Latest Updates
-
డేటింగ్ యాప్‌లో పరిచయం.. కేఫ్‌లో దిమ్మతిరిగే బిల్లు! ఈ కొత్త మోసం గురించి తెలుసా? -
బీహారీల బలం ఇదే..వహ్వా అనిపించే తీసి భాత్..ఎలా చేసుకోవాలంటే.. -
లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారా? జైలు శిక్ష పడే ప్రమాదం ఉంది, అసలు నిజాలు ఇవే! -
కర్ణాటక స్టైల్ దోసకాయ మజ్జిగ పులుసు..10 నిమిషాల్లోనే కడుపు చల్లదనాన్నిచ్చే టేస్టీ రెసిపి -
సూర్యాపేటలో పట్టపగలే దారుణం… భార్యను చంపిన భర్త! అసలు కారణం తెలిస్తే షాక్ అవుతారు -
వేప ఆకుల నీటితో స్నానం చేస్తే జరిగే అద్భుతాలు ఏంటో తెలుసా? -
మైదా పడదు, టేస్ట్ తగ్గదు.. ఇంట్లోనే ఈజీగా హై ప్రొటీన్ పనీర్ మఖానీ పిజ్జా ఎలా చేసుకోవాలంటే.. -
తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారుతోంది: భారీ వర్షాలు, ఈదురు గాలుల నుంచి ఇలా రక్షించుకోండి! -
మే 7: ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతోంది..అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
బిర్యానీ లవర్స్ తస్మాత్ జాగ్రత్త..ఈ పొరపాట్లు చేస్తే ప్రాణాలకే ముప్పు!
40 లలో అమేజింగ్ లుక్ పొందే.. ఎఫెక్టివ్ అండ్ సింపుల్ ఐడియాస్..!
ఫార్టీ అంటే.. ఫిట్ అండ్ ఫ్యాబ్యులస్ అనేది సామెత. అయితే చాలామంది నలభైలోకి అడుగుపెడుతున్నామంటే.. కాస్త ఆందోళన మొదలవుతుంది. ఎందుకంటే.. చర్మంపై వయసు ఛాయలు మొదలై.. అసహ్యంగా కనిపిస్తారనే టెన్షన్ ఉంటుంది.
ఏజింగ్ అనేది ఎవరిచేతుల్లో లేని విషయం. ఏ ఒక్కరూ వయసు పెరగకుండా..జీవితం గడవదు. కానీ వయసు పెరిగినా.. ఎంత వీలైతే.. అన్ని ఏళ్లు వయసు ఛాయలు కనిపించకుండా మెయింటెయిన్ చేయాలని ప్రతి ఒక్కరూ ఆరాటపడతారు.
మనం పెద్దవాళ్లు అయ్యే కొద్దీ.. ముఖ్యంగా 35 ఏళ్లు దాటాయంటే.. మన కణాలకు వయసు పెరుగుతుంది. రెన్యువల్ ప్రాసెస్ స్లోగా మారుతుంది. అప్పుడు చర్మం, శరీరం వయసు పెరుగుతున్న లక్షణాలను చూపిస్తుంది. అయితే ప్రస్తుత రోజుల్లో.. యంగ్ అండ్ యూత్ ఫుల్ లుక్ పొందడానికి అనేక కాస్మొటిక్ సర్జరీలు అందుబాటులో ఉన్నాయి.
అయితే చాలామంది ఇలాంటి ఖర్చుతో కూడిన ట్రీట్మెంట్స్ కోసం వెళ్లరు. అలాగే వీటివల్ల సైడ్ ఎఫెక్ట్ వస్తాయనే ఆందోళన ఉంది. అందుకే.. ఇటీవల అందరూ.. న్యాచురల్ రెమిడీస్ ద్వారా వయసు ఛాయలు కనిపించకుండా.. యూత్ ఫుల్ కాంప్లెక్షన్ పొందడానికి ట్రై చేస్తున్నారు. అలాగే.. వీటిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.
మరి 40లలో పాటించాల్సిన అలాంటి బెస్ట్ హోం రెమిడీస్ ఏంటో చూద్దాం..

రెగ్యులర్ ఎక్స్ ఫోలియేషన్
ఎక్స్ ఫోలియేషన్ అనేది యూత్ ఫుల్ కాంప్లెక్షన్ కి చాలా కీలకం. మన వయసు పెరిగేకొద్దీ.. చర్మంపై డెడ్ సెల్స్ పేరుకుపోతాయి. ఇవి చర్మాన్ని డ్రైగా, రఫ్ గా మారుస్తాయి. కాబట్టి.. మంచి ఫేషియల్ స్క్రబ్ తీసుకోవడం వల్ల.. మంచి ఫలితం ఉంటుంది.

యాంటీ ఏజింగ్ క్రీమ్స్
లోషన్స్, క్రీమ్స్ ని ముఖ్యంగా.. యాంటీ ఏజింగ్ కోసం ఉపయోగించాలి. ఇలాంటి క్రీములు, లోషన్స్ చర్మంపై కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. ముడతలు, ఫైన్ లైన్స్ ని తొలగిస్తాయి.

రెగ్యులర్ మసాజ్
రెగ్యులర్ గా మసాజ్ చేయాలి. ముఖ్యంగా కళ్ల చుట్టూ.. ప్రతిరోజూ రాత్రి పూట మసాజ్ చేయడం వల్ల.. ఏజింగ్ అనేది మీకు దూరంగా ఉంటుంది.

జుట్టుకి డై
జుట్టుకి డై వేయడం మరచిపోకూడదు. తెల్లజుట్టు.. మీ వయసు 40 అని ఈజీగా చెప్పేస్తుంది. అలాగే మిమ్మల్ని మరింత వయసు పెరిగినట్టు కనపడేలా చేస్తుంది.

హైడ్రేటెడ్
ఎంత వీలైతే.. అన్ని నీళ్లు తాగేలా జాగ్రత్త పడండి. గ్రీన్ టీ ని డైలీ డైట్ లో కంపల్సరీ చేర్చుకోవాలి. గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్.. చర్మాన్ని యంగ్ గా, నీళ్లు చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి.

మేకప్
కొన్ని మేకప్ టిప్స్ ఫాలో అవడం నేర్చుకోవాలి. ఫైన్ లైన్స్, ఏజ్ స్పాట్స్ వంటివి కనపడకుండా జాగ్రత్త పడాలి.

వ్యాయామం
ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. ఎక్సర్ సైజ్ వల్ల చర్మం సాగకుండా.. స్కిన్ టోన్, బాడీ చాలా ఫిట్ అండ్ ఫెయిర్ గా ఉంటుంది. వయసు ఛాయలు కనిపించకుండా ఉంటారు.



Click it and Unblock the Notifications