Latest Updates
-
ఆలూ పరోటాకి మించిన రుచితో ఉల్లి పరోటా.. బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ డైట్ ఫుడ్ ! -
భోజనం చేసిన వెంటనే కడుపు నొప్పిగా ఉంటుందా.?.. ఈ వ్యాధులకు సంకేతం కావచ్చు.! -
ఆషాఢం బల్కంపేటలో వైభవం.. నేడు ఘనంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం.. ‘జలదుర్గ’ విశేషాలివే.! -
వక్ర గతిలోకి శని గ్రహం.. ఈ నెల 28 వరకు ఈ 3 రాశుల వారికి కష్టాలు తప్పవు.! -
అద్భుతమైన విందు భోజనం కావాలా? అయితే ఈ కోకనట్ మిల్క్ మటన్ పులావ్ ట్రై చేయాల్సిందే -
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల -
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.! -
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.? -
తెలంగాణలో ఘనంగా బోనాల వేడుకలు.. ఆధ్యాత్మిక రహస్యం, చరిత్ర ఇదే.! -
మదురై స్పెషల్ మటన్ దోశ.. ఇలా చేస్తే జన్మలో ఆ రుచిని మర్చిపోలేరు!
మస్క్ మెలోన్ అందించే గ్రేట్ బ్యూటీ బెనిఫిట్స్
సమ్మర్ సీజన్ అందరికీ అంత ఫేవరెట్ సీజన్ కాకపోవచ్చు. ఎందుకంటే వేడి వాతావరణం వల్ల అనేక ఆరోగ్య సమస్యలతో పాటు, చర్మ సమస్యలను కూడా ఎదుర్కోవల్సివస్తుంది. అయితే ఒక అత్యంత ముఖ్యమైన ప్రయోజనం ఏంటేంటే..ఈ సీజన్ లో అనేక ఫ్రూట్స్ అందుబాటులో ఉంటాయి .
కీరదోసకాయ నుండి వాటర్ మెలోన్ వరకూ ఈ హాట్ సమ్మర్ ను కూల్ గా ...స్మూత్ గా మార్చుతాయి. సమ్మర్లో లభించే వివిధ రకాల ఫ్రూట్స్ లోకి మస్క్ మెలోన్ అద్భుతమైన రుచిని కలిగి ఉంటుంది. అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. మీకు తెలుసా మస్క్ మెలోన్ వల్ల చర్మ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది?
దాహాన్నితీర్చడమేకాదు, అందాన్ని కూడా వేగంగా పెంచతుంది
స్మోకింగ్ మానేసిన వారికి కూడా మస్క్ మెలోన్ ఒక ఎఫెక్టివ్ మెడిసిన్ లా పనిచేస్తుంది. మస్క్ మెలోన్ లో ఉండే విటమిన్స్ మరియు మినిరల్స్ స్మోకింగ్ మానేయడం వల్ల శరీరంలోని నికోటిన్ తొలగించడానికి ఈ ఫ్రూట్ గ్రేట్ గా సహాయపడుతుంది.
ఈ ఫ్రూట్ ఫైబర్ తో నిండి ఉంటుంది. ఇది కార్బోహైడ్రేట్స్ ను ఫాస్ట్ గా కరిగించడానికి సహాయపడుతుంది. అలాగే గర్భిణీ మహిళలకు కూడా మస్క్ మెలోన్ వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. ఇందులో ఫోలిక్ యాసిడ్ కూడా పుష్కలంగా ఉన్నది . ఇది కొత్తగా తల్లైన వారికి అత్యంత ముఖ్యమైనటువంటి పోషకం.
ప్రకాశవంతమైన చర్మ సౌందర్యాన్ని అందించే ఫ్రూట్ జ్యూసులు
ఇవన్నీ మస్క్ మెలోన్ అందించే గ్రేట్ హెల్త్ బెనిఫిట్స్. మరి మస్క్ మెలో చర్మానికి ఏం చేస్తుంది. ఇందులో బ్యూటీ బెనిఫిట్స్ ఉన్నాయా...?
ఖచ్చితంగా ఉన్నాయని చెప్పవచ్చు. కీరదోసకాయ వలే మస్క్ మెలోన్ కూడా అనేక బ్యూటీ బెనిఫిట్స్ దాగి ఉన్నాయి. దీన్ని నేరుగా తినడం లేదా బ్యూటీప్యాక్స్ లో చేర్చుకోవడం వల్ల అనేక బ్యూటీ బెనిఫిట్స్ ను అందిస్తుంది. మరి బ్యూటికి అందించే ఆప్రయోజనాలేంటో చూద్దాం...

1. మీ చర్మాన్ని అందంగా మార్చుతుంది:
మీ చర్మానికి మస్క్ మేలోన్ ఏం చేస్తుందని మీకు అనిపించవచ్చు. ఈ ఫ్రూట్ లో విటమిన్ కె మరియు ఇలు పుష్కలంగా ఉన్నాయి . ఇది మీ చర్మాన్ని హెల్తీగా ఉంచుతుంది . చర్మంలోపలి వరకూశుభ్రపరిచి, కండీషనర్ గా పనిచేసి హెల్తీ నేచురల్ గ్లోయింగ్ స్కిన్ ను అందిస్తుంది.

2. చర్మానికి తేమను అందిస్తుంది:
మస్క్ మెలోన్ లో వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. అందువల్ల ఈ ఫ్రూట్ మీ శరీరంను హైడ్రేషన్లో ఉంచుతుంది. మరియు శరీరంలోని టాక్సిన్స్ ను ఫ్లష్ అవుట్ చేయడానికి గ్రేట్ గా సహాయపడుతుంది. దాంతో చర్మం రేడియంట్ గా...ఎలాంటి మొటిమలు,మచ్చలు లేకుండా కనబడుతుంది.

3. చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చుతుంది:
చర్మానికి ఇది మరొక హెల్త్ బెనిఫిట్ . మస్క్ మెలోన్ లో ఉండే విటమిన్ బి , బీటైన్ మరియు కోలిన్, వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది . చర్మం మీద ఏర్పడ్డ డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది . మస్క్ మెలోన్ జ్యూస్ స్కిన్ ను సాఫ్ట్ గా మార్చుతుంది.

4. చర్మం యవ్వనంగా కనబడేలా చేస్తుంది:
ఈ ఫ్రూట్ లో విటమిన్ ఎ మరియు విటమిన్ సిలు పుస్కలంగా ఉన్నాయి . ఇది స్కిన్ రీనరేషన్ ను పెంచుతుంది మరియు విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి , చర్మం యవ్వనంగా కనబడేలా చేస్తుంది .

5. ముడుతలను నివారిస్తుంది:
మస్క్ మెలోన్ లో ఉండే ఫోలిక్ యాసిడ్ , చర్మంలోని కణాలను రీజనరేట్ చేస్తుంది. అదేవిధంగా ఇందులో ఉండే సివిటమిన్ ఫ్రీరాడికల్ ను నివారిస్తుంది . దాంతో చర్మంలోని ముడుతలను మరియు చారలు నివారించబడి చర్మం యంగర్ లుక్ తో కనబడుతుంది .

6. చర్మ వ్యాధులను నివారిస్తుంది:
చర్మం వ్యాధులు, కట్స్, బర్న్స్ మరియు రాషెష్, సమ్మర్ స్కిన్ అలర్జీలను నివారంచడంలో మస్క్ మెలోన్ గ్రేట్ గా సహాయపడుతుంది . ఇది వివిధ రకాల ఎక్సిమా లేదా స్కిన్ రాషెస్ ను మరియు ఇతర స్కిన్ డిసీజ్ లను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications