Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
దాల్చిన చెక్కలో దాగున్న అమేజింగ్ బ్యూటీ సీక్రెట్స్..!!
మీకు దాల్చిన చెక్క కేవలం ఆహారాల్లో స్పైసీ నెస్ ని మాత్రమే కాదు.. చర్మ సౌందర్యానికి అమోఘమైన పదార్థం. ఇందులో ఉండే న్యాచురల్ క్వాలిటీస్.. చర్మ సౌందర్యానికి, చర్మ సమస్యల నివారణకు ఎఫెక్టివ్ గా ఉపయోగపడుతుంది. కొన్ని ఏషియన్ కంట్రీస్ లో.. చర్మ సమస్యలు నివారించడానికి దాల్చిన చెక్కను ఉపయోగిస్తాయి.
హానికారకమైన బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగించడం కంటే.. న్యాచురల్ గా పనిచేసే దాల్చిన చెక్కను ఉపయోగించడం చాలా ఉత్తమం. ఒకవేళ మీ చర్మంపై వయసు ఛాయలు కనిపిస్తూ ఉంటే.. దాల్చిన చెక్క దానికి చాలా మంచి పరిష్కారం.
దాల్చిన చెక్కలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, రకరకాల మినరల్స్, విటమిన్స్ ఏజింగ్ ప్రాసెస్ ని స్లోగా మారుస్తాయి. అలాగే చర్మం.. న్యాచురల్ గా, బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. అలాగే ఆయిలీ, కాంబినేషన్ స్కిన్ టైప్ కలిగిన వాళ్లకు.. దాల్చిన చెక్క పొడి.. కొన్ని క్షణాల్లోనే అద్భుతమైన ఫలితాన్నిస్తుంది. మరి దాల్చిన చెక్కను.. చర్మానికి ఎలా ఉపయోగించాలో చూద్దాం..

పైన్ లైన్స్
దాల్చిన చెక్క పొడికి, 2 టీస్పూన్ల ఆలివ్ ఆయిల్ లేదా పెట్రోలియం జెల్లీ కలిపి.. చర్మానికి పట్టించడం వల్ల.. ఫైన్ లైన్స్ నివారించవచ్చు.

స్కాల్ఫ్ కి పోషణ అందించడానికి
1 టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి, పావు టీ స్పూన్ గోరువెచ్చని ఆలివ్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ తేనె కలిపి.. స్కాల్ఫ్ కి పట్టించాలి. అరగంట తర్వాత.. మైల్డ్ షాంపూతో శుభ్రం చేసుకుంటే.. జుట్టుకి కావాల్సిన పోషణ అందుతుంది.

స్కిన్ ఇరిటేషన్
చర్మంపై వాపులు, దురద ఉంటే.. దాల్చిన చెక్క చక్కటి పరిష్కారం. 1 టీస్పూన్ దాల్చిన చెక్క పొడి, 1 టీస్పూన్ తేనె కలిపి.. చర్మానికి పట్టించడం వల్ల ఇరిటేషన్ నుంచి త్వరిత ఉపశమనం పొందవచ్చు.

గాయాలు మానడానికి
దాల్చిన చెక్కలో యాంటీ సెప్టిక్ గుణాలు ఉంటాయి. గాయాలు తగిలినప్పుడు చిటికెడు దాల్చిన చెక్క పొడిన గాయాలు, తెగిన గాయాలపై చల్లాలి. ఇది గాయంలో ఉన్న బ్యాక్టీరియాను నాశనం చేసి.. వేగంగా గాయాలు మానడానికి సహాయపడుతుంది.

స్కిన్ కాంప్లెక్షన్
కాంప్లెక్షన్ పెరగడానికి ఖరీదైన, హానికరమైన ఫెయిర్ నెస్ క్రీమ్స్ కి గుడ్ బై చెప్పండి. అరటిపండు గుజ్జు, పెరుగు, దాల్చిన చెక్క పొడి, నిమ్మరసం కలిపి మిశ్రమాన్ని చర్మానికి పట్టించి.. బాగా ఆరిన తర్వాత.. గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే.. అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. మీ స్కిన్ కాంప్లెక్షన్ ఊహించని విధంగా పెరుగుతుంది.

బాడీ స్క్రబ్
1 స్పూన్ దాల్చిన చెక్క పొడి, 2 కప్పుల గ్రౌండ్ కాఫీ, అరకప్పు సీసాల్ట్, 3 టీస్పూన్ల ఆల్మండ్ ఆయిల్ అన్నింటినీ బాగా మిక్స్ చేసి.. శరీరానికి స్క్రబ్ లా ఉపయోగిస్తే.. చాలా ఫ్రెష్ ఫీలింగ్ తో పాటు, ఎనర్జిటిక్ గా ఫీలవుతారు.

నిగారింపు పొందడానికి
1 టీస్పూన్ దాల్చిన చెక్క పొడి, 3 టీస్పూన్ల తేనె కలిపి మిశ్రమం తయారు చేసుకుని.. యాక్నె ఉన్న దగ్గర పట్్టించాలి. 20 నిమిషాలు ఆరిన తర్వాత.. గోరువెచ్చని నీటిత శుభ్రం చేసుకుంటే.. మొటిమలు, మచ్చలు తొలగిపోయి.. చర్మానికి కొత్త నిగారింపు వస్తుంది.



Click it and Unblock the Notifications