For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సమ్మర్ సన్ టాన్ కు చెక్ పెట్టే 16 హోం మేడ్ నేచురల్ ఫేస్ ప్యాక్స్ ..

|

ప్రతి సీజన్ లో చర్మానికి రక్షణ కల్పించడం చాలా ముఖ్యం, వేసివి కాలం రాబోతోంది. ఈ వేసవికాలంలో చర్మం మీద డైరెక్ట్ గా uv కిరణాలు, మరియు దుమ్మ ధూళి వల్ల చర్మానికి హాని కలుగుతుంది. అంతే కాదు వేసవిలో ఎండల వల్ల వచ్చే చమటతో కూడా చర్మం పాడవుతుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా చర్మం మీద తగినంత జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. వేసవిలో వేడి చర్మాన్ని ప్రభావితం చేస్తుంది. చర్మం కమిలిపోవడం..స్నానం చేసిన గంటకే తాజాదనం తగ్గి శరీరం వడిలిపోయినట్లు అవడం..లాంటి సమస్యలు ఎన్నో.. అలాంటి వాటిని అదుపులో ఉంచి చర్మం తాజాదంన సంతరించుకునేలా చేయాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

వేసవి సీజన్ లో పెరుగు తినడం వల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాలు ఎండాకాలం వేధించే అతి పెద్ద సమస్య...'సన్‌ ట్యాన్‌'. సన్ స్క్రీన్ లోషన్లు, గొడుగులు, దుపట్టాలు...ఇలా ఎన్ని వాడుతూ ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎండకు చర్మం నల్లగా తయారవటం మానదు. ఇలాంటప్పుడు క్రమం తప్పకుండా ఆ ట్యాన్‌ను తొలగించే ఫేస్‌ ప్యాక్స్‌ వేసుకుంటూ ఉండాలి. కూలింగ్ వస్తువులతో తాజా ఫేస్ ప్యాక్స్ వల్ల వేసవి టాన్ మరియు ఇతర చర్మ సమస్యల నుండి బయట పడటానికి సహాయపడుతుంది. మరి చర్మానికి చల్లదనాన్ని కల్పించి సూర్యుని తాపం నుండి రక్షణ పొందడానికి అనేక ఫేస్ ప్యాక్స్ ఉన్నాయి.

వేసవిలో చర్మం నల్లబడకుండా కాపాడుకోవడం ఎలా..?

వేసవిలో చర్మం నల్లబడకుండా కాపాడుకోవడం ఎలా..? సన్‌ ట్యాన్‌ ఎందుకొస్తుందంటే? అందరి చర్మంలో మెలనిన్‌ ఉంటుంది. ఇదే చర్మానికి రంగునిస్తుంది. తక్కువ మెలనిన్‌ ఉంటే తెల్లగా, ఎక్కువ మెలనిన్‌ ఉంటే నల్లగా కనిపిస్తాం. మన చర్మంలోని మెలనోసైట్స్‌ అనే కణాలు ఈ మెలనిన్‌ను తయారుచేస్తాయి. ఈ మెలనిన్‌ మన చర్మం అడుగునున్న పొరలు డ్యామేజ్‌ కాకుండా కాపాడుతుంది.

ఈ క్రమంలో సూర్యరశ్మిలోని అలా్ట్రవయొలెట్‌ కిరణాల నుంచి చర్మపు లోపలి పొరలను రక్షించటం కోసం చర్మంలో మెలనిన్‌ ఎక్కువగా తయారవుతుంది. దాంతో చర్మం మరింత నల్లగా తయారవుతుంది. ఇలాంటప్పుడు చామనఛాయ రంగు వాళ్లు నల్లగా, తెల్లని చర్మంవాళ్లు ఎర్రగా తయారవుతారు. దీన్నే సన్‌ ట్యాన్‌ అంటుంటాం. దీన్ని పోగొట్టాలంటే కొన్ని ఫేస్‌ ప్యాక్స్‌ వాడాలి. అవేంటో చూద్దాం...

 పుచ్చకాయ:

పుచ్చకాయ:

దీన్ని ప్రతి రోజూ తింటే శరీరం చల్లగా ఉంటుంది. ఇందులో పీచుపదార్థం ఎక్కువ కాబట్టి శరీరంలోని మిలినాల్నీ వెలుపలికి వచ్చేస్తాయి. పుచ్చకాయను పెద్ద ముక్కలా తరిగి దాన్ని తేకెలో ముంచి ముఖానికి రాసుకుని రెండు నిమిషాలు మర్దన చేస్తే సరిపోతుంది. చర్మం తాజాగా మారుతుంది. అలాగే పుచ్చకాయ పలుచని ముక్కల్లా కోసి ముఖంపై అద్ది కొద్దిగా వేడిగా ఉన్న వస్త్రాన్ని కప్పి ఉంచాలి. రెండు నిమిషాలయ్యాక తీసేస్తే చర్మం సహజ కాంతిని సంతరించుకుంటుంది.

