Latest Updates
-
ఆలూ పరోటాకి మించిన రుచితో ఉల్లి పరోటా.. బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ డైట్ ఫుడ్ ! -
భోజనం చేసిన వెంటనే కడుపు నొప్పిగా ఉంటుందా.?.. ఈ వ్యాధులకు సంకేతం కావచ్చు.! -
ఆషాఢం బల్కంపేటలో వైభవం.. నేడు ఘనంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం.. ‘జలదుర్గ’ విశేషాలివే.! -
వక్ర గతిలోకి శని గ్రహం.. ఈ నెల 28 వరకు ఈ 3 రాశుల వారికి కష్టాలు తప్పవు.! -
అద్భుతమైన విందు భోజనం కావాలా? అయితే ఈ కోకనట్ మిల్క్ మటన్ పులావ్ ట్రై చేయాల్సిందే -
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల -
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.! -
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.? -
తెలంగాణలో ఘనంగా బోనాల వేడుకలు.. ఆధ్యాత్మిక రహస్యం, చరిత్ర ఇదే.! -
మదురై స్పెషల్ మటన్ దోశ.. ఇలా చేస్తే జన్మలో ఆ రుచిని మర్చిపోలేరు!
కాస్మొటిక్స్ అవసరం లేకుండా.. అందంగా కనిపించడం ఎలా ?
మీరు చాలా సర్ ప్రైజ్ అవుతారు. కొన్ని చేయలేం అనుకుంటాం. కానీ... అందంగా కనిపించడానికి కాస్మొటిక్సే అవసరం లేదు. ఎలాంటి కాస్మొటిక్స్ మీ మేకప్ కిట్ లో లేకపోయినా.. అందంగా మెరిసిపోవచ్చు. ప్రతి మహిళ అందంగా పుడుతుంది. తన ఆత్మస్తైర్యం, పర్సనాలిటీ, మనస్థత్వం ఇవన్నీ ఆడవాళ్లకు అత్యంత అందమైన ఆస్తులు.
ముఖ సౌందర్యం కేవలం.. ఆకర్షణ మాత్రమే. కానీ అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకే రకరకాల కాస్మొటిక్స్ ఉపయోగిస్తూ ఉంటారు. కానీ.. మేకప్ తో పని లేకుండా.. ఎల్లప్పుడూ అందంగా కనిపించవచ్చు. చాలా మంది మేకప్ కాకపోయినా.. కనీసం కాజల్, లిప్ స్టిక్ అయినా వాడతారు. ఇంకా చాలామంది మేకప్ లేకుండా బయటకు వెళ్లడం కష్టమని భావిస్తారు.
ఫౌండేషన్, ఫేస్ పౌడర్ అందంగా కనిపించడానికి సహాయపడుతుందని భావిస్తారు. నిజమే మేకప్ ప్రొడక్ట్స్ స్మూత్ లుక్ అందిస్తాయి. కానీ.. చర్మాన్ని సంరక్షించుకోవడం కూడా చాలా అవసరం. కాబట్టి మేకప్ తో పనిలేకుండా.. అందంగా ఎలా కనిపించాలో ఇప్పుడు చూద్దాం.

డైట్
కాస్మొటిక్స్ బాహ్య సౌందర్యాన్నిస్తాయి. మీ అందాన్ని లోపలి నుంచి మెరుగు పరుచుకోవాలంటే.. బ్యాలెన్డ్స్ డైట్ కంపల్సరీ ఫాలో అవ్వాలి. ఉదాహరణకు ఆయిలీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మొటిమలు, యాక్నే సమస్య ఎదురవుతుంది. కాబట్టి.. డైట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

హైడ్రేట్ గా ఉండటం
మేకప్ లేకుండా అందంగా కనిపించడానికి ఇదో అద్భుతమైన పరిష్కారం. రోజుకి 6 నుంచి 8 గ్లాసుల నీళ్లు తాగడం వల్ల శరీరంలోని మలినాలు బయటకు పోయి.. చర్మం బ్యూటీఫుల్ గా మారుతుంది. లోపలి నుంచి మీ చర్మం గ్లోయింగ్ గా మారాలంటే.. ఎక్కువ నీళ్లు తాగాలి. ఫ్రూట్ జ్యూస్, స్మూతీలు తీసుకోవాలి.

