Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
చర్మానికి పెరుగు మరియు తేనె కాంబినేషన్ అందించే సౌందర్య రహస్యాలు..
సాధారణంగా అమ్మాయిలు ఎప్పుడూ అందంగా కనబడాలని కోరుకుంటారు. అందుకే ఎప్పుడూ అద్దంలో చూసుకుంటుంటారు. ఏమాత్రం కొద్దిగా తేడాగా అనిపిస్తే వెంటనే తగు జాగ్రత్తలు తీసుకోవాలని అలర్ట్ అవుతారు. అంతే కాదు, ప్రకాశించి మచ్చలేని అందమైన చర్మాన్ని పొందడానికి వివిధ రకాలుగా ప్రయత్నిస్తూ, మార్కెట్లో ఉండే అన్ని రకాల కెమికల్ బేస్డ్ స్కిన్ ప్రొడక్ట్స్ ను కొంటుంటారు.
అయితే మార్కెట్లో ఉండే కెమికల్ బ్యూటీప్రొడక్ట్స్ కంటే మన ఇంట్లో ఉండే నేచురల్ ప్రొడక్ట్స్ లోనే అద్బుతమైన మెడిసినల్ విలువన్నాయి. వీటిని ఉపయోగించడం వల్ల హెల్తీ అండ్ గ్లోయింగ్ స్కిన్ పొందవచ్చు.
మన కిచెన్ లో ఉండే నేచురల్ పదార్థాల్లో పసుపు, గందం, కొన్ని రకాల పండ్లు మరియు వెజిటేబుల్స్, పాలు, కొన్ని మసాలాలు మరియు నట్స్ మొదలగునవి అన్ని రకాల చర్మ సమస్యలను నివారించడంతో పాటు చర్మంలో మంచి గ్లోను తీసుకొస్తాయి. అలాంటే నేచురల్ బ్యూటీ ప్రొడక్ట్స్ లో పెరుగు మరియు తేనె అద్భుతమైనవి. ఈ రెండింటి మిశ్రమంతో వేసుకొనే ఫేస్ ప్యాక్ వల్ల రేడియంట్ స్కిన్ పొందవచ్చు.
రెండు టేబుల్ స్పూన్ల పెరుగులో ఒక టేబుల్ స్పూన్ తేనె మిక్స్ చేసి , పేస్ట్ లా చేసి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. సున్నితంగా మసాజ్ చేసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్ మాస్క్ ను రెగ్యులర్ గా వేసుకుంటుంటే మంచి ఫలితం ఉంటుంది.
మరి ఈ రెండింటి కాంబినేషన్ ఫేస్ ప్యాక్ వల్ల ఎలాంటి ప్రయోజనాలను పొందవచ్చో ఈ క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకుందాం....

స్కిన్ మాయిశ్చరైజర్:
పెరుగు మరియు తేనె ఒక నేచురల్ స్కిన్ హైడ్రేట్ ఏజెంట్ గా పనిచేస్తుంది . చర్మంలో ఇది నేచురల్ మాయిశ్చరైజర్ లెవల్స్ ను రీస్టోర్ చేస్తుంది . దాంతో చర్మం సాప్ట్ గా మరియు సపెల్ గా మారుతుంది.

స్కిన్ ఫెయిర్ గా మారుతుంది:
పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ లో వివిధ రకాల ఎంజైమ్స్ ట్రైగ్లిజరైడ్స్ వంటివి చర్మంలో మెలనిన్ ఉత్పత్తికి సహాయపడుతాయి. దాంతో స్కిన్ సెల్స్ కొత్తగా పుడుతాయి , చర్మం ఎప్పుడూ కొత్తగా ప్రకాశవంతంగా యవ్వనంగా కనబడుతుంది.

క్లియర్ స్కిన్ :
పెరుగు మరియు తేనె రెండు మిక్స్ చేయడం వల్ల ఇందులో ఉండే జింక్ ఇన్ఫ్లమేషన్ మరియు స్కిన్ రెడ్ నెస్ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. దాంతో స్కిన్ కంప్లెక్షన్ పెరగుతుంది.

మొటిమలను నివారిస్తుంది:
తేనె మరియు పెరుగు రెండింటి కాంబినేషన్ లో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉండటం వల్ల బ్యాక్టీరియ వల్ల ఏర్పడే మొటిమలను నివారిస్తుంది.

డార్క్ సర్కిల్స్ నివారిస్తుంది:
తేనె మరియు పెరుగు కాంబినేషన్ లో ఉండే జింక్ మరియు విటమిన్స్ కళ్ళ క్రిందనల్లని వలయాలను నివారించే చర్మానికి తగిన పోషణను అందిస్తుంది.

యాంటీఏజింగ్ గా పనిచేస్తుంది:
పెరుగు మరియు తేనె కాంబినేషన్ చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. దాంతో స్కిన్ ఎలాసిటి పెరుగుతుంది . దాంతో చర్మంలో ఏజింగ్ లక్షణాలు నివారించబడుతాయి.

సన్ బర్న్ నివారిస్తుంది:
ఈ రెండింటి మిశ్రమంలో సన్ బర్న్ నివారించే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉన్నాయి దాంతో చర్మం ఎర్రబడకుండా మరియు పిగ్మెంటేషన్ నివారించి యూత్ ఫుల్ గా కనబడేలా చేస్తుంది.



Click it and Unblock the Notifications