Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
చలికాలంలో చర్మం పగలకుండా కంపల్సరీ తీసుకోవాల్సిన టిప్స్..!
చలికాలంలో చర్మానికి బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ప్రతి ఒక్కరిలోనూ చలికాలం.. చర్మాన్ని డ్రైగా మారుస్తుంది. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్లు కూడా.. చలికాలంలో డ్రై స్కిన్ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తూ ఉంటారు.
చలికాలం అంటేనే.. చర్మం పొడిబారి, పగిలి, నిర్జీవంగా కనిపిస్తుంది. కాబట్టి చలికాలంలో చర్మం, శరీర సంరక్షణలో చాలా అలర్ట్ గా ఉండాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా.. మీ చర్మం నిర్జీవంగా మారుతుంది.

చలికాలంలో చర్మానికి బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ప్రతి ఒక్కరిలోనూ చలికాలం.. చర్మాన్ని డ్రైగా మారుస్తుంది. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్లు కూడా.. చలికాలంలో డ్రై స్కిన్ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తూ ఉంటారు. అయితే రకరకాల చర్మతత్వాలు కలిగిన వాళ్లు.. వాళ్లు చర్మాన్ని బట్టి చలికాలంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
చలికాలంలో చర్మ సంరక్షణకు కాస్త ఓర్పు అవసరం. సమయం కేటాయించడం కూడా ముఖ్యం. పగిలిన, నొప్పితో కూడిన చర్మాన్ని నివారించుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. పగుళ్ల వల్ల అసహ్యంగా కనిపించడమే కాదు.. నొప్పి కూడా ఉంటుంది.
కాబట్టి చలికాలంలో ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చర్మం పొడిబారకుండా.. హెల్తీగా, గ్లోయింగ్ గా ఉంటుంది. మరి ఆ టిప్స్ ఏంటో చూద్దామా..

స్నానానికి ముందు ఆయిల్
స్నానానికి ముందు శరీరానికి కొబ్బరినూనె పట్టించాలి. ఇది చర్మం మాయిశ్చరైజర్ కోల్పోకుండా అడ్డుకుంటుంది. దీనివల్ల చర్మం పొడిబారకుండా, పగలకుండా ఉంటుంది.

గోరువెచ్చని నీళ్లు
హాట్ వాటర్ ఉపయోగించడం వల్ల చర్మం డ్రైగా మారుతుంది. కాబట్టి గోరువెచ్చని నీటినే ఉపయోగించాలి. చలికాలంలో పాటించాల్సిన జాగ్రత్తల్లో ఇది ముఖ్యమైనది.

రెగ్యులర్ మాయిశ్చరైజర్
స్నానం చేసిన వెంటనే.. బాడీ బటర్ అప్లై చేయడం వల్ల.. తర్వాత చర్మం డ్రై కాకుండా ఉంటుంది. మాయిశ్చరైజర్ చర్మంలో ఇంకిపోయి.. డ్రై కాకుండా అడ్డుకుంటుంది.

హైడ్రేట్
చలికాలంలో చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లమ్ డీహైడ్రేషన్. ఎందుకంటే.. నీళ్లు తాగాలి అనిపించదు. కాబట్టి.. నీళ్లు తాగాలని అనిపించకపోయినా.. చలికాలంలో కూడా నీళ్లు బాగా తాగాలి. అప్పుడే చర్మం పగలకుండా ఉంటుంది.

మసాజ్ ఆయిల్
మసాజ్ ఆయిల్ ని రాత్రి నిద్రపోవడానికి ముందు కనీసం వారానికి ఒకసారైనా పట్టించాలి. వారానికి ఒకసారి కంటే.. ఎక్కువసార్లు ఇలా చేస్తే.. బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపడి.. చర్మం మాయిశ్చరైజర్ కోల్పోకుండా ఉంటుంది.

షీ బట్టర్
తీవ్రమైన డ్రై స్కిన్ తో బాధపడేవాళ్లు.. ఏం చేసినా.. ఫలితం పొందలేకపోతారు. కాబట్టి షీ బట్టర్ ట్రై చేయండి. ఎలాంటి స్కిన్ టైప్ వాళ్లకైనా.. ఇది పర్ఫెక్ట్ రెమెడీ.

హ్యాండ్ క్రీమ్
సాధారణంగా చాలా మంది చేతులకు మాయిశ్చరైజర్ అప్లై చేయడాన్ని నిర్లక్ష్యం చేస్తారు. చేతులు ఎక్కువ పని చేస్తుంటాయి. కాబట్టి.. వాటిపై సరైన శ్రద్ధ అవసరం. కాబట్టి ప్రతిరోజూ.. ఎక్స్ ట్రా మాయిశ్చర్ ఉండే క్రీమ్ ని చేతులకు అప్లై చేయాలి.



Click it and Unblock the Notifications