Latest Updates
-
గుడ్డు లేకుండా బేకరీ స్టైల్ ఫ్రూట్ కేక్... ఇంట్లోనే ఇంత ఈజీగా చేయొచ్చని మీకు తెలుసా? -
వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల భయం.. ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఉండాల్సిన హెల్త్ కిట్స్ ఇవే.! -
ఫ్యాటీ లివర్ ను ఇట్టే కరిగించే 3 అద్భుతమైన డ్రింక్స్.. హార్వర్డ్ డాక్టర్ సలహా! -
పెళ్లి తర్వాత జంటలకి ఎదురయ్యే సవాళ్లు.. ఎదుర్కొంటే ఆదర్శ దాంపత్యమే.! -
నిజమైన ప్రేమనా ? లేక ఎమోషనల్ అటాచ్మెంటా? ఈ ఒక్క ప్రశ్నతో తేలిపోతుంది! -
కేలరీలు తక్కువ, పోషకాలు పుష్కలం.. సలాడ్లో తప్పనిసరిగా ఉండే బ్రోకలీతో హెల్తీ వెరైటీలు.! -
ఒక్క ముక్కతో ఆగరు,అద్భుతం అంటే ఇదేనేమో..పచ్చిమిర్చి కోడివేపుడు చేసుకోండిలా -
హై బీపీ కంటే లో బీపీనే డేంజర్? ఇంట్లోనే రక్తపోటును నార్మల్ చేసే 5 హోమ్ రెమెడీస్! -
ఆఫీసు కుర్చీలతో ఆరోగ్య సమస్యలు.. గుండెతో పాటు వీటికి ఎనలేని రిస్క్.! -
ఇంట్లో కూరగాయలు లేవా? 2 ఉల్లిపాయలతో సూపర్ టేస్టీ పరాఠాలు..బ్రేక్ ఫాస్ట్, లంచ్ బాక్సుల్లోకి పర్ఫెక్ట్
వారం రోజుల్లో సాఫ్ట్ స్కిన్ పొందే అమేజింగ్ ఐడియా..
వర్షాకాలం వచ్చేసింది. డ్రై స్కిన్ ఉండేవాళ్లకు టెన్షన్ మొదలవుతుంది. చలికాలంలో సాధారణంగా చర్మ సమస్యలు ఫేస్ చేయడం చాలా కష్టం. అందులోనూ డ్రై స్కిన్ ఉండేవాళ్ల పరిస్థితి చెప్పనక్కరలేదు. చాలా చిరాగ్గా ఉంటుంది. పొడిబారడం, దురద వంటి సమస్యలు ఎక్కువ అవుతాయి.
చాలామంది డ్రై స్కిన్ అనేది సీజన్ తో సంబంధం లేకుండా వేధిస్తుంటుంది. కేవలం వర్షాకాలంలోనే కాకుండా.. అన్ని సీజన్స్ లో సమస్యలు తీసుకొస్తుంది. డ్రై స్కిన్ ఉంటే.. దురద, ఇన్ల్ఫమేషన్, ఇరిటేషన్ వంటివి సాధారణంగా కనిపించే లక్షణాలు.

డ్రై స్కిన్ సమస్య మరీ ఎక్కువైనప్పుడు ఎగ్జిమా, సోరియాసిస్ వంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. పొడి చర్మాన్ని సరైన సమయంలో ట్రీట్ చేయకపోతే.. చర్మం నిర్జీవంగా, అనారోగ్యంగా కనిపిస్తుంది. ముఖంపై ప్యాచెస్ ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. కాబట్టి డ్రై స్కిన్ డీల్ చేయడానికి సింపుల్ టిప్ మీ చేతుల్లో ఉంది.
ముఖ్యంగా డ్రై స్కిన్ తో పోరాడటానికి డైట్ తో మొదలుపెట్టాలి. ఎక్కువ పండ్లు, వెజిటబుల్స్, ఫిష్, మాంసం తీసుకోవడం వల్ల.. చర్మ కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. పోషణ అందుతాయి. అలాగే శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచాలి. దీనికోసం.. ఎక్కువ నీళ్లు తాగాలి. దీంతో పాటు.. ఒక ప్యాక్ ట్రై చేయండి. ఇది మీ చర్మాన్ని సాఫ్ట్ గా, మారుస్తుంది.

కావాల్సిన పదార్థాలు
కొబ్బరినూనె 1 టేబుల్ స్పూన్
రోజ్ వాటర్ 1 టీస్పూన్
పెరుగు 1 టేబుల్ స్పూన్
కొబ్బరినూనె, రోజ్ వాటర్, పెరుగు కాంబినేషన్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. చర్మానికి న్యాచురల్ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. రెగ్యులర్ గా ఈ ప్యాక్ ట్రై చేయడం వల్ల వారంరోజుల్లో చర్మాన్ని సాఫ్ట్ గా మార్చేస్తుంది. ఈ ప్యాక్ చర్మ కణాలను హైడ్రేట్ చేసి, మాయిశ్చరైజర్ అందించి.. చర్మంపై డ్రై, రఫ్ నెస్ ని తగ్గిస్తుంది. ఈ స్కిన్ ప్యాక్ ఎఫెక్టివ్ గా పీహెచ్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది.

చర్మాన్ని సాఫ్ట్ గా మార్చే ఫేస్ ప్యాక్ తయారు చేసే విధానం
పైన చెప్పిన పదార్థాలన్నింటినీ ఒక గిన్నెలో వేసుకోవాలి.
అన్నింటినీ బాగా మిక్స్ం చేసి.. పేస్ట్ తయారు చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని చర్మానికి పట్టించాలి.
10 నుంచి 15 నిమిషాలు అలాగే వదిలేయాలి.
తర్వాత మైల్డ్ సోప్ ఉపయోగించి, గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
అంతే ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల వారంరోజుల్లో మీ చర్మం సాఫ్ట్ గా మారిపోతుంది.



Click it and Unblock the Notifications