డ్రై స్కిన్ నివారించడానికి 10 ఆయుర్వేదిక్ రెమెడీస్..

డ్రై స్కిన్ అనేది అన్ని ఏజ్ గ్రూప్ ల వారికి వచ్చే కామన్ సమస్య. టీనేజరస్, మిడిలేజ్ స్త్రీ, పురుషులిద్దరిలో బాధించే చర్మ సమస్య. డ్రై స్కిన్ సమస్య ఎక్కువగా వింటర్లో ఉంటుంది. అలాగే మాన్ సూన్ లో కూడా ఉంటుంది. కొంత మందికి అన్ని సీజన్లోనూ డ్రై స్కిన్ బాధిస్తుంటుంది.

డ్రై స్కిన్ ఉన్న వారు ఒక చర్మ సమస్య మాత్రమే కాదు, చర్మ నల్లగా, రఫ్ స్కిన్ మరియు పీలింగ్ స్కిన్ ,రాషెస్ తో, పొక్కులుగా వుంటుంది . డ్రైస్కిన్ ను ప్రారంభంలోనే నివారించగలిగితే, ఇతర చర్మ సమస్యలన్నీ కూడా నివారించుకోవచ్చు . నిర్లక్ష్యం చేయడం వల్ల మరిన్ని ఇతర సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది.

డ్రై స్కిన్ నివారించుకోవడానికి మార్కెట్లో దొరికే ఆయిట్మెంట్స్, లోషన్స్ అప్లై చేయడం వల్ల ఫలితం ఉండదు . డ్రై స్కిన్ నివారించుకోవడానికి మార్కెట్లో క్రీముల కంటే ఆయుర్వేదంలో మంచి ఫలితం ఉంటుంది. ఆయుర్వేద మెడిసిన్స్ ను నేచురల్ హెర్బ్స్ మరియు ఫ్లవర్స్ తో తయారుచేసుంటారు . వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. క్రమం తప్పకుండా అనుసరిస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇక్కడ కొన్ని సింపుల్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ స్ ను సూచించడం జరిగింది ఇవి చాలా ఎఫెక్టివ్ గా ఉపశమనం కలిగిస్తాయి..

 కాలెండులా:

కాలెండులా:

కాలెండులా నేచురల్ ఫ్లెవనాయిడ్స్ మరియు ఆయిల్స్ ఉన్నాయి. ఇవి హెల్తీ స్కిన్ పొందడానికి సహాయపడుతాయి. కాలెండులా ఫ్లవర్స్ ను మెత్తగా పేస్ట్ చేసి దీన్ని చర్మానికి గ్రేట్ గా హెల్ఫ్ అవుతుంది . ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇది గ్లోయింగ్ స్కిన్ అందిస్తుంది.

చమోమెలీ:

చమోమెలీ:

ఇది నేచురల్ మాయిశ్చరైజర్ స్కిన్ ఎలిమెంట్స్ కలిగి ఉంటాయి. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉన్నాయి, ఇది స్కిన్ అలర్జీలను నివారిస్తుంది. డికాషన్ అప్లై చేయవచ్చు లేదా స్నానం చేసే నీటిలో మిక్స్ చేసుకోవచ్చు. ఇది డ్రై స్కిన్ నివారించే సాప్ట్ గా మార్చుతుంది.

బొప్పాయి:

బొప్పాయి:

బొప్పాయిలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంది, ఇది స్కిన్ ప్రొటక్టర్. ఇది ఎక్సెసివ్ డ్రైనెస్ ను నివారిస్తుంది. పచ్చిబొప్పాయిని మెత్తగా చేసి ముఖానికి స్ర్కబ్ చేయాలి. దీన్ని చర్మాన్ని అప్లై చేసి మసాజ్ చేయాలి. దీన్ని రెగ్యులర్ గా అప్లై చేసినా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

అలొవెర:

అలొవెర:

అన్ని రకాల చర్మం మరియు హెయిర్ సమస్యలను నివారిస్తుంది. ఇందులో మాయిశ్చరైజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి, డ్రై స్కిన్ ను త్వరగా ఎఫెక్టివ్ గా నివారిస్తుంది. కలబంద ను ఆయిట్మెంట్స్ మరియు జెల్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు . ఇవి మార్కెట్లో ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. ఈ జెల్ ను ముఖానికి అప్లై చేయాలి.

 బనానా మరియు హని:

బనానా మరియు హని:

డ్రై స్కిన్ నివారించడానికి అరటి మరియు తేనె మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇది డ్రై స్కిన్ నివారించి స్మూత్ గా మారుస్తుంది. ఇలా కొన్ని వారాలు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

బార్లీ:

బార్లీ:

బార్లీపౌడర్ లో పసుపు మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. దీన్ని స్ర్కబ్ చేయడం వల్ల ఎక్స్ఫోయేట్ గా చేస్తుంది. స్క్రబ్ చేసి ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. డ్రైస్కిన్ తొలగిపోయి, స్కిన్ స్మూత్ గా తయారవుతుంది.

గందం:

గందం:

గందం పేస్ట్ ఆయిల్ నేచర్ కలిగి ఉంటుంది, . ఇది చర్మానికి అప్లై చేసినప్పుడు డ్రై స్కిన్ తొలగిపోతుంది , రోజ్ వాటర్ మిక్స్ చేయడం వల్ల స్కిన్ కాంతివంతంగా మెరుస్తుంటుంది . డెడ్ స్కిన్ సెల్స్ తొలగిస్తుంది . ఫ్రెష్ గ్లోను అందిస్తుంది.

Story first published: Monday, June 27, 2016, 11:07 [IST]
Desktop Bottom Promotion