 బొప్పాయితో ఫేస్ ప్యాక్:

బొప్పాయితో ఫేస్ ప్యాక్:

బొప్పాయి గుజ్జులో అర టీ స్పూన్ ఓట్స్ పొడి, అర టీ స్పూన్ తేనె, అయిదారు చుక్కల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకి పట్టించి అరగంట పాటు ఆరనివ్వాలి. తర్వాత చల్లటి నీటితో కడగాలి. వారానికి రెండు సార్లు చేస్తే ముఖంపైన జిడ్డు తగ్గి చర్మం కోమలంగా ఉంటుంది.

దోసకాయ, రోజ్ వాటర్ మరియు నిమ్మ రసం ప్యాక్

దోసకాయ, రోజ్ వాటర్ మరియు నిమ్మ రసం ప్యాక్

దోసకాయ మరియు నిమ్మకాయ రెండు కూడా పరిపూర్ణమైన సహజ బ్లీచింగ్ కారకాలు. సన్ టాన్ తొలగించుకోవటానికి తయారుచేసుకొనే అత్యంత ప్రభావవంతమైన ఫేస్ ప్యాక్ లలో ఇది ఒకటి. నిమ్మకాయ రసంలో విటమిన్ సి మరియు సిట్రిక్ యాసిడ్ సమృద్దిగా ఉండుట వలన చర్మ టోన్ కి సహాయం మరియు స్పష్టమైన చర్మాన్ని నిర్వహించటానికి సహాయపడుతుంది. విటమిన్ సి వంటి శక్తివంతమైన యాంటి ఆక్సిడెంట్ ఫ్రీ రాడికల్స్ వలన కలిగే నష్టాన్ని తటస్థీకరించి సన్ టాన్, వయస్స రిత్యా వచ్చే మచ్చలు, నల్లని మచ్చలు తగ్గటానికి సహాయపడుతుంది. నిమ్మకాయ నివారణను ఉపయోగించినప్పుడు తప్పనిసరిగా ఆధిక SPF కలిగిన సన్ స్క్రీన్ లోషన్ వాడాలి. ఎందుకంటే నిమ్మరసంలో ఆమ్ల గుణం ఉండుట వలన సూర్యుని UV కిరణాలు చర్మాన్ని సున్నితంగా మారుస్తాయి.

ఒక బౌల్ లో ఒక స్పూన్ దోసకాయ రసం,ఒక స్పూన్ నిమ్మరసం,ఒక స్పూన్ రోజ్ వాటర్ తీసుకోని బాగా కలిపి ప్రభావిత ప్రాంతంలో రాసి 10 నిముషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేయాలి. ఈ ప్యాక్ ని ప్రతి రోజు ఎండలో బయటకు వెళ్లి ఇంటికి వచ్చిన తర్వాత వేసుకోవాలి.

శనగపిండి మరియు పసుపు ఫేస్ ప్యాక్

శనగపిండి మరియు పసుపు ఫేస్ ప్యాక్

ఈ ఫేస్ ప్యాక్ బ్లీచింగ్ మరియు స్క్రబింగ్ కొరకు చాల ప్రభావవంతంగా పనిచేస్తుంది. పసుపులో ఉండే అద్భుతమైన ఔషధ గుణాల కారణంగా చర్మంపై అద్భుతమైన ప్రభావాలను చూపుతుంది. ఇది చర్మ టాన్ తొలగించి చర్మం మెరిసేలా చేస్తుంది. శనగపిండి ఒక ఎక్స్ ఫ్లోట్ గా పనిచేసి మృత కణాలను తొలగించటంలో మంచి స్క్రబ్ గా పనిచేస్తుంది.

ఒక బౌల్ లో రెండు స్పూన్స్ శనగపిండి,చిటికెడు పసుపు, ఒక స్పూన్ పాలు, ఒక స్పూన్ ఆరెంజ్ తొక్కల పొడి వేసుకొని బాగా కలిపి పేస్ట్ గా తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్ ని ముఖానికి రాసి 20 నిమిషాల తర్వాత, ముఖం మీద నీరు జల్లి సవ్య మరియు వ్యతిరేక దిశలలో స్క్రబింగ్ చేస్తూ ప్యాక్ ని తొలగించాలి. ఈ ప్యాక్ ని రెండు రోజులకు ఒకసారి వేస్తె సన్ టాన్ ను తొలగించుకోవచ్చు.

