For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆల్మండ్ ఆయిల్ తో అన్ని చర్మసమస్యలకు గుడ్ బై..!

ఆల్మండ్ ఆయిల్ లో విటమిన్ ఈ ఉంటుంది. ఇది కొల్లాజెన్ లెవెల్ ని మెరుగుపరుస్తుంది. దీనివల్ల ఎలాస్టిసిటీ పెరుగుతుంది. చర్మం స్మూత్ గా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

By Swathi
|

మనం నిద్రలేచినప్పుడు మన చర్మం డ్రైగా, నిర్జీవంగా ఉంటుంది. మన చర్మం ఎక్కువ ఆయిల్ ని ఉత్పత్తి చేయడం వల్ల లేదా ఆయిల్ కోల్పోవడం వల్ల.. చర్మం ఇలా డ్రైగా లేదా నిర్జీవంగా కనిపిస్తుంది.

ఇలాంటి చర్మ సమస్యలకు ఆల్మండ్ ఆయిల్ పర్మనెంట్ గా సొల్యూషన్ ఇస్తుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, మరే ఇతర సమస్యలు రాకుండా.. అద్భుతమైన ఫలితాలు అందిస్తుంది ఆల్మండ్ ఆయిల్.

almond oil

ఆల్మండ్ ఆయిల్ లో విటమిన్ ఈ ఉంటుంది. ఇది కొల్లాజెన్ లెవెల్ ని మెరుగుపరుస్తుంది. దీనివల్ల ఎలాస్టిసిటీ పెరుగుతుంది. చర్మం స్మూత్ గా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అలాగే ఆల్మండ్ ఆయిల్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల.. చర్మాన్ని రిపేర్ చేసి.. ఉపశమనం కలిగిస్తాయి.

ఆల్మండ్ ఆయిల్ లో ఉండే మోనో శ్చాచురేటెడ్ ఫ్యాట్స్, పొటాషియం, ప్రొటీన్స్, జింక్, ఇతర మినరల్స్ ఫైన్ లైన్స్ ని తగ్గిస్తాయి. చర్మాన్ని డీప్ గా క్లెన్స్ చేస్తాయి. అలాగే.. ఏజింగ్ ప్రాసెస్ ని అడ్డుకుంటాయి. మరి ఈ ఆల్మండ్ ఆయిల్ తో.. చర్మానికి కలిగే అమేజింగ్ బెన్ఫిట్స్ ఏంటో చూద్దాం..

డార్క్ సర్కిల్

డార్క్ సర్కిల్

రాత్రిపడుకునే ముందు.. కొన్ని చుక్కల ఆల్మండ్ ఆయిల్ తీసుకున.. కళ్ల చుట్టూ మసాజ్ చేసుకోవాలి. ఇందులో ఉండే ఫ్యాటీ యాసిడ్స్.. కళ్ల చుట్టూ చర్మాన్ని లైట్ గా మారుస్తాయి. ముడతలు.. దూరమవుతాయి.

డ్రై స్కిన్

డ్రై స్కిన్

ఏదైనా ఫ్రెష్ క్రీమ్ ఒక టీస్పూన్ తీసుకోవాలి. అందులో కొన్ని చుక్కల ఆల్మండ్ ఆయిల్ మిక్స్ చేయాలి. దీన్ని చర్మంపై సున్నితంగా మసాజ్ చేయాలి. 30 నిమిషాల తర్వాత.. చల్లటినీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే.. డ్రై స్కిన్ నివారించవచ్చు.

ముడతలు నివారించడానికి

ముడతలు నివారించడానికి

ఒక గిన్నెలో గుడ్డులోని తెల్లసొన తీసుకోవాలి. 5 చుక్కల ఆల్మండ్ ఆయిల్ మిక్స్ చేయాలి. రెండింటినీ బాగా మిక్స్ చేసి.. ముఖానికి, మెడకు అప్లై చేయాలి. బాగా ఆరిన తర్వాత.. చల్లటినీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ హెర్బల్ మాస్క్.. వారానికి ఒకసారి రాసుకుంటే.. ముడతలు తగ్గిపోతాయి.

స్క్రబ్

స్క్రబ్

నాలుగైదు బాదాం గింజలు, 1 టేబుల్ స్పూన్ ఓట్స్ తీసుకోవాలి. అన్నింటినీ.. గ్రైండ్ చేసుకోవాలి. పచ్చిపాలతో పేస్ట్ లా తయారు చేసుకోవాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి.. పూర్తీగా ఆరిన తర్వాత.. కొన్ని నీళ్లు చిలకరించి.. స్క్రబ్ చేసుకోవాలి. ఇలా 5 నిమిషాలు స్క్రబ్ చేసి.. ప్లెయిన్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి. తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేయాలి.

చర్మానికి పోషణ

చర్మానికి పోషణ

ఒక టీస్పూన్ ఫ్రెష్ అలోవెరా జ్యూస్, 5 చుక్కల ఆల్మండ్ ఆయిల్ కలపాలి. దీన్ని 5 నిమిషాలు ఫ్రిడ్జ్ లో పెట్టి.. తర్వాత.. చర్మానికి మసాజ్ చేయాలి. ఈ ప్యాక్.. చర్మం పోషకాలను గ్రహించేలా చేస్తుంది. ఉదయానికి మీ చర్మం చాలా ఫ్రెష్ గా కనిపించేలా చేస్తుంది.

బ్రైటెనింగ్ మాస్క్

బ్రైటెనింగ్ మాస్క్

బాదాంను.. 5 నుంచి 6 గంటలు.. నీళ్లలో నానబెట్టాలి. దీన్ని పేస్ట్ చేసుకుని.. ఒక టీస్పూన్ పెరుగు కలపాలి. మెత్తటి మిశ్రమం చేసుకుని.. ముఖానికి అప్లై చేయాలి. 30 నిమిషాల తర్వాత.. గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మాన్ని బ్రైట్ గా మారుస్తుంది.

ఆయిల్ కంట్రోలింగ్ మాస్క్

ఆయిల్ కంట్రోలింగ్ మాస్క్

ఒక పెద్ద బొప్పాయి ముక్క తీసుకుని.. మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. కొన్ని చుక్కల ఆల్మండ్ ఆయిల్ మిక్స్ చేయాలి. దీన్ని చర్మానికి మసాజ్ చేయాలి. 30 నిమిషాల తర్వాత స్క్రబ్ చేసి శుభ్రం చేసుకుంటే.. ఆయిలీ నెస్ తగ్గుతుంది.

ట్యాన్ తొలగించడానికి

ట్యాన్ తొలగించడానికి

5 బాదాం గింజలను నీళ్లలో కొన్ని గంటలు నానబెట్టాలి. తర్వాత మెత్తటి పేస్ట్ చేసుకుని.. కొన్ని చుక్కల రోజ్ వాటర్, నిమ్మరసం కలిపి ప్యాక్ లా అప్లై చేసుకోవాలి. బాగా ఆరిన తర్వాత.. నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే.. ట్యాన్ తొలగిపోతుంది.

English summary

Why Almond Oil Deserves A Permanent Spot In Your Beauty Cabinet?

Why Almond Oil Deserves A Permanent Spot In Your Beauty Cabinet? Almond oil is a powerhouse of vitamin E, which boosts the collagen level, which in turn improves elasticity, making the skin firm and supple.
Story first published: Monday, October 17, 2016, 14:14 [IST]
Desktop Bottom Promotion