Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
ముడతలను మటుమాయం చేసే.. మ్యాజికల్ ఫేస్ ప్యాక్
ముడతలు, ఏజ్ స్పాట్స్.. వయసుని తెలిపే లక్షణాలు. వీటిని తగ్గించడం సాధ్యమే. అదికూడా న్యాచురల్ హోం రెమిడీస్ ఉపయోగించే.. ముడతలు మచ్చలు నివారించడం తేలికైన పని.
అందమైన చర్మం.. ఆరోగ్యానికి, సంతోషానికి, ఆనందంగా ఉన్నారు అనడానికి సంకేతం. అలాగే ఏజ్ స్పాట్స్, ముడతలు, స్కార్స్, మొటిమలు లేకపోతే.. మరింత.. హెల్తీగా, అందంగా, ఆకర్షణీయంగా ఉన్నట్టు సంకేతం.
అయితే ముడతలు, ఏజ్ స్పాట్స్.. వయసుని తెలిపే లక్షణాలు. వీటిని తగ్గించడం సాధ్యమే. అదికూడా న్యాచురల్ హోం రెమిడీస్ ఉపయోగించే.. ముడతలు మచ్చలు నివారించడం తేలికైన పని.

ఈ ముడతలు, మచ్చలు నివారించడానికి మార్కెట్ లో లభించే యాంటీ వ్రింకిల్ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తే.. వాటిల్లో ఉండే కెమికల్స్.. చర్మానికి చాలా హాని చేస్తాయి. కాబట్టి.. న్యాచురల్ రెమిడీస్ ప్రయత్నించడం వల్ల.. ఫలితాలు మెరుగ్గా ఉంటాయి.

బొప్పాయి, తేనె ప్యాక్
బొప్పాయి చాలా హెల్తీ ఫ్రూట్. ఇందులో యాంటీ ఏజింగ్ గుణాలు ఉండటం వల్ల.. డార్క్ స్పాట్స్, ముడతలను ఎఫెక్టివ్ గా నివారిస్తుంది. అలాగే.. చర్మానికి నూతనోత్తేజాన్ని ఇస్తుంది. ఇందులో ఉండే ఎంజైమ్, పపైన్ ఇన్ల్ఫమేషన్ తగ్గించి.. చర్మాన్ని స్మూత్ గా మారుస్తుంది.

ఫేస్ ప్యాక్ తయారు చేసే విధానం
బొప్పాయి గుజ్జు, తేనె తీసుకుని.. రెండింటినీ బాగా మిక్స్ చేయాలి. ఈ మిక్స్ ను ముఖానికి, మెడకు పట్టించాలి. 10 నిమిషాలు ఆరిన తర్వాత.. శుభ్రం చేసుకోవాలి. ఇది డెడ్ స్కిన్ సెల్స్ ని తొలగించి.. చర్మాన్ని సాఫ్ట్ గా, ముడతలు, మచ్చలు లేకుండా.. యూత్ ఫుల్ లుక్ అందిస్తుంది.



Click it and Unblock the Notifications