 బొప్పాయి మరియు తేనె ఫేస్ ప్యాక్

బొప్పాయి మరియు తేనె ఫేస్ ప్యాక్

బొప్పాయి పండులో ఉండే ఎంజైమ్స్ ముఖం నుండి సన్ టాన్ తొలగించడానికి సహాయపడతాయి. బొప్పాయిలో ఉండే పపైన్ అనే ఎంజైమ్ సన్ టాన్, నల్లని మచ్చలు తొలగించటానికి సహాయపడుతుంది. బొప్పాయిలో ఉండే ఇతర ఎంజైములు చర్మ పునరుద్ధరణ కొరకు సహాయపడతాయి. పగిలిన పెదాలకు తేనే రాయటం అనేది ఒక పురాతనమైన పరిష్కారం. తేనే చర్మంలో తేమ ఉండేలా చేసి పెదాలను మృదువుగా చేస్తాయి. ఒక బౌల్ లో అరకప్పు బొప్పాయి గుజ్జు, ఒక స్పూన్ తేనే వేసి బాగా కలిపి ముఖానికి రాసి 20 నిముషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

 టమోటా,పెరుగు మరియు నిమ్మరసం ఫేస్ ప్యాక్

టమోటా,పెరుగు మరియు నిమ్మరసం ఫేస్ ప్యాక్

మనం బరువు నష్టం కోసం నిమ్మ టీ యొక్క ప్రయోజనాలను తెలుసుకున్నాం. కానీ నిమ్మరసం కూడా చర్మం కోసం గొప్పగా పనిచేస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ లో ఉండే నిమ్మ, టమోటా మరియు పెరుగులో శక్తివంతమైన బ్లీచింగ్ లక్షణాలు ఉండుట వలన సహజంగా చర్మం టోన్ ను మెరుగుపరిచటానికి ఉత్తమ ఫేస్ ప్యాక్ లలో ఒకటిగా ఉంది . టమోటా రసం చర్మ రంద్రాలను తెరచి చర్మం జిడ్డును తొలగించటానికి ఒకసహజ టోనర్ గా పనిచేస్తుంది. పెరుగు చర్మానికి పోషణ మరియు తేమను అందిస్తుంది. ఒక బౌల్ లో రెండు స్పూన్ల టమోటా గుజ్జు, ఒక స్పూన్ నిమ్మరసం,ఒక స్పూన్ పెరుగు కలిపి ముఖానికి రాసి 30 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ప్రారంభంలో టమోటా రసం కారణంగా దురద రావచ్చు. అయితే ప్రతి రోజు రాయటం వలన నిదానంగా దురద తగ్గిపోతుంది.

కలబంద, ఎర్ర కందిపప్పు మరియు టమోటో ఫేస్ ప్యాక్

కలబంద, ఎర్ర కందిపప్పు మరియు టమోటో ఫేస్ ప్యాక్

కలబందలో తేమ గుణాలు,ఎర్ర కంది పప్పులో ఎక్స్ ఫ్లోట్ లక్షణాలు ఉండుట వలన సన్ టాన్ తొలగించటానికి ఉత్తమ ఇంటి నివారణలలో ఒకటిగా ఉంది. అలాగే కలబందను ఉత్తమ జుట్టు ప్యాక్ లలో కూడా ఉపయోగిస్తారు. కలబందలో స్టెరాయిడ్లు ఉండుట వలన చర్మం మంట మరియు వాపు నయం చేయటానికి సహాయపడుతుంది. టమోటా చర్మంలో చైతన్యం నింపటానికి మరియు లోపల నుండి జీవం పోయటానికి సహాయపడుతుంది. ఎర్ర కందిపప్పును 20 నిముషాలు నానబెట్టి మెత్తని పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ లో కలబంద గుజ్జు, ఒక స్పూన్ టమోటా గుజ్జు కలిపి ముఖం మరియు మెడకు రాసి 20 నిముషాలు తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

