Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
చర్మాన్ని యవ్వనంగా ..కాంతివంతంగా మెరిపించే 6 అమేజింగ్ ఫుడ్స్ ..!!
చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారల ఎంపికలు ఉత్తమమైనవిగా ఉండాలి. ఇవి చర్మానికి ఎఫెక్టివ్ గా మెడిసిన్ లా పనిచేస్తాయి. ఈ సూపర్ ఫుడ్స్ అన్ని రకాల చర్మ సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.
అందంగా క్లియర్ గా ఉండే చర్మంను ఎవరు కోరుకోరు చెప్పండి. ప్రకాశవంతంగా ఉండే చర్మ సౌందర్యం కలవారి ఒక సారి చూస్తే మరొకసారి చూడాలని కోరుకుంటారు? అనారోగ్యకరమైన ఆహారాలను తిన్నప్పుడు, చర్మంలో మచ్చలు, మొటిమలు కనబడుతాయి. మీ రియల్ స్కిన్ ను జస్ట్ సింపుల్ గా, స్మూత్ గా క్లీన్ అండ్ క్లియర్ గా ఉండాలని కోరుకుంటున్నారా?అది అంత పెద్ద కష్టమైన పనేం కాదు.

చర్మంలో మొటిమలు, మచ్చలు, ఇతర చారలను కప్పిపుచ్చుకోవడానికి లేయర్స్ లేయర్స్ గా మేకప్ వేసుకోవడం కాదు. రెగ్యులర్ గా మనం తీసుకునే ఆహారాలు, పానియాలే మన చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అన్నింటికన్నా ముందు నమ్మకంగా ఉండాలి. నమ్మకం, స్థిరత్వం లేకపోతే, ఫలితం పొందలేరు.
చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారల ఎంపికలు ఉత్తమమైనవిగా ఉండాలి. ఇవి చర్మానికి ఎఫెక్టివ్ గా మెడిసిన్ లా పనిచేస్తాయి. ఈ సూపర్ ఫుడ్స్ అన్ని రకాల చర్మ సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి. మరి అటువంటి అందమైన చర్మ సౌందర్యాన్ని మీరు కోరుకుంటున్నట్లైతే ఈ క్రింది ఫుడ్స్ చర్మసౌందర్యానికి ఏవిధంగా సహాయపడుతాయో తెలుసుకోండి..

యూవీ కిరణాల నుండి రక్షణ కల్పించడంలో టమోటోలు:
టమోటోలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల హెల్తీ స్కిన్ పొందవచ్చు. పచ్చి టమోటోలు లేదా సాస్ రూపంలో ఉండే టమోటోలను తినడం వల్ల , వీటిలో ఉండే లైకోపిన్ అనే కంటెంట్ చర్మానికి ఉపయోగించే అన్ని రకాల రసాయాలు మరియు యూవీ కిరణాల నుండి రక్షణ కల్పిస్తుంది. లైకోపిన్ అనే కెమికల్స్ గుణాల వల్ల టమోటో రెడ్ కలర్లో కనబడుతుంది. రెగ్యులర్ డైట్ లో లైకోపిన్ కంటెంట్ పెంచడం వల్ల శరీరంలో మొటిమలను నివారించే హార్మోనులను ఉత్పతి చేస్తుంది దాంతో మొటిమలను తగ్గుతాయి. అలాగే లైకోపిన్ కెరోటినాయడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ లెవల్స్ ను తగ్గిస్తుంది. ఈ యాంటీఆక్సిడెంట్స్ చర్మానికి రక్షణ కల్పిస్తుంది.

ఏజింగ్ లక్షణాలను నివారించడంలో గ్రీన్ టీ :
గ్రీన్ టీ చర్మాన్ని కాంతి వంతంగా మార్చుతుంది. మన శరీరానికి ఏవి నప్పుతాయో వాటిని మాత్రమే సెలక్ట్ చేసుకోవడం అవసరం . గ్రీన్ టీలోని ప్రయోజనాలను పొందాలంటే, మూడు నాగులు కప్పులు గ్రీన్ టీని తాగాలి. శరీరంలో ఉండే డీహూడ్రోటెస్టోస్టెరాన్, చర్మంలో మొటిమలకు దారితీస్తుంది. గ్రీన్ టీలో ఉండే కెమికల్స్ చర్మంలో డిహెచ్ టి ను తగ్గిస్తుంది. అదే సమయంలో మొటిమలతో పోరాడుతుంది.

