For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గోరింటాకు ఎర్రగా పండటానికి 10 చిట్కాలు

By Deepti
|

గోరింటాకు తరచుగా పెట్టుకుంటూనే ఉంటాం. ప్రతిసారీ అందరికీ అది అందంగా రావాలనే కోరుకుంటాం. డిజైన్ నుంచి రంగు వరకు ఏది తగ్గినా మనలో ఎవరికీ అస్సలు నచ్చదు. అవుననుకోండి, మిగతా ఆడవాళ్ల మధ్య మనం ప్రత్యేకంగా కన్పించాలంటే అందమైన చేతుల్లో అందమైన గోరింటాకు పండాలి కదా !

భారతీయ యువతుల్లో గోరింటాకు రంగుకోసం పోటీ కూడా ఉంటుంది. దాని చుట్టూ చాలా మూఢనమ్మకాలు కూడా ఉన్నాయి. అరచేతుల్లో ఎంత బాగా పండితే పెళ్ళయ్యాక అంత భర్తప్రేమ దొరుకుతుందని నమ్మకం. అరచేయికి బయట రంగు వత్తుగా ఉంటే కాబోయే అత్తగారు అంత ప్రేమిస్తుందని నమ్మకం. ఇవన్నింటికి ఆధారాలు లేకపోయినా నమ్మకం చేత రంగు బాగా రావటానికి యువతులు చాలా కష్టపడతారు.

mehendi colour

కానీ అందంగా గోరింటాకు రావటం అనేది ఒకరోజు కార్యక్రమం కాదు. గోరింటాకు పెట్టుకోవడానికి చాలా ప్రయత్నం కావాలి. గోరింటాకు రంగు శరీరంలో వేడి పై ఆధారపడినా, ఈ కింది చిట్కాలు పాటిస్తే అది మరింత అందంగా రావచ్చు.

ఈ కింది పది చిట్కాలను వాడి గోరింటాకు ఇంట్లోనే తయారుచేసుకుని మంచిగా పెట్టుకోవచ్చు. కొన్ని చిట్కాలు వాడి మీ చేతులను గోరింటాకు పెట్టుకోడానికి ముందే మీ చేతులను జేగురు రంగులోకి మార్చుకోవచ్చు. ఈ కింద పద్ధతులు చదవండి.

ఆషాఢంలో స్త్రీలు గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు.. ప్రత్యేకత ఏమిటి?ఆషాఢంలో స్త్రీలు గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు.. ప్రత్యేకత ఏమిటి?

మీ చేతి అవాంఛితరోమాలు తొలగించుకోవాలనుకుంటే, ఆ పని గోరింటాకు పెట్టుకోడానికి ముందే చేయండి. ఎందుకంటే వాక్సింగ్, షేవింగ్ మీ గోరింటాకు పై పొరను తొలగించి దాన్ని అందంగా కన్పించనివ్వదు.

గోరింటాకు పెట్టుకోడానికి ముందే చేతులు కడగకండి. గోరింటాకును అశుభ్రమైన చేతులపై కూడా పెట్టకండి. చేతులు శుభ్రం చేసుకోవాలనిపిస్తే దూదితో శుభ్రంగా లోషన్ వేసి తుడుచుకోండి.

గోరింటాకు అరచేతులపై పెట్టేముందు, రెండు అరచేతులను కలిపి రుద్దండి. కొంచెం వెచ్చగా మారితే గోరింటాకు పెట్టుకోడానికి అనువుగా మారుతుంది

మెహిందీ ఉత్సవానికి సరిపోయే బ్రైడల్ అవుట్ ఫిట్స్...మెహిందీ ఉత్సవానికి సరిపోయే బ్రైడల్ అవుట్ ఫిట్స్...

  • నిమ్మరసం, పంచదారను కలిపి ఒక గిన్నెలో దాచుకోండి.
  • కొన్ని లవంగాలను పాన్ లో వేసి గ్యాస్ పై పెట్టండి, కానీ ఆన్ చేయవద్దు.
  • కొంచెం ఆవనూనె, పచ్చళ్ళ నూనెను చేతికి దూరంలో ఉంచుకోండి.
  • బామ్ లేదా పెట్రోలియం జెల్లీ ఉందో లేదో చూసుకోండి.
  • అవసరంలేని గుడ్డ, దూదిని చుట్టూ ఉంచుకోండి.
  • గోరింటాకు పెట్టుకోడానికి గంట ముందే కొంచెం యూకలిప్టస్ నూనెను చేతులపై రాసుకోండి. నూనె ఆరిపోయాక గోరింటాకు డిజైన్ మొదలుపెట్టవచ్చు.
మీ గోరింటాకు ఆరనివ్వండి

మీ గోరింటాకు ఆరనివ్వండి

గోరింటాకు వేసుకున్నాక, ఆ తడి చికాకుగా ఉండి చాలామంది వెంటనే తీసేసుకోవాలనుకుంటారు. కొంచెం సహనంతో మంచి రంగు పొందవచ్చు. మీ చేతులు దేన్ని తగలకుండా చూసుకోండి, డిజైన్ పాడయిపోతుంది. మీ చేతులు సహజంగా ఆరనివ్వండి. ఫ్యాన్ లేదా మరే పరికరంతో చేతులు ఆరబెట్టుకుంటే మంచి రంగు వస్తుంది. అందుకని కాసేపు సహనంగా ఉండి సహజంగా చేతులు ఆరనివ్వండి.