వోట్మీల్ మరియు మజ్జిగ ఎక్స్ ఫ్లోట్ ప్యాక్

వోట్మీల్ మరియు మజ్జిగ ఎక్స్ ఫ్లోట్ ప్యాక్

వోట్మీల్ గొప్ప ఎక్స్ ఫ్లోటర్ గా పనిచేస్తుంది. సూర్యుని టాన్ ని తొలగించడానికి వేగవంతమైన మరియు సులువైన పరిష్కారము అని చెప్పవచ్చు. మజ్జిగ చర్మానికి తేమ అందించటం,మృదువుగా ఉండేలా చేయటం, దద్దుర్లను నయం చేయటంలో సహాయపడుతుంది. వోట్మీల్ చర్మాన్ని ఎక్స్ ఫ్లోట్ చేసి బ్లాక్ హెడ్స్,మృత కణాలను తొలగిస్తుంది. మూడు స్పూన్ల మజ్జిగలో రెండు స్పూన్ల వోట్మీల్ కలిపి పేస్ట్ గా చేసి ముఖానికి రాసి 20 నిముషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఆరెంజ్ జ్యూస్ మరియు పెరుగు ఫేస్ ప్యాక్

ఆరెంజ్ జ్యూస్ మరియు పెరుగు ఫేస్ ప్యాక్

ఈ ఫేస్ ప్యాక్ లో విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన కొత్త చర్మ కణాల పునరుత్పత్తి మరియు సన్ టాన్ తొలగించటానికి సహాయపడుతుంది. ఆరెంజ్ మచ్చలను తొలగించటానికి, చర్మపు నిర్మాణం మరియు చర్మం టోన్ ను మెరుగుపరుస్తుంది. అంతేకాక వృద్ధాప్య ప్రక్రియను కూడా తగ్గిస్తుంది. పెరుగు చర్మాన్ని మృదువుగా చేయటానికి సహజ బ్లీచ్ మరియు మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. ఒక స్పూన్ పెరుగులో ఒక స్పూన్ ఆరెంజ్ రసాన్ని కలిపి ముఖానికి రాసి 30 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

బంగాళదుంప మరియు నిమ్మకాయ ఫేస్ ప్యాక్

బంగాళదుంప మరియు నిమ్మకాయ ఫేస్ ప్యాక్

బంగాళాదుంపలో విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్ మరియు ఫైబర్ సమృద్దిగా ఉన్నాయి. బంగాళ దుంపలు చర్మం టోన్ తేలిక పరచటం మరియు ఆరోగ్యకరమైన మెరుపు, సన్ టాన్ తొలగించటానికి పురాతన నివారణలలో ఒకటి అని చెప్పవచ్చు. బంగాళాదుంప మరియు నిమ్మ రసం కలయికతో నల్లటి వలయాలను తొలగించవచ్చు. బంగాళదుంప నుండి రసాన్ని బ్లెండర్ సాయంతో తీయాలి. ఒక స్పూన్ బంగాళదుంప రసంలో ఒక స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి రాసి 30 నిముషాలు అయ్యాక శుభ్రం చేసుకోవాలి.

స్ట్రాబెర్రీ మరియు పాల మీగడ ఫేస్ ప్యాక్

స్ట్రాబెర్రీ మరియు పాల మీగడ ఫేస్ ప్యాక్

ప్రకాశవంతమైన ఎర్రటి పండ్లలో రంగు అభివృద్ధి మరియు నల్లని మచ్చలు, పిగ్మెంటేషన్ తగ్గించడానికి సహాయపడే చర్మ సౌందర్య లక్షణాలు ఉన్నాయి. మిల్క్ క్రీమ్ చర్మంనకు లోతైన పోషణ మరియు తేమను అందిస్తుంది. నాలుగు స్ట్రాబెర్రీ లను మెత్తని పేస్ట్ గా చేసి, దానిలో రెండు స్పూన్ల పాల మీగడను కలిపి ముఖానికి రాసి 30 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

పాల పొడి,తేనె మరియు బాదం ఆయిల్ ఫేస్ ప్యాక్

పాల పొడి,తేనె మరియు బాదం ఆయిల్ ఫేస్ ప్యాక్

బాదం నూనె మరియు బాదం పాలలో అనేక చర్మ ప్రయోజనాలు ఉన్నాయి. పాల పొడి చర్మాన్ని తేమగా ఉంచి, సన్ టాన్ ప్రభావాలను తగ్గించటం,చర్మంనకు ఒక స్పష్టమైన టోన్ మరియు నిర్మాణంను అందజేయటంలో సహాయపడుతుంది. రెండు స్పూన్ల పాల పొడిలో ఒక స్పూన్ తేనే,కొన్ని చుక్కల బాదం నూనె వేసి ముఖానికి రాసి 20 నిముషాలు అయ్యిన తర్వాత శుభ్రం చేసుకోవాలి.

గంధం మరియు కొబ్బరి నీరు ప్యాక్

గంధం మరియు కొబ్బరి నీరు ప్యాక్

చర్మం కోసం గంధం దాని ఔషద గుణాలతో అతి ప్రాచీన కాలం నుండి ప్రాచుర్యం పొందింది. గంధం పొడి లేదా పేస్ట్ మలినాలు మరియు మృత కణాలను తొలగించటానికి ఒక సహజమైన చర్మ ప్రక్షాళనగా పనిచేస్తుంది. మచ్చలు మరియు బొబ్బలను నయం చేయటంలో సహాయపడుతుంది. ఒక స్పూన్ గంధంలో కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్ మరియు కొబ్బరి నీరు కలిపి పేస్ట్ గా తయారుచేయాలి. ఈ పేస్ట్ ని ముఖానికి రాసి 20 నిముషాలు అయ్యాక శుభ్రం చేసుకోవాలి.

కుంకుమ పువ్వు మరియు తాజా క్రీమ్ ఫేస్ ప్యాక్

కుంకుమ పువ్వు మరియు తాజా క్రీమ్ ఫేస్ ప్యాక్

కుంకుమ పువ్వు (కేసర్) చర్మ సంరక్షణ కోసం ఒక పురాతన పదార్ధంగా ఉంది. కుంకుమ పువ్వు చర్మం కాంతివంతంగా,టానింగ్, టాన్ తొలగింపు మరియు మోటిమల మీద పోరాటం చేయటానికి సహాయపడుతుంది. రాత్రి సమయంలో రెండు స్పూన్ల పాల మీగడలో కొన్ని కుంకుమ పువ్వు తంతువులను నానబెట్టాలి. మరుసటి ఉదయం ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి 20 నిమిషాల తర్వాత శుభ్రం చేయాలి. ఈ ప్యాక్ లోతైన మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది.

 పైనాపిల్ మరియు తేనే ఫేస్ మాస్క్

పైనాపిల్ మరియు తేనే ఫేస్ మాస్క్

పైనాపిల్ ఉప్పగా మరియు తాజా రుచితో ఉష్ణ మండల పండ్లలో రాజుగా ఉంది. దీనిలో ఉండే ఎంజైమ్స్ కాలిన ప్రాంతాల నుంచి మృత కణాలను తొలగించడంలో సహాయపడతాయి. పైనాపిల్ లో విటమిన్ సి మరియు యాంటి ఆక్సిడెంట్ సమృద్దిగా ఉండుట వలన ఫ్రీ రాడికల్స్ మరియు ఆక్సీకరణ ఒత్తిడి ద్వారా వచ్చే ప్రభావాలను తటస్థపరచి చిన్న చిన్న మచ్చలు, ముడతలు,లైన్స్, వృద్ధాప్య గుర్తులు, పిగ్మెంటేషన్ మరియు సన్ టాన్ తొలగించటంలో సహాయపడుతుంది. రెండు స్పూన్ల పైనాపిల్ గుజ్జులో ఒక స్పూన్ తేనే కలిపి ముఖానికి రాసి 3 నుంచి 5 నిమషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

ముల్తానీ మిట్టీ మరియు కలబంద ప్యాక్

ముల్తానీ మిట్టీ మరియు కలబంద ప్యాక్

ముల్తానీ మిట్టీ మొత్తం చర్మానికి రక్షణ కలిగిస్తుంది. ఇది చల్లని ప్రభావాన్ని కలిగించి చర్మ చికాకు, దద్దుర్లు, మోటిమలు మరియు మచ్చలను తగ్గిస్తుంది. కలబంద జెల్ చర్మం టోన్ మరియు ఒక సహజ ప్రక్షాళనగా పనిచేస్తుంది. రెండు స్పూన్ల ముల్తానీ మిట్టీలో ఒక స్పూన్ కలబంద జెల్ వేసి బాగా కలిపి ముఖానికి రాసి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.

English summary

Top 16 Homemade Face Packs to Remove Sun Tan – Natural Remedies

Summer is already here, and it is time to bring out your short dresses and shades to enjoy the summer sun at the park or the beach with family and friends. Despite all the happiness and fun, at the end of the day most of us are left with ugly and unattractive sun tan on face and hands that takes away all the fun from the outing.
Story first published: Wednesday, April 6, 2016, 17:37 [IST]
Desktop Bottom Promotion