For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

షేవింగ్ తర్వాత చర్మాన్ని స్మూత్ గా మార్చే సూపర్ సొల్యూషన్స్

By Swathi
|

ఆడవాళ్ల అందానికి చిహ్నాలు చాలానే ఉంటాయి. కానీ మగవాళ్ల అందాన్ని రెట్టింపు చేసేది మాత్రం షేవింగ్ స్టైల్. షేవింగ్ స్టైల్ డిఫరెంట్ గా ఉన్నా.. షేవింగ్ పూర్తీగా చేసుకున్నా.. షేవింగ్ చేసుకోకుండా పెంచుకున్నా.. ఆ లుక్కే సపరేట్. అందుకు అబ్బాయిలు షేవింగ్ విషయంలో చాలా కేర్ తీసుకుంటారు.. రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు.

అయితే షేవింగ్ చేసుకుని స్మార్ట్ గా ఆఫీలకు వెళ్లే అబ్బాయిలకు సూపర్ సొల్యూషన్స్ ఉన్నాయి. షేవింగ్ చేసుకున్న తర్వాత చర్మం గరుకుగా ఉండకుండా.. స్మూత్ గా ఉండటానికి కొన్ని సింపుల్ రెమిడీస్ మీ చేతుల్లో ఉన్నాయి. షేవింగ్ చేసుకునే అబ్బాయిలకు ఇన్నోసెంట్ లుక్ వస్తుంది. అయితే రేజర్ తో షేవ్ చేసుకున్న కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. గాయాలయినట్టు కనిపించడం, చిన్న చిన్న దద్దుర్లు, హార్డ్ గా స్కిన్ మారడం వంటివి కనిపిస్తూ ఉంటాయి.

షేవింగ్ తర్వాత రెడ్ నెస్, రాషెష్ కనిపించకుండా ఉండాలంటే.. కాస్త కేర్ తీసుకోవాలి. ఈ సమస్య అబ్బాయిలది మాత్రమే కాదు. అమ్మాయిలు కూడా అన్ వాంటెడ్ హెయిర్ రిమూవ్ చేయడానికి రేజర్ ఉపయోగిస్తూ ఉంటారు. చర్మం సెన్సిటివ్ గా ఉండటం వల్ల.. రేజర్ తో షేవ్ చేసినప్పుడు కాస్త ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి షేవింగ్ తర్వాత చర్మాన్ని స్మూత్ గా మార్చే సింపుల్ హోం రెమిడీస్ మీ కోసం..

ఐస్ క్యూబ్

ఐస్ క్యూబ్

షేవింగ్ తర్వాత ఏర్పడే రెడ్ నెస్, దురదను తగ్గించడంలో ఐస్ క్యూబ్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. షేవింగ్ తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. లేదా ఐస్ క్యూబ్ ని టవల్ లో చుట్టి.. షేవింగ్ తర్వాత పెట్టుకున్నా చర్మం స్మూత్ గా మారుతుంది.

వైట్ టీ

వైట్ టీ

వైట్ టీలో ట్యానిక్ యాసిడ్ ఉండటం వల్ల ఇన్ల్ఫమేషన్ తగ్గించి.. చర్మాన్ని స్మూత్ గా మారుస్తుంది. చల్లటి నీటిలో టీ బ్యాగ్ ని నానబెట్టి.. దాన్ని షేవింగ్ తర్వాత చర్మంపై అద్దాలి. ఇది వెంటనే వాపుని, రెడ్ నెస్ ని తగ్గిస్తుంది.

యాపిల్ సైడర్ వెనిగర్

యాపిల్ సైడర్ వెనిగర్

షేవింగ్ తర్వాత చర్మాన్ని స్మూత్ గా మార్చే వాటిలో యాపిల్ సైడర్ వెనిగర్ ముఖ్యమైనది. ఇందులో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది దురదను తగ్గించి స్మూత్ గా మారుస్తుంది. కాబట్టి షేవింగ్ తర్వాత వెనిగర్ లో కాటన్ అద్ది రాసుకోవాలి.

యాస్పిరిన్

యాస్పిరిన్

మీది చాలా సున్నితమైన చర్మం అయితే.. ఈ రెమిడీ ఉపయోగించకండి. అలాంటి చర్మ తత్వం కాకపోతే.. కొన్ని యాస్పిరిన్ ట్యాబ్లెట్లను నీళ్లలో నానబెట్టి పేస్ట్ చేయాలి. ఇప్పుడు షేవింగ్ తర్వాత ఈ మిశ్రమాన్ని అప్లై చేసి 10 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే స్మూత్ స్కిన్ మీ సొంతం.

అలోవెరా

అలోవెరా

అలోవెరా జెల్ తీసి షేవింగ్ తర్వాత చర్మానికి అప్లై చేయాలి. రాసిన వెంటనే కూలింగ్ ఎఫెక్ట్ తో పాటు.. చర్మాన్ని స్మూత్ గా మార్చేస్తుంది.

లిప్ బామ్

లిప్ బామ్

లిప్ బామ్ లో డీస్ వ్యాక్స్ ఉంటుంది. రక్తస్రావాన్ని నివారిస్తుంది. కాబట్టి షేవింగ్ చేసుకున్న తర్వాత ఎక్కడైనా బ్లీడింగ్ కనిపిస్తూ ఉంటే.. లిప్ బామ్ అప్లై చేయండి.

తేనె

తేనె

చర్మాన్ని స్మూత్ గా మార్చడంలో తేనె న్యాచురల్ గా పనిచేస్తుంది. ఇది యాంటీ ఇన్ల్ఫమేషన్ గా పనిచేయడమే కాదు.. మాయిశ్చరైజర్ లా పనిచేస్తుంది.

English summary

Ways To Soothe Your Skin After Shaving

Ways To Soothe Your Skin After Shaving. Men look sexy if they experiment with their beard. Soft stubble can give you an innocent look, while a goatee can really make you look sexy.
Story first published:Monday, May 16, 2016, 10:46 [IST]
Desktop Bottom Promotion