నిమ్మ- పంచదార మిశ్రమం

నిమ్మ- పంచదార మిశ్రమం

గోరింటాకు కొంచెం కొంచెం ఆరుతున్నప్పుడు, దూదితో నిమ్మ పంచదార మిశ్రమాన్ని మెల్లిగా చేతులకు రాసుకోండి. కొంచెం ఆ మిశ్రమాన్ని వేడి చేసుకుని రాస్తే మంచిది. నిమ్మ- పంచదార మిశ్రమం మీ గోరింటాకును చేతికి కొంచెం జిగటగా అన్పించినా మంచిదే. అందుకే చేయాలనుకున్నది చేసినా ఈ నిమ్మ పంచదార మిశ్రమాన్ని మర్చిపోకండి.

లవంగాలు

లవంగాలు

గ్యాస్ పై పెట్టిన లవంగాలు గుర్తున్నాయిగా. ఎవరి సాయం అయినా తీసుకుని గ్యాస్ ఆన్ చేసి దాని పొగను మీ చేతులకు తగిలేట్లా చేసుకోండి.ఇది జిగటగా అన్పిస్తే, ప్రత్యామ్నాయంగా లవంగ నూనెను వాడవచ్చు.

దుస్తుల మీద గోరింటాకు మరకలు తొలగించే చిట్కాలుదుస్తుల మీద గోరింటాకు మరకలు తొలగించే చిట్కాలు

నీటికి ఎంత వీలైతే అంత దూరంగా ఉండండి

నీటికి ఎంత వీలైతే అంత దూరంగా ఉండండి

గోరింటాకు ఎండే సమయంలో ,నీటికి ఎంత వీలైతే అంత దూరంగా ఉండండి. పన్నెండు గంటలపాటు గోరింటాకు చేతులను నీటికి దూరంగా ఉంచితే మీకు కావాల్సిన రంగులు వస్తాయి. ఆహారం తీసుకోవడం, ముఖం కడుక్కోవటం కష్టమవచ్చు కానీ నీటికి దూరంగా ఉంటే మీ గోరింటాకు చేతులు అందంగా మారతాయి.

ఆవనూనె/పచ్చళ్ళ నూనె

ఆవనూనె/పచ్చళ్ళ నూనె

నిమ్మపంచదార రసం మరియు లవంగాల పొగ తర్వాత మీ గోరింటాకు ఎండిపోయి మీరు సులభంగా దాన్ని చేతులు రుద్దుకుని వలిచేయవచ్చు. కత్తి లేదా బ్లేడు వంటివి వాడకండి. గోరింటాకు ముక్కలు తీసేసాక, ఒక చెంచాడు ఆవనూనె/పచ్చళ్ళ నూనెను చేతినిండా రాసుకోండి. ఈ నూనె గోరింటాకుకు మరింత రంగు తెచ్చి కొద్దిసేపట్లో మీకే అర్థమవుతుంది.

బామ్

బామ్

ఇది అంత ప్రసిద్ధం కాకపోయినా బాం రాసుకోటం కూడా గోరింటాకుపై ప్రభావం చూపిస్తుంది. అవును మీరు తలనెప్పులకు రాసుకోటానికి వాడే బామ్ గురించే మాట్లాడుతున్నాం. కొంచెం బామ్ చేతుల్లో తీసుకుని చేతినిండా రాసుకోండి. నీరు వాడేవరకు ఎన్నిసార్లైనా చేతులకు రాసుకోవచ్చు.

మెహందీ పౌడర్ నాణ్యత

చివరగా, మెహందీ పౌడర్ నాణ్యంగా లేకపోతే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం ఉండదు. గోరింటాకు నాణ్యంగా ఉండాలంటే, పౌడర్ ను కొని పేస్ట్ ను ఇంట్లోనే తయారుచేసుకోవటం మంచిది. ఆకులు తెచ్చుకుని పౌడర్ ను ఇంట్లో తయారుచేసుకోండి- అదే ఉత్తమం. చవకబారు గోరింటాకు మిశ్రమాన్ని కొని మంచి రంగు రావాలనుకోవటం అత్యాశ అవుతుంది.

English summary

10 Tips To Get Dark And Deep Mehendi Colour On The Hands

Check out these home remedies and tips that can make your mehendi colour appear really deep and dense on your hands.
Story first published:Thursday, July 6, 2017, 13:24 [IST]
Desktop Bottom Promotion