Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
బ్లాక్ హెడ్స్ ని నొప్పి లేకుండా తొలగించే బెస్ట్ హోం రెమిడీస్..
బ్లాక్ హెడ్స్..!! ఇతి ప్రతి అమ్మాయిని ఇబ్బందిపెట్టే సమస్య. ఒకసారి బ్లాక్ హెడ్స్ మొదలయ్యాయంటే... పూర్తీగా పోగొట్టుకోవడం చాలా కష్టం. అలాగే వీటిని తొలగించుకునేటప్పుడు చాలా నొప్పి కూడా బాధిస్తుంది. బ్లాక్ హెడ్స్ లోపలి భాగంలో హెయిర్ తోపాటు పెరుగుతూ బయటివైపు ప్రభావం చూపుతాయి.
ముఖంలో నుదురు భాగం, ముక్కు, గడ్డం వంటి ప్రాంతాల్లో ఎక్కువగా బ్లాక్ హెడ్స్ వేధిస్తూ ఉంటాయి. ఈ ప్రాంతాల్లో కాస్త ఆయిల్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ బ్లాక్ హెడ్స్ ఎక్కువగా వస్తాయి. అయితే ఈ పార్ట్స్ అన్నీ.. చాలా సెన్సిటివ్ గా ఉంటాయి. దీంతో వీటిని తొలగించుకోవాలంటే.. చాలా నొప్పిగా ఉంటుంది. పెయిన్ లేకుండా.. సింపుల్ ట్రీట్మెంట్ హోం రెమిడీస్ తోనే సాధ్యం. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

గెలటిన్ ప్యాక్
స్టిక్కీగా ఉండే గెలటిన్ బ్లాక్ హెడ్స్ ని ఎఫెక్టివ్ గా తొలగిస్తుంది. మలినాలను బయటకు పంపుతుంది. అయితే దీన్ని ఉపయోగించేటప్పు ఎక్కువ పెయిన్ ఉంటుంది. కానీ.. ఎలాంటి హాని జరగదు. గెలటిన్ పౌడర్ ని నీళ్లతో కలిపి.. వెంటనే బ్లాక్ హెడ్స్ పై రాసుకోవాలి. బాగా ఆరిన తర్వాత పీల్ ఆఫ్ చేయాలి.

టూత్ పేస్ట్ స్క్రబ్
మింట్ టూత్ పేస్ట్ తీసుకోవాలి. జెల్ లేదా వైట్ గా ఉండేది. దానికి ఉప్పు కలిపి స్క్రబ్ తయారు చేసుకోవాలి. దాన్ని ముఖంపై బాగా రబ్ చేస్తే.. తేలికగా తొలగిపోతాయి.

ఎగ్ వైట్స్
ఒక ఎగ్ లోని తెల్లసొన తీసి.. రాసుకోవాలి. తర్వాత టిఫ్యూ పేపర్ పెట్టుకోవాలి. మళ్లీ ఇంకొక లేయర్ ఎగ్ వైట్ అప్లై చేసుకోవాలి. ఆరిన తర్వాత.. తీసేస్తే.. బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి. వారానికి ఒకసారి చేస్తే.. మెరుగైన ఫలితాలు పొందవచ్చు.

బంగాళదుంప రసం
బంగాళదుంప రసంలో న్యాచురల్ బ్లీచింగ్, క్లెసింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఒక బంగాళదుంప తీసుకుని సగానికి కట్ చేసి.. బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రాంతంలో కింద నుంచి పైకి రుద్దుతూ ఉండాలి. ఇలా 10 నిమిషాల పాటు చేయడం వల్ల మంచి ఫలితం పొందవచ్చు.

పంచదారతో స్ర్కబ్
ఒక బౌల్ తీసుకుని 3 టేబుల్ స్పూన్ల చక్కెర వేయాలి.. అందులో రెండు చుక్కల రోజ్ వాటర్ కలిపి బాగా మిక్స్ చేయాలి. ఈ స్ర్కబ్ ని బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రాంతంలో మసాజ్ చేయాలి. వారానికి రెండు సార్లు ఈ పద్ధతి ఫాలో అవడం వల్ల బ్లాక్ హెడ్స్ కి గుడ్ బై చెప్పవచ్చు.

నిమ్మరసం
నిమ్మరసం ఉపయోగించడం వల్ల చర్మంపై ఉండే బ్లాక్ హెడ్స్ తొలగిపోవడమే కాదు.. స్కిన్ కొత్త నిగారింపు సంతరించుకుంటుంది. నిమ్మరసంతో ముఖాన్ని మసాజ్ చేయాలి. తర్వాత 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.



Click it and Unblock the Notifications