Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
చర్మంను సూపర్ సాప్ట్ గా..గోయింగ్ గా మార్చే 10 హోం మేడ్ ఫేస్ వాష్ లు ...!!
ముఖంను శుభ్రం పరుచుకోవడానికి సురక్షితమైన పద్థతిని ఫాలో అయ్యే వారు , హోం మేడ్ ఫేస్ వాష్ ను ఎంపిక చేసుకోవడం మంచిది. ఇది చర్మంను సూపర్ సాప్ట్ గా మరియు గ్లోయింగ్ గా మార్చుతుంది.
అందాన్ని మెరుగుపరుచుకోవడంలో, చర్మసౌందర్యాన్ని పెంపొందించుకోవడంలో ఫేస్ వాష్ చాలా ముఖ్యమైన అంశం. ఫేస్ వాస్ రొటీన్ గా జరిగే ఒక ప్రక్రియ. మార్కెట్లో వివిధ రకాల బ్రాండ్స్ తో ఫేస్ వాష్ లు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉపయోగించడం వల్ల ఇన్ స్టాంట్ గా అందంగా కనబడుతారు. అయితే వీటిలో చాలా వరకూ హానికరమైన కెమికల్స్ ఉంటాయి . వీటిని ఎక్కువ రోజులు ఉపయోగించడం వల్ల చర్మానికి హాని కలిగిస్తాయి. అందుకు భయపడి, రెడీ మేడ్ ఫేష్ వాష్ లను మానేయక్కరలేదు. వాటి స్థానంలో మనమే ఇంట్లో స్వయంగా తయారుచేసుకోగలిని ఫేస్ వాష్ లు ఉత్తమ మార్గం.
ముఖంను శుభ్రం పరుచుకోవడానికి సురక్షితమైన పద్థతిని ఫాలో అయ్యే వారు , హోం మేడ్ ఫేస్ వాష్ ను ఎంపిక చేసుకోవడం మంచిది. ఇది చర్మంను సూపర్ సాప్ట్ గా మరియు గ్లోయింగ్ గా మార్చుతుంది. ఇంట్లో ఫేస్ వాష్ లను స్వయంగా తయారుచేసుకోవడానికి ముందు మీ చర్మ తత్వంను తెలుసుకోవాలి. అవి మీ చర్మానికి ఫ్రెండ్లీగా పనిచేస్తాయో లేదో తెలుసుకోవాలి. మొదట మీ చర్మ తత్వం హార్డ్ , స్వాఫ్ట్ , స్మూత్, సెన్సిటివ్ వీటిలో ఏదో తెలుసుకుని తర్వాత మీ చర్మ తత్వానికి సరిపోయే హోం మేడ్ ఫేస్ వాష్ ను ఎంపిక చేసుకోవాలి.
చర్మంలో మొటిమలు, అలర్జీ ఉన్నవారు లేదా సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు ఎక్స ట్రా కేర్ తీసుకోవాలి. ఫేస్ వాష్ కు ఎంపిక చేసుకునే పదార్థాలు చర్మానికి సూటబుల్ గా ఉంటేనే మంచి ఫలితాలను అందిస్తాయి . కాబట్టి, ఇక్కడ కొన్ని బెస్ట్ హోం మేడ్ ఫేస్ వాష్ రిసిపిలు మీకోసం అందుబాటులో ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..

అలోవెర ఫేస్ వాష్ :
1/4కప్పు అలోవెర జెల్, 2 టేబుల్ స్పూన్ల బాదం ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ , ఒక టేబుల్ స్పూన్ సోప్ వర్ట్ ఎక్సాక్ట్ తీసుకుని అన్ని బాగా మిక్స్ చేయాలి. దీన్నీ అవసరమైనప్పుడు ముఖానికి అప్లై చేసి క్లెన్సింగ్ చేయాలి. ఈ హోం రెమెడీ ఖచ్చితంగా ముఖం మెరిసేలా చేస్తుంది.

ఓట్ మీల్ ఫేస్ వాష్ :
ఇది పౌడర్డ్ ఫేస్ వాష్ , ఓట్స్ ను మెత్తగా పొడి చేసి అందులో రెండు టీస్పూన్ల చమోమెలీ టీ మిక్స్ చేయాలి. తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ బెంటోనైట్ క్లే మిక్స్ చేయాలి. ముఖాన్ని తడి చేసుకుని, ఈ పౌడర్ లో గోరువెచ్చని నీళ్ళు పోసి, దీన్ని ముఖానికి ఉపయోగించి ఫేస్ వాష్ చేయాలి.

ఎర్రమట్టి, తేనె ఫేస్ వాష్ :
సెన్సిటివ్ స్కిన్ కు అద్బుతమైన ఫేస్ ప్యాక్ ఇది . రెండు టీస్పూన్ల ఎర్ర మట్టిలో 1/4 టీస్పూన్ తేనె మిక్స్ చేయాలి. రెండూ బాగా మిక్స్ చేసి టైట్ గా ఉండే జార్లో వేసి దీన్ని రెగ్యులర్ గా ముఖానికి ఉపయోగించి ఫేస్ వాష్ చేసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా మెరుస్తుంటుంది.

కొబ్బరి నూనె, తేనె ఫేస్ వాష్ :
రెండు టీస్పూన్ల తేనె లో ఒక /4 టీస్పూన్ కొబ్బరి నూనె మిక్స్ చేయాలి. తర్వాత ఒకటి రెండు చుక్కల ల్యావెండర్ ఆయిల్ మిక్స్ చేసి, బ్లెండ్ చేయాలి. తర్వాత దీన్ని ఫేస్ వాష్ గా ఉపయోగించాలి.

చార్కోల్ వాష్ :
ఒక కప్పు ఆర్గానిక్ కొబ్బరి నూనెలో 6 యాక్టీవేటెడ్ చార్కోల్ క్యాప్స్యూల్స్ , రెండు టీస్పూన్ల బేకింగ్ సోడా వేసి మిక్స్ చేయాలి. అందులోనే లావెండర్ ఆియల్, లేదా రోజ్మెర్రీ ఆియల్ ను మిక్స్ చేయాలి. ఈ మిశ్రమంతో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల చర్మంలో టాక్సిన్ తొలగిపోతాయి.

టమోటో ఫేస్ వాష్ :
ఇది స్కిన్ బ్లీచింగ్ ఫేస్ వాష్ . చాలా ఫేమస్ అయినది. ఇందులో క్లెన్సింగ్ లక్షణాలు అద్భుతంగా ఉన్నాయి. రెండు టీస్పూన్ల టమోటో గుజ్జులో ఒక టీస్పూన్ పాలు మిక్స్ చేసి, నిమ్మరసం మిక్స్ చేయాలి. దీన్ని ఉపయోగించినప్పుడు ఇన్ స్టాంట్ గా రిఫ్రెష్ నెస్ చేస్తుంది.

పెరుగు స్ట్రాబెర్రీ ఫేస్ క్లెన్సర్ :
రెండు స్ట్రాబెర్రీస్ తీసుకుని, అందులోరెండు టీస్పూన్ల పెరుగును మిక్స్ చేయాలి. ఇది రిఫ్రెషింగ్ అండ్ క్లెన్సింగ్ హోం మేడ్ ఫేస్ వాష్ రిసిపిగా పనిచేస్తుంది. వీటిని చక్కగా మిక్స్ చేసి తర్వాత ఉపయోగించాలి.

యాపిల్ సైడర్ వెనిగర్ ఫేస్ వాష్ :
మొటిమలున్నట్లైతే ఈ ఫేస్ వాష్ కు 2 టీస్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ లో 2 టీస్పూన్ల వార్మ్ వాటర్ ను మిక్స్ చేసి, కాస్టిల్ సోప్ తో మిక్స్ చేసి ఉపయోగిస్తే ఎఫెక్టివ్ రిజల్ట్ ఉంటుంది,

తేనె మరియు లెమన్ ఫేస్ వాష్ :
ఈ ఫేస్ వాష్ ఆయిల్ స్కిన్ కు ఎక్సలెంట్ గా పనిచేస్తుంది.ఇది చర్మంలో ఆయిల్ ను బ్యాలెన్స్ చేస్తుంది. అవసరమైతే కొద్దిగా నీళ్ళు కూడా కలుపుకోవచ్చు.

బేకింగ్ సోడ, తేనె ఫేస్ వాష్ :
ముఖం తడి చేసుకున్న తర్వాత, అందులో ఒక టీస్పూన్ తేనె, ఒక చిటికెడు పసుపు, అరటీస్పూన్ బేకింగ్ సోడా చేతిలోకి వేసుకుని, ముఖానికి మర్ధన చేయాలి, తర్వాత వాటర్ తో శుభ్రం చేసుకోవాలి.



Click it and Unblock the Notifications











