For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కోల్డ్ వెదర్ లో చర్మాన్ని సాఫ్ట్ గా, గ్లోయింగ్ గా మార్చుకునే సింపుల్ టిప్స్..!

By Swathi
|

చల్లటి వాతావరణం ఉన్నప్పుడు.. గాలిలో తేమ శాతం తగ్గిపోతుంది. దీనివల్ల చర్మం డల్ గా, నిర్జీవంగా మారుతుంది. చల్లటి గాలులు.. మీ మూడ్ ని ఆహ్లాదంగా మార్చినప్పటికీ.. చర్మం నిర్జీవంగా మార్చేస్తుంది. దీనివల్ల చర్మం డ్రైగా కూడా మారుతుంది.

వాతావరణం చల్లగా ఉన్నప్పుడు చర్మం డ్రైగా, రఫ్ స్కిన్ గా మారుతుందని.. చాలా మంది చెబుతూ ఉంటారు. కాబట్టి.. ఈ చల్లటి వాతావరణం సమయంలో.. సరైన చర్మ సంరక్షణ చాలా అవసరం. డ్రై ప్యాచెస్, బ్రేక్ ఔట్స్ వంటి సమస్యలు దూరంగా ఉండాలంటే.. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

అందుకే ఈ కోల్డ్ వెదర్ చర్మాన్ని అందంగా, గ్లోయింగ్ గా మార్చుకోవడానికి ఫాలో అవ్వాల్సిన ఎఫెక్టివ్, సింపుల్ టిప్స్ ఏంటో చూద్దాం. ఈ టిప్స్ పక్కాగా ఫాలో అవడం వల్ల.. చర్మానికి బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు ఇవన్నీ తక్కువ ఖర్చుతో కూడిన, ఇంట్లోని వస్తువులతో తయారు చేసుకునేవే. మరి న్యాచురల్ బ్యూటీ టిప్స్ ఏంటో ఫాలో అయిపోదామా..

మాయిశ్చరైజర్

మాయిశ్చరైజర్

చలికాలంలో ఆయిల్ బేస్డ్ మాయిశ్చరైజర్ అప్లై చేయడం వల్ల డ్రైనెస్ కి దూరంగా ఉండవచ్చు. చర్మానికి మాయిశ్చరైజర్ అందించడం వల్ల అది సాఫ్ట్ గా, న్యాచురల్ గ్లోయింగ్ ని కలిగి ఉంటుంది.

ఆయిల్ ట్రీట్మెంట్

ఆయిల్ ట్రీట్మెంట్

కొబ్బరినూనె లేదా ఆల్మండ్ ఆయిల్ చర్మానికి పట్టించడం వల్ల.. చర్మం సాఫ్ట్ గా మారుతుంది. స్నానానికి ముందు ఆయిల్ రాసుకోవడం వల్ల.. చర్మానికి మంచి పోషణ అందుతుంది.

తేనె, రోజ్ వాటర్

తేనె, రోజ్ వాటర్

ఒక టీ స్పూన్ తేనె, 2 టీస్పూన్ల రోజ్ వాటర్ కలిపి ముఖానికి పట్టించాలి. ఇలా చేస్తూ ఉంటే.. చర్మానికి గ్లో వస్తుంది. ఇలా వారానికి 3 నుంచి 4 సార్లు చేయడం వల్ల.. మంచి ఫలితాలు చూడవచ్చు.

ఎక్స్ ఫోలియేట్

ఎక్స్ ఫోలియేట్

ఎక్స్ ఫోలియేషన్ వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోవడమే కాదు.. మలినాలను కూడా తొలగిస్తుంది. వారానికి ఒకసారి ఇలా చేస్తూ ఉంటే.. చర్మంలో పీహెచ్ లెవెల్స్ బ్యాలెన్స్ అవుతాయి.. చర్మం డ్రైగా మారకుండా ఉంటుంది.

హైడ్రేటెడ్

హైడ్రేటెడ్

చాలామంది డీహైడ్రేషన్ తో బాధపడతారు. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు నీళ్లు సరిగా తాగకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. కాబట్టి.. వెదర్ ఎలా ఉన్నా.. సరైన మోతాదులో నీళ్లు తాగితే.. చర్మం కూడా గ్లోయింగ్ గా ఉంటుంది.

అలోవెరా జెల్

అలోవెరా జెల్

అలోవెరా జెల్ ని చర్మానికి పట్టించడం వల్ల చర్మం సాఫ్ట్ గా, మాయిశ్చరైజ్డ్ గా ఉంటుంది. అలాగే.. క్రిములను తొలగించి, చర్మ సమస్యలను నివారిస్తుంది.

English summary

Tips To Keep Your Skin Soft And Glowing During Cold Weather

Tips To Keep Your Skin Soft And Glowing During Cold Weather. Lack of moisture in the air during cold weather can make your skin appear dry and dull.
Story first published: Thursday, July 7, 2016, 15:22 [IST]
Desktop Bottom Promotion