For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టీనేజ్ to మిడిలేజ్ వరకు బాధించే మొటిమల సమస్యను నివారించే అమేజింగ్ ఫేస్ మాస్క్

సాధారణంగా అందం విషయంలో మగువలు ఏ మాత్రం రాజీ పడరు. ఒక చిన్న మచ్చ కనిపించినా, ముడుతలు కనిపించినా.. ఇక వారి అందోళన అంతా..ఇంతా కాదు. అందం విషయంలో టీనేజ్ నుండి మద్య వయస్కుల వరకూ ప్రతి ఒక్కరినీ ఇబ్బంది పెట్

|

సాధారణంగా అందం విషయంలో మగువలు ఏ మాత్రం రాజీ పడరు. ఒక చిన్న మచ్చ కనిపించినా, ముడుతలు కనిపించినా.. ఇక వారి అందోళన అంతా..ఇంతా కాదు. అందం విషయంలో టీనేజ్ నుండి మద్య వయస్కుల వరకూ ప్రతి ఒక్కరినీ ఇబ్బంది పెట్టే సమస్య మొటిమలు.

వయస్సుతో సంబంధం లేకుండా వచ్చే ఈ మొటిమలను ఎప్పటికప్పుడు నివారించుకోవాలి. లేదంటే ఏజింగ్ లక్షణాలకు దారితీస్తుంది. టీనేజ్ నుండి మిడిలేజ్ వరకూ ఎలాంటి మొటిమలు, మచ్చలు లేని క్లియర్ స్కిన్ పొందడానికి కొన్ని అద్భుతమైన ఫేస్ ప్యాక్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి...

బంతిపూలతో ఫేస్ ప్యాక్ :

బంతిపూలతో ఫేస్ ప్యాక్ :

బంతి పూలతో ఫేస్ మాస్క్ గ్రేట్ రిఫ్రెషింగ్ మాస్క్ . బంతిపూల రేకులు, తేనె, పాలు మూడు కొద్దిగా తీసుకుని మిక్స్ చేసి, పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ను ముఖానికి పట్టించి, డ్రైగా మారిన తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను నివారిస్తుంది. అలాగే మచ్చలు, చారలను నివారిస్తుంది. మొటిమలను నివారించడానికి బెస్ట్ ట్రీట్మెంట్ .

బొప్పాయి ఫేస్ మాస్క్ :

బొప్పాయి ఫేస్ మాస్క్ :

బొప్పాయి ఫేస్ మాస్క్ అన్ని రకాల చర్మ తత్వాలకు సూట్ అవుతుంది. ఈ మాస్క్ లో స్కిన్ లైటనింగ్ గుణాలు అద్భుతంగా ఉన్నాయి. అందుకు బొప్పాయి, తేనె, ఆరెంజ్ జ్యూస్ తీసుకోవాలి. బొప్పాయి తొక్క తొలగించి అందులో తేనె, ఆరెంజ్ జ్యూస్ మిక్స్ చేయాలి. 15నిముషాల తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

 పొటాటో మాస్క్ :

పొటాటో మాస్క్ :

బంగాళదుంపలో స్కిన్ లైటనింగ్ లక్షణాలు, యాంటీ పఫీనెస్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. బంగాళదుంప, పచ్చిపాలు తీసుకోవాలి. బంగాలదుంప పొట్టు తీసి, శుభ్రంగా కడిగి, మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ కు కొద్దిగా పచ్చిపాలను మిక్స్ చేసి, ముఖానికి పట్టించి అరగంట తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి. మొటిమలు, మచ్చలు ఎఫెక్టివ్ గా తొలగిపోతాయి.

చమోమెలీ మాస్క్:

చమోమెలీ మాస్క్:

చాంతి పువ్వులు మనకు అందుబాటులో ఉంటాయి. అంతే కాదు మన ఇంటి గార్డెన్ లో కూడా ఉంటాయి. చాంతి పువ్వు తీసుకుని, మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ లో పచ్చిపాలు, తేనె మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి 20 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. మీకు స్పా ఫీలింగ్ కలుగుతుంది.

