Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
అందంగా, ఆరోగ్యకరమైన చర్మ సౌందర్యానికి స్వీట్ హోం మేడ్ ఫేస్ మాస్క్
చర్మ సంరక్షణలో వివిధ రకాల హోం మేడ్ ఫేస్ మాస్క్ లను ఉపయోగిస్తుంటాము. దాన్ని బట్టే మన చర్మంలో అనేక మార్పులు వస్తుంటాయి. కొన్ని హోం మేడ్ ఫేస్ మాస్క్ లు త్వరగా మార్పును చూపెడితే, మరికొన్ని ఆలస్యంగా చూపెడుతాయి. అతి తక్కువ సమయంలో చర్మంలో మెరుపులు తీసుకొచ్చి, కాంతి వంతంగా, హెల్తీగా ఉంచుతుంది . చర్మం చూడటానికి బ్యూటిఫుల్ గా మరియు సాఫ్ట్ గా మార్చుతాయి.
ఈ క్రింది లిస్ట్ లో తెలిపిన హోం మేడ్ ప్రొడక్ట్స్ లో అన్నీ కూడా నేచురల్ పదార్థాలు మరియు వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు . సెన్సిటివ్ స్కిన్ ఉన్న వారు కూడా ఈ హోం మేడ్ రెమెడీస్ ను ఉపయోగించుకోవచ్చు. వీటిలో టమోటోలు, రెడ్ వైన్, కోకోనట్, చాక్లెట్ మరియు తేనె స్వీట్ పదార్థాలతో వేసుకొనే ఫేస్ మాస్క్ లు చాలా ఎఫెక్టివ్ గా పనిచేసి, చర్మాన్ని కాంతివంతంగా మెరిసేలా చేస్తాయి.
ఎప్పుడైతే వీటిని ముఖానికి అప్లై చేస్తారో అప్పుడు, వీటితో పాటు వేరే ఇతర స్కిన్ కేర్ పదార్థాలను కూడా జోడించి తీసుకోవచ్చు. వీటిని ఫేస్ మాస్క్ లా తయారుచేసి వేసుకోవచ్చు,. ఇలాంటి ఫేస్ మాస్క్ ల కోసం గుడ్డు, పాలు, మరియు మైదా వంటివి నేచురల్ పదార్థాలను జోడించడం వల్ల ఫేస్ మాస్క్ లు మరింత చిక్కగా తయారై, ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి . స్కిన్ టోన్ మెరుగుపరచడంలో చాలా గ్రేట్ గా పనిచేస్తాయి. మరి ఈ ఫేస్ మాస్క్ లను ఎలా తయారుచేయాలి. ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం...

గ్రేప్ వైన్ మాస్క్:
గ్రేప్ వైన్ మాస్క్ కోసం ఒక మిక్సింగ్ బౌల్లో 4 టేబుల్ స్పూన్ల గ్రేప్ వైన్ తీసుకొని అందులో గుడ్డులోని పచ్చసొన, ఒక గుడ్డు వేసి బాగా మిక్స్ చేయాలి.దీన్ని ముఖానికి అప్లై చేసి డ్రై అయ్యేంత వరకూ ఉండి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకొని, మెత్తటి టవల్ తో తుడుచుకోవాలి.

టమోటో మాస్క్:
ఈ మాస్క్ వల్ల తక్షణ గ్లో వస్తుంది. అంతే కాదు చర్మంలో నేచురల్ గ్లో వస్తుంది. అందుకు బౌల్లో 1 టేబుల్ స్పూన్ తేనె, ఎగ్ వైట్ , 1/2టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1/3కప్పు ఓట్ మీల్ 3టేబల్ స్పూల్ టమోటోగుజ్జు తీసుకొని బాగా మిక్స్ చేయాలి . ఈ మాస్క్ ను ముఖానికి పట్టించాలి. ఇలా పది రోజుల పాటు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

అవొకాడో మాస్క్:
1/2కప్పుు అవొకాడోలో 1 చెంచా ఆపిల్ జ్యూస్, 1 చెంచా బ్రౌన్ రైస్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసి అందులోనే కొద్దిగా బియ్యం పిండి కూడా వేసి స్మూత్ గా పేస్ట్ చేసి , ఆపిల్ జ్యూస్ మిక్స్ చేసి తర్వాత ముఖానికి అప్లై చేయాలి. డ్రై అయిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

చామంతి మాస్క్ :
గ్లోయింగ్ స్కిన్ కోసం మీరు 1 కప్పు పుదీని పేస్ట్ లో 1 టేబుల్ స్పూన్ చమోమెలీ టీ మరియు 1 టేబుల్ స్పూన్ కీరదోస పేస్ట్ వేసి బ్లెడ్ చేసి, ముఖానికి అప్లై చేయాలి. 10 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

కీరదోస మాస్క్ :
కీరదోస మాస్క్ చర్మానికి తగిన హైడ్రేషన్ అందివ్వడంతో పాటు చర్మం కాంతివంతంగా గ్లోయింగ్ తో మెరిసేలా చేస్తుంది . కీరదోసకాయ సగం తీసుకొని దానికి పుదీనా జోడించి పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ లో కాటన్ బాల్స్ డిప్ చేసి ముఖం, కళ్ళ చుట్టూ అప్లై చేస్తూ మర్ధన చేయాలి.20 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

తేనెతో మాస్క్
డార్క్ స్కిన్ నివారించుకోవడం కోసం ఈ హోం మేడ్ ఫేస్ మాస్క్ గ్రేట్ గా సహాయపడుతుంది.1/2కీరదోస , తేనె మరియు పెరుగు మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి, `15 నిముషాల తర్వాత మర్ధన చేస్తూ 10 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఆరెంజ్ మాస్క్:
ఆరెంజ్ పీల్ పౌడర్లో 1/2టీస్పూన్ పసుపు వేసి 1 చెంచాత తేనె వేసి పేస్ట్ చేసి ముఖానికి అప్లై చేయాలి. డ్రై అయిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
8. కోకోనట్ మాస్క్ ఇది చర్మానికి

కోకోనట్ మాస్క్ ఇది చర్మానికి :
ఒక టేబుల్ స్పూన్ కోకనట్ తురుము, రాయల్ జెల్లీ, ఫ్లేవర్డ్, పాలు, మిక్స్ చేయాలి. ఇవన్నీ ఒక గిన్నెలో తీసుకొని మిక్స్ చేసి ముఖం మెడకు అప్లై చేసి 15 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి



Click it and Unblock the Notifications