Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మొటిమలను నివారించుకోవడానికి టమోటో ఫేస్ ప్యాక్ ట్రీట్మెంట్
ప్రస్తుత కాలంలో చర్మం సంబంధిత క్రీములు కొనేందుకు భారీగా వెచ్చిస్తున్నారు.. అయితే ఇకపై ఆ డబ్బును ఆదా చేయండి. ఎలాగంటారా.. టమోటా జ్యూస్ తీసుకోవడం ద్వారానే. అసలు విషయమేమిటంటే... నిత్యయవ్వనులుగా కనిపించాలంటే టమోటా జ్యూస్, సూప్ వంటివి తీసుకుంటే చాలునని తాజా అధ్యయనంలో తేలింది.
వయసు మీదపడటంతో ఏర్పడే ముడతలకు చెక్ పెట్టాలంటే టమోటా గుజ్జుతో ప్యాక్ వేసుకుంటే సరిపోతుందని లండన్‌లోని రాయల్ సొసైటీ ఆఫ్ మెడిసన్ కళాశాల నిర్వహించిన పరిశోధనలో తేలింది. ఎరుపాటి టమోటాల గుజ్జును ముఖానికి ప్యాక్ వేసుకోవడమే గాకుండా.. క్రమం తప్పకుండా టమోటా జ్యూస్ తాగడం, వంటల్లో అధికంగా టమోటాలను చేర్చడంతో మహిళల అందం మరింత పెరుగుతుందని, మొటిమలు మచ్చలు, స్కిన్ రాషెస్, స్కిన్ ప్యాచెస్ వంటి సమస్యలను తగ్గించుకోవచ్చని తాజా అద్యయంలో పేర్కొన్నారు.

టమోటోను ఫేస్ ప్యాక్ ను ముఖానికి ప్యాక్ వేయడం వల్ల చర్మం రంధ్రాలను శుభ్రం చేయడానికి సహాయపడుతుంది. ఈ ప్యాక్ వల్ల చర్మం తాజాగా ఉంటుంది. 21-47 వయసు గల మహిళలపై ఈ పరిశోధన చేయబడింది. ఈ పరిశోధనలో టమోటాలు తీసుకునే వారిలో సూర్యరశ్మి నుంచి చర్మాన్ని సంరక్షించగల సామర్థ్యం అధికంగా కలదని తెలిసింది. అలాగే మహిళలు మొటిమలు, మచ్చలు తొలగించుకోవడానికి ఉపయోగించే లోషన్స్, క్రీముల కంటే ఎఫెక్టివ్ గా పనిచేస్తుందని కనుగొన్నారు .
టమోటోల్లో వివిధ రకాల న్యూట్రీషియన్స్ మరియు మినిరల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇంకా విటల్ యాంటీ ఆక్సిడెంట్ లైకోపిన్ కూడా ఉంది . లైకోపిన్ అనే కెమికల్ టమోటోకు ఎరుపు దనం అందివ్వడం మాత్రమే కాదు, ముఖం అందాన్ని కూడా రెట్టింపు చేస్తుంది, టమోటోలను ముఖానికి అప్లై చేసినప్పుడు, మొటిమలు ఎఫెక్టివ్ గా నివారించబడుతాయి,. చర్మానికి ఇతర రకాలుగా కూడా ఉపయోగపడుతాయి . ఇది కూలింగ్ ఏజెంట్ గా, స్కిన్ కు ఆస్ట్రిజెంట్ గా పనిచేస్తుంది. ఇది చర్మంలోని ఎక్సెస్ ఆయిల్ ను నివారిస్తుంది. విటమిన్ ఎ మరియు సి చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చుతుంది.

మొటిమలను నివారించుకోవడానికి టమోటోను ఏలా ఉపయోగించాలి? టమోటో జ్యూస్, తొక్క, లేదా గుజ్జును మొటిమలున్న ప్రదేశంలో అప్లై చేసుకోవచ్చు. దీన్ని నేరుగా చర్మానికి అప్లై చేసుకోవచ్చు . మొటిమలను నివారించుకోవడానికి కొన్ని ఫేస్ మాస్క్ లు:
బేసిక్ టమోటో ఫేస్ మాస్క్: టమోటోలో విత్తనాలు తొలగించి మెత్తగా చేయాలి. దీన్ని నేరుగా ముఖం మొత్తం అప్లై చేసి సున్నితంగా మర్ధన చేయాలి. ఒక గంట తర్వాత శుభ్రం చేసుకుంటే మొటిమలను తొలగిపోతాయి. మాయిశ్చరైజర్ ను అప్లై చేయాలి.

టమోటో అవొకాడో ఫేస్ మాస్క్: అవొకాడోలో యాంటీ సెప్టిక్ మరియు మాయిశ్చరైజింగ్ లక్షణాలున్నాయి . టమోటలను ఉపయోగించినప్పుడు. ఇది మొటిమలరాకుండా వ్యతిరేఖంగా పనిచేస్తుంది, టమోటో గుజ్జుకు అవొకాడో మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. 20 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

టమోటో మరియు పెరుగు ఫేస్ మాస్క్: అరటమోటో గుజ్జు చేసి, అందులో రెండు టీస్పూన్ల పెరుగు వేసి మిక్స్ చేసి అప్లై చేయాలి. అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇది మొటిమలను నివారిస్తుంది, దురద మరియు సన్ బర్న్ ను నివారిస్తుంది. టమోటో కూలింగ్ ఎఫెక్ట్స్ కలిగి ఉంటుంది. పెరుగులో ఉండే ప్రోటీన్ లెవల్స్ పెరుగుతుంది, స్కిన్ ను కూల్ గా మరియు సాప్ట్ గా మార్చుతుంది.

క్విక్ టమోటో ట్రీట్మెంట్: మీకు సమయం లేనప్పడు టమోటో ఫేస్ మాస్క్ అప్లై చేయాలి. టమోటోను రెండుగా కట్ చేసి ముఖానికి అప్లై చేసి మర్ధన చేయాలి. ఇలా చేయడం వల్ల బ్లాక్ హెడ్స్, మొటిమలను మరియు సిస్ట్ ను నివారిస్తుంది, తర్వాత మాయిశ్చరైజర్ ను అప్లై చేయాలి.

టమోటో మరియు నిమ్మరసం: టమోటో జ్యూస్ లో నిమ్మరసం మిక్స్ చేయాలి. ముఖానికి అప్లై చేయాలి . ఈమిశ్రమంలో కాటన్ డిప్ చేసి ముఖమంతా అప్లై చేసే అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. తర్వాత హాట్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి.



Click it and Unblock the Notifications