 రోజ్ మాస్క్ :

రోజ్ మాస్క్ :

గులాబీలు బ్యూటీకి వివిధ రకాలుగా ఉపయోగపడుతుంది. అందుకు ఎక్కువగా రోజ్ వాటర్ ను ఉపయోగిస్తుంటాము. ఈ సారి రోజ్ వాటర్ కు బదులు, రోజ్ పెటల్స్ ను ఉపయోగించండి. వైట్ లేదా పింక్ గులాబీ రేకులను(హైబ్రీడ్ గులాబీలు, కలర్ గులాబీలు కాకుండా)తీసుకుని, మెత్తగా పేస్ట్ చేయాలి. తర్వాత అందులో కొద్దిగా పచ్చిపాలు లేదా రోజ్ వాటర్ మికస్ చేయాలి. 20 నిముషాల తర్వాత ముఖంను శుభ్రం చేసుకోవాలి.

ఆరెంజ్ పీల్:

ఆరెంజ్ పీల్:

ఆరెంజ్ పీల్ తో తయారుచేసిన ఫేస్ మాస్క్ లో మార్కెట్లో బోలెడు ఉన్నాయి. మార్కెట్లో కెమికల్ బేస్డ్ పౌడర్ కంటే ఇంట్లో స్వయంగా తయారుచేసుకోవచ్చు. ఆరెంజ్ తొక్కలను ఎండలో ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఈ పొడిని గాలి చొరవడిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా పచ్చిపాలు, ప్లెయిన్ వాటర్ మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. 15 నిముషాల తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి.

అరటి మాస్క్ :

అరటి మాస్క్ :

అరటి పండ్లు ఆరోగ్యానికి మాత్రమే కాదు, అందాన్ని కూడా మెరుగుపరుస్తుంది. బానాన ఫేస్ మాస్క్ చర్మంను , జుట్టును సాప్ట్ గా మరియు సపెల్ గా మార్చుతుంది. అరటిపండు తీసుకుని మెత్తగా పేస్ట్ చేయాలి. తర్వాత అందులో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి 15 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

కుకుంబర్ మాస్క్ :

కుకుంబర్ మాస్క్ :

కీరదోసకాయ, అరటిపండు, ఓట్ మీల్ మూడు మిక్స్ చేసి, ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. 20 నిముషాల తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

 తేనెతో మాస్క్ :

తేనెతో మాస్క్ :

3 చెంచాల తేనెకు 2చెంచాల నిమ్మరసం మిక్స్ చేసి ఫేస్ కు మాస్క్ వేసురోవాలి. ఈ మాస్క్ ముఖానికి మాయిశ్చరైజింగ్ అందిస్తుంది. నిమ్మరసం స్కిన్ పిగ్మెంటేషన్ ను లైట్ గా మార్చుతుంది. స్కిన్ సెన్సిటివిటీని కాపాడుతుంది.

. శెనగపిండి మాస్క్ :

. శెనగపిండి మాస్క్ :

శెనగపిండిలో కొద్దిగా పసుపు, రోజ్ వాటర్, ప్లెయిన్ వాటర్ మిక్స్ చేసి పేస్ట్ లా తయారుచేసుకోవాలి. ఈ ప్యాక్ కు ముఖానికి మాస్క్ వేసుకోవాలి. 20 నిముషాల తర్వాత ముఖం చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

English summary

10 Amazing Face Masks For Teens To Thirties

Wrinkles are the last thing we worry about till hit our late thirties but doesn’t mean we ignore our skin otherwise now does it? And why would anyone say no to a little pampering?
Story first published: Tuesday, January 3, 2017, 11:16 [IST]
Desktop Bottom Promotion