హెల్తీ స్కిన్ కోసం బెర్రీస్ :
బెర్రీస్ లో బ్లూ బెర్రీ, చెర్రీ, కలర్ ఫుల్ చెర్రీ యాంటీఆక్సిడేటివ్ స్ట్రెస్ తో పోరాడుతుంది. ఈ బెర్రీస్ ఫ్రీరాడికల్స్ తో పోరాడే యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. ఇది లోకల్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించడంలో గ్రేట్ సహాయపడుతాయి. కాబట్టి రెగ్యులర్ డైట్ లో ఈ ఫ్రూట్స్ ను చేర్చుకోవడం చాలా గ్రేట్ గా చెప్పవచ్చు. వివిధ రకాల బెర్రీస్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా, అందంగా తయారవుతుంది. ముఖ్యంగా చర్మంను కాంతివంతంగా మార్చుతుంది.

మెటిమలను నివారించే సీఫుడ్స్ :
తరచూ సీఫుడ్స్ తినే వారిలో ముఖ్యంగా చేపలు తినే వారిలో చర్మం కాంతివంతంగా మెరుస్తుంటుంది. చర్మంలో ఎలాంటి మొటిమలు మచ్చలు లేకుండా , ముడుతలను మాయం చేస్తుంది. చేపల్లో ఉండే ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చర్మానికి హాని కలిగించే ఇన్ఫ్లమేటరీ కెమికల్స్ ను తగ్గిస్తుంది. సీఫుడ్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల మొటిమలతో పోరాడుతుంది. మొటిమలు ఎర్రగా వాపులతో , ముట్టుకుంటే నొప్పి కలిగించే వాటిని నివారిస్తుంది. ఈ లక్షణాలన్నింటిని నివారించుకోవాలంటే సీఫుడ్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం మంచిది.

చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసే బ్రౌన్ రైస్ :
కొన్ని ప్యాకేజ్ ల మీద సిరామిడ్స్ అనే పదాన్ని రాసి ఉండటాన్ని మీరు గమనించే ఉంటారు. ఈ సిరామిడ్స్ అనే కాంపోనెంట్స్ స్కిన్ కు కావల్సిన మాయిశ్చరైజింగ్ గుణాలను అందిస్తుంది. సిరామేడ్స్ కలిగిన నేచురల్ ఫుడ్స్ ను తినడం వల్ల చర్మానికి కావల్సిన మాయిశ్చరైజింగ్ గుణాలు అందుతాయి. ఈ గుణాలు బ్రౌన్ రైస్ లో పుష్కలంగా ఉన్నాయి .

.క్లియర్ స్కిన్ పొందడానికి సరిపడా వాటర్ కావాలి:
చర్మం యవ్వనంగా, హైడ్రేషన్ లో కనబడాలన్నా, అందంగా స్కిన్ ఎలాసిటి పెంచుకోవాలన్నా..ముఖంగా చర్మంలో ఎలాంటి మొటిమలు, మచ్చలు కనబడకూదంటే రోజుకు తప్పనిసరిగా 2 నుండి 4 లీటర్లు నీళ్ళు తప్పనిసరిగా తాగాలి. నీళ్ళు ఎక్కువగా తాగడం వల్ల చర్మంలోని టాక్సిన్స్ బయటకు నెట్టివేయబడుతాయి. చర్మానికి కావల్సిన తేమను అందిస్తుంది. మైండ్ ఫ్రెష్ గా ఉంచుతుంది. శరీరంలో అవయవాలు చురుకుగా పనిచేస్తాయి. కాబట్టి, చర్మంలో తేమగా , యవ్వనంగా కనబడాలంటే రోజూ సరిపడా నీళ్ళు తాగాలి.



Click it and Unblock the Notifications