ఎక్స్ ఫోలియేట్
చర్మం పైపొరకు కాస్మొటిక్స్ అప్లై చేయడం వల్ల అది డార్క్ గా, ప్యాచ్ లా కనిపిస్తుంది. కాబట్టి పింపుల్స్ కి, బ్లాక్ హెడ్స్ కి కారణమయ్యే డెడ్ సెల్స్, దుమ్ము తొలగించుకోవాలి. వాటన్నింటినీ తొలగించుకోవడానికి ఇంట్లో తయారు చేసుకునే స్క్రబ్స్ లేదా, హెర్బల్ ప్రొడక్ట్స్ ఉపయోగించాలి. నిమ్మ, పంచదార, ఓట్స్ కలిపి స్క్రబ్ చేసుకోవడం వల్ల చర్మం ఎక్స్ ఫోలియేట్ అవుతుంది.

టోనర్
కాస్మొటిక్స్ లేకుండా.. అందంగా కనిపించాలి అనుకున్నప్పుడు టోనర్ ట్రై చేయాలి. ఎక్స్ ఫోలియేషన్ అయిన తర్వాత చర్మ రంధ్రాలు పెద్దగా మారి దుమ్ము చేరడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి టోనర్ అప్లై చేసి.. చర్మం స్మూత్ గా, టైట్ గా మారుతుంది. నిమ్మరసం, రోజ్ వాటర్ కలిపి టోనర్ లా ఉపయోగించవచ్చు.

మాయిశ్చరైజర్
ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా.. మాయిశ్చరైజర్ ఉపయోగించాలి. చలికాలంలో మాయిశ్చరైజర్, ఎండాకాలంలో లైట్ మాయిశ్చరైజర్ వాడాలి. మీ చర్మానికి సరిపడే మాయిశ్చరైజర్ తీసుకోవాలి. డ్రైన్ స్కిన్ ముడతలు రావడానికి కారణమవుతుంది. మాయిశ్చరైజర్ ఉపయోగించడం వల్ల.. చర్మం సాఫ్ట్ గా మారుతుంది.

ఫేస్ వాష్
మేకప్ లేకుండా అందంగా కనిపించడానికి ఇదో చక్కటి పరిష్కారం. చర్మంపై ఆయిల్, డర్ట్ తొలగించడానికి డైలీ ఫేస్ వాష్ ఉపయోగించాలి. రోజుకి రెండుసార్లు ఫేస్ వాష్ ఉపయోగించాలని బ్యూటీషియన్స్ సూచిస్తారు. ఉదయం ఒకసారి, రాత్రి పడుకోవడానికి ముందు ఒకసారి ఉపయోగించాలి.

సన్ స్క్రీన్
ఫౌండేషన్ మరిచిపోయినా.. సన్ స్క్రీన్ లోషన్ మరిచిపోకూడదు. ఇది కేవలం యూవీ కిరణాల నుంచి మాత్రమే కాదు.. సన్ బర్న్ నుంచి కూడా కాపాడుతుంది.

శుభ్రంగా జుట్టు
డర్టీ, ఆయిలీ హెయిర్ ఉందంటే.. ముఖం ఫ్రెష్ గా, క్లీన్ గా కనిపించదు. హెయిర్, నుదురుని షాంపూ చేసుకుని శుభ్రంగా ఉంచుకోవాలి. వారానికి రెండు సార్లు లేదా మూడు సార్లు షాంపూ చేసుకోవడం వల్ల.. జుట్టు శుభ్రంగా, అందంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications