేస్ ప్యాక్స్"ని తయారు చేసుకోవచ్చు, అది ఎలా అంటే...ఇలా
ఆరోగ్యాన్ని, అందాన్ని పెంచే సుగుణాలను తనలో నింపుకున్న నారింజను ఇంగ్లీషులో ఆరెంజ్ అని పిలుస్తుంటారు. పిల్లలు పెద్దలు ఇష్టంగా తినే పండ్లలో ఆరెంజ్ ఒకటి. దీనిలో పుష్కలంగా ఉండే సి విటమిన్ చర్మానికి నిగారింపు ఇస్తుంది. ఆరంజ్ లో ఫైబర్ శాతం ఎక్కువ కాబట్టి జ్యూస్ లా కాకుండా తొనలతో తినడమే మంచిది. తినడానికే కాదు, బ్యూటీ కేర్ కోసం కూడా ఆరంజ్ ఫ్రూట్ ని ఉపయోగించవచ్చు.
ఆరెంజ్ అండ్ బనానా ఫీల్ లోని తెలియని ఆశ్చర్యకర ఆరోగ్య ప్రయోజనాలు...
ఆరెంజ్‌లో ఉన్న సి విటమిన్, పొటాషియం మరియు ఫోలిక్ ఆసిడ్ కలిగివుండటం ద్వారా చర్మ సౌందర్యాన్ని మరింత మెరుగు పరుస్తుంది. స్కిన్ డామేజ్, ఎల్లో పిగ్మెంట్లకు ఆరెంజ్ జ్యూస్‌నో రోజూ తీసుకోవడం ద్వారా చెక్ పెట్టవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆరెంజ్‌ని తింటే ఆరోగ్యాన్నిస్తుంది.ముఖానికి రాసుకుంటే సౌందర్యాన్ని పెంచుతుంది. కాస్మొటిక్ స్కిన్ కేర్‌లకు దీటుగా పనిచేస్తుంది. ఇందులోని విటమిన్ 'సి' చర్మానికి నిగారింపును పెంచుతుంది. ఆరెంజ్‌తో ఫేస్‌ప్యాక్‌లను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం...

ఆరెంజ్ ఫేస్ ప్యాక్:
ఇది తయారు చేయడం చాలా సులభం. మీరు దీన్ని పేస్ట్ చేయాల్సిన పనిలేదు. ఆరెంజ్ తొనలను తొలగించి వాటితో ముఖానికి మసాజ్ చేయాలి అంతే. ఇలా మర్ధన చేసిన పది నిముషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం టైట్ గా మర్చుతుంది. ముఖంలో జిడ్డును తొలగిస్తుంది. కాంతివంతంగా మార్చుతుంది . వయస్సు పైబడినట్లు కనబడనియ్యదు. ఇలా ప్రతి రోజూ స్నానం చేసే ముందు రెగ్యులర్ గా చేయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.

ఆరెంజ్ జ్యూస్ -పెరుగు:
కమలాపండు రసాన్ని రెండు టీ స్పూన్ల పెరుగుతో కలిపి పేస్ట్‌లా చేసుకొని ముఖానికి, మెడకు పట్టించాలి. 20 నిమిషాల తర్వాత చన్నీటితో ముఖం కడిగితే... మార్పు మీకే అర్థం అవుతుంది.పేస్ స్క్రబ్ లో ఇది మరోక గొప్ప ప్రయోగం. ఈ ఫేస్ స్ర్క్ ఇటు మహిళలకు అటు పురుషులకు ఇద్దరికీ బాగా పనిచేస్తుంది. ఆరెంజ్ తొక్కను ఎండలో బాగా ఎండబెట్టి తర్వాత మెత్తగా పౌడర్ చేసి, ఇట్లో స్టోర్ చేసుకొని సమయం దొరికినప్పుడల్లా ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ అప్లై చేయొచ్చు. దాంతో ముఖంలో నల్ల మచ్చలు, మొటిమలు పూర్తిగా తొలగిపోతాయి.

ఆరెంజ్ జ్యూస్ -నిమ్మరసం:
రెండు టీస్పూన్ల ఆరెంజ్‌జ్యూస్‌కు కొద్దిగా నిమ్మరసం, ఒక స్పూన్ తేనె కలిపి ఆ మిశ్రమాన్ని ముఖం, మెడకు పట్టించి ఆరాక చన్నీటితో కడగాలి.సాధారణంగా హోంమేడ్ ఫేస్ ప్యాక్ లో ఎక్కువగా ఉపయోగించేటటువంటి సాధారణ పదార్థాలు పెరుగు, నిమ్మరసం. వీటితో పాటు ఆరెంజ్ జ్యూస్ ను కూడా మిక్స్ చేయడం వల్ల చర్మ సంరక్షణకు అద్భుతంగా పనిచేస్తుంది. ఇది సన్ బర్న్ నుండి కాపాడి చర్మాన్ని తెల్లగా మార్చుతుంది.

ఆరెంజ్ జ్యూస్-ముల్తానీ మట్టి:
ఆరెంజ్ జ్యూస్, ముల్తానీ మట్టి, పాలు కలిపి ముఖానికి పట్టించి ఆరాక వేడి నీటితో కడగాలి. ఈ ప్యాక్ వేస్తే ముఖం ప్రకాశవంతమవుతుంది.

ఆరెంజ్ పౌడర్ - రోజ్ వాటర్:
ఆరెంజ్ తొక్కలను ఎండబెట్టి పొడి చేసుకొని, ఆ పొడిని రోజ్ వాటర్‌తో కలిపి ముఖానికి రాసుకుంటే కొత్త కళ వస్తుంది.

పసుపు-ఆరెంజ్ జ్యూస్
పసుపులో ఆరెంజ్ జ్యూస్ కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని మృదువుగా మసాజ్ చేయాలి. పది నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. మృతకణాలు, మురికి తొలగిపోయి చర్మకాంతి పెరుగుతుంది. మొటిమలు, మచ్చల నివారణకు కూడా ఇది మేలైన ప్యాక్.

ఆరెంజ్ జ్యూస్ మరియు పాలు:
చర్మాన్ని శుభ్రం చేయడంలో ఇది చాలా ముఖ్యమైనది. ఈ హోంమేడ్ ఫేస్ ప్యాక్ డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. ఇంకా బ్లాక్ హెడ్స్ తొలగించి చర్మాన్ని ప్రకాశంవంతంగా మార్చుతుంది. ఆరెండింటిని మిక్స్ చేసి ముఖానికి పట్టించి మసాజ్ చేసి, పది నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. దాంతో ముఖంలో మెరుపు సంతరించుకుంటుంది.

ఆరెంజ్ తొక్క మరియు ఓట్స్ స్క్రబ్:
ఈ చాలా సులభమైనటువంటి చిట్కా. చర్మాన్ని నేచురల్ గా, క్లియర్ గా మార్చడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఈ రెండిటి మిశ్రమాన్ని వారానికి రెండు సార్లు అప్లై చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించడం తో పాటు, బ్లాక్ హెడ్స్, మచ్చలను తొలగించి ప్రకాశంవంతంగా మార్చుతుంది.

ఆరెంజ్ పీల్ మరియు సాండిల్ ఉడ్:
ఎండిన ఆరెంజ్ తొక్కను మిక్సీలో వేసి అందులో కొద్దిగా రోజ్ వాటర్ మరియు సాండిల్ ఉడ్ పౌడర్ రెండూ మిక్స్ చేసి మెత్తగా పేస్ట్ లా తయారు చేసుకోవాలి. తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకొన్న తర్వాత ఈ ప్యాక్ ను ముఖానికి మెడకు అప్లై చేయాలి. ఈ ప్యాక్ వేసుకొన్న అరగంట తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ ఆరెంజ్ పీల్ ఫేస్ ప్యాక్ వల్ల ముఖ్యం సున్నితంగా, ప్రకాశవంతమైన ఛాయతో ఉంటుంది. మరియు మొటిమలు మచ్చలు తొలగించి క్లియర్ స్కిన్ ను అంధిస్తుంది.



Click it and Unblock the Notifications