Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
బ్లాక్ హెడ్స్ ను ఎఫెక్టివ్ గా తొలగించే హోం రెమెడీస్...!
బ్లాక్ హెడ్స్ ఇంచుమించు మొటిమలు, మచ్చలకు చాలా దగ్గర సంబంధం కలిగి ఉండేటివే బ్లాక్ హెడ్స్. ముఖ్యంగా బ్లాక్ హెడ్స్ ముక్కు, గెడ్డం మీద ఎక్కువగా వస్తుంటారు. బ్లాక్ హెడ్స్ ఎందుకొస్తాయో తెలియదు . ఎక్కువగా ముక్కు మీద కనబడుతుంటాయి. బ్లాక్ హెడ్స్ నివారించుకోవడానికి కొన్ని హోం రెమెడీస్ ఉన్నాయి. వీటిని ఉపయోగిస్తే చాలా ఎఫెక్టివ్ గా తొలగిపోతాయి.
బ్లాక్ హెడ్స్ స్కిన్ క్రింది బాగంలో ఉంటుంది. స్కిన్ క్రింది బాగంలో ఆక్సిడైజ్డ్ మెలనిన్ కారణంగా బ్లాక్ హెడ్స్ చర్మం మీద ఎక్కువగా కనబడుతాయి. స్కిన్ పిగ్మెంటేషన్ కు కారణమవుతాయి. ముక్కు మీద బ్లాక్ కలర్ లో అసహ్యంగా కనబడుతాయి.
బ్లాక్ హెడ్స్ చర్మంలో సెబమ్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల ఏర్పడుతాయి . సెబమ్ అనేది చర్మాన్ని హైడ్రేషన్ లో ఉంచడానికి చాలా అవసరం అవుతుంది. అయితే సెబమ్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల మొటిమలు లేదా బ్లాక్ హెడ్స్ కు కారణమవుతుంది.
శరీరంలో జరిగే హార్మోనుల మార్పుల వల్ల సెబమ్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. బ్లాక్ హెడ్స్ ఎలాంటి నొప్పిని కానీ, లేదా ఇతర బాధకరమైన లక్షణాలను కలిగి ఉండదు . మొటిమలు, మచ్చలు వలే బాధించదు . అయితే బ్లాక్ కలర్ లో చిన్న చిన్న మొటిమలకు చర్మం మీద కనబడుతూ అసహ్య పరుస్తుంది. అలాగని వీటిని గిల్లడం, ప్లక్ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు . అలా చేయడం వల్ల పర్మనెంట్ స్కార్స్ ను ఏర్పడుతుంది. సమస్యను మరింత ఎక్కువ చేస్తుంది .
కాబట్టి, బ్లాక్ హెడ్స్ నివారించుకోవడానికి కొన్ని నేచురల్ హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా ఉన్నాయి..

ఫుల్లర్స్ ఎర్త్ :
ఫుల్లర్స్ ఎర్త్ లేదా ముల్తాని మట్టి, వంటివి పురాతన కాలం నుండి వివిధ రకాల ఫేస్ ప్యాక్ లలో ఉపయోగిస్తున్నారు . ఇది ముఖంలో ఎక్సెస్ ఆయిల్ ను నివారిస్తుంది. ఫుల్లర్స్ ఎర్త్ కు కొద్దిగా రోజ్ వాటర్ మిక్స్ చేసి, ముక్కు మీద అప్లై చేయాలి. డ్రై అయ్యే వరకూ ఉండి, తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

బేకింగ్ సోడ:
మొటిమలు మరియు మచ్చలను నివారించడంలో బేకింగ్ సోడా ఫర్ఫెక్ట్ హోం రెమెడీ. ఇది ముఖంలో ఎక్సెసివ్ ఆయిల్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. బేకింగ్ సోడాలో కొద్దిగా వాటర్ మిక్స్ చేసి, ముక్కు మీద అప్లై చేయాలి. డ్రై అయ్యే వరకూ స్ర్కబ్ చేయాలి. తర్వాత కడిగేసుకోవాలి. బ్లాక్ హెడ్స్ ను తొలగించడంలో ఇది బెస్ట్ హోం రెమెడీ.

ఎగ్ వైట్ :
ఎగ్ వైట్ బంకగా ఉంటుంది. దీన్ని చర్మానికి అప్లై చేసిన తర్వాత, డ్రై అయిన తర్వాత మాస్క్ ను తొలగించడం వల్ల బ్లాక్ హెడ్స్ మాస్క్ తో పాటు ఊడి వచ్చేస్తాయి. ఈ చిట్కాను మనం ఇంట్లోనే స్వయంగా తయారుచేసుకోవచ్చు !

గ్రీన్ టీ :
మనం వాడేసిన టీ బ్యాగ్స్ ను తీసుకుని, కట్ చేసి, అందులో పదార్థంను తీసుకుని ముక్కు మీద అప్లై చేసి మర్ధన చేయాలి. మిగిలిన టీ ఆకులు మరియు టీలోని యాంటీ ఆక్సిడెంట్స్ బ్లాక్ హెడ్స్ ను తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

దాల్చిన చెక్క :
దాల్చిన చెక్కలో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. దాల్చిన చెక్క పొడిలో కొద్దిగా తేనె మిక్స్ చేసి ప్రతి రోజూ దీన్ని ఉపయోగించాలి. ఈ స్ర్కబ్ ను బ్లాక్ హెడ్స్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. !

తేనె :
తేనె నేచురల్ పదార్థం . ఇంకా ఇది అద్భుతమైన ఎక్సఫ్లోయేటర్ . తేనె డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది . చర్మానికి ఎలాంటి హాని కలిగించకుండా డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. అలాగే బ్లాక్ హెడ్స్ ను కూడా తొలగించేస్తుంది.



Click it and Unblock the Notifications