Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
యాపిల్ సైడర్ వెనిగర్ తో పొందే అమేజింగ్ బ్యూటీ బెన్ఫిట్స్..!!
యాపిల్ సైడర్ వెనిగర్ యాపిల్స్ తో చేస్తారు. యాపిల్ రసం తీసి.. తర్వాత అది పొంగువచ్చేలా చేసి.. వెనిగర్ తయారు చేస్తారు. ఇందులో కొన్ని బ్యాక్టీరియాలను కలుపుతారు. ఆల్కహాల్ ని ఉపయోగిస్తారు.
యాపిల్ సైడర్ వెనిగర్ ను.. ఆహారం, సలాడ్స్, ఫుడ్ డ్రెస్సింగ్ కోసం రకరకాలుగా ఉపయోగిస్తారు. కానీ ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. క్యాన్సర్ రిస్క్ తగ్గిస్తుంది. డయాబెటిస్ ని నివారిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరిచి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
ఒక టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ ను నీటిలో కలిపి ప్రతిరోజూ తీసుకోవడం వల్ల.. అద్భుతమైన ప్రయోజనాలతో పాటు, తేలికగా బరువు తగ్గవచ్చు. అలాగే యాపిల్ సైడర్ వెనిగర్ అనేక బ్యూటి బెన్ఫిట్స్ కూడా అందిస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ పంగల్, యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి.

ముందుగానే వచ్చే వయసు ఛాయలు
వెనిగర్ లో ఎక్కువ మొత్తంలో సల్ఫర్ ఉంటుంది. ఇది.. ముడతలు, మచ్చలతో పోరాడుతుంది. ముఖం మొత్తం కాటన్ బాల్ ఉపయోగించి.. రాత్రి పడుకోవడానికి ముందు వెనిగర్ అప్లై చేయాలి. ఒకవేళ మీది సున్నితమైన చర్మం అయితే.. కొన్ని నీళ్లు మిక్స్ చేయడం మంచిది.

యాక్నె
యాపిల్ సైడర్ వెనిగర్ ని డైరెక్ట్ గా స్పాట్స్, మొటిమలపై అప్లై చేయడం వల్ల.. ఇన్ల్ఫమేషన్ తగ్గుతుంది. బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. కాబట్టి.. వెనిగర్ ఉపయోగిస్తే.. తేలికగా మొటిమలు నివారించవచ్చు.

సన్ బర్న్
యాపిల్ సైడర్ వెనిగర్ ఎండకు కమిలిన చర్మాన్ని నివారిస్తుంది. ఇన్ల్ఫమేషన్ ని తగ్గిస్తుంది. దీనికోసం నీటిలో కలిపిన వెనిగర్ ను ఉపయోగించవచ్చు.

టోనర్
వెనిగర్ న్యాచరల్ ఆస్ట్రిజెంట్ లా పనిచేస్తుంది. పీహెచ్ బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే చర్మ రంధ్రాలను టైట్ గా మారుస్తుంది.

పాదాల పగుళ్లకు
యాపిల్ సైడర్ వెనిగర్ లో పాదాలు నానబెట్టడం వల్ల.. పాదాల పగుళ్లను ఎఫెక్టివ్ గా నివారించవచ్చు. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు.. బ్యాక్టీరియాకి కారణమయ్యే మురికిని తొలగిస్తుంది.

చుండ్రు నివారించడానికి
చుండ్రు అనేది.. అత్యంత చిరాకు కలిగించే సమస్య. కాబట్టి కొద్దిగా నీటిలో వెనిగర్ మిక్స్ చేసి.. స్కాల్ప్ కి పట్టించాలి. అరగంట తర్వాత.. షాంపూ చేసి .. శుభ్రం చేసుకోవాలి.

షైనీ హెయిర్ పొందడానికి
జుట్టుని శుభ్రం చేసుకున్న తర్వాత చివరగా.. నీటిలో కలిపిన వెనిగర్ ను ఉపయోగించి.. జుట్టుని శుభ్రం చేయాలి. ఇలా చేస్తూ ఉంటే.. జుట్టు సాఫ్ట్ అండ్ షైనీగా మారుతుంది. ఇది.. గ్రేట్ కండిషనర్ గా ఉపయోగపడుతుంది.



Click it and Unblock the Notifications