For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కళ్ళ కింద ముడతలను తగ్గించుకోవడానికి 8 సహజ నివారణ పద్ధతులు

|

మచ్చలేని సౌందర్యాన్నే చాలా మంది కోరుకుంటారు. అయితే, కంటి కింద ముడతలు మీ ముఖవర్చస్సుని దెబ్బతీస్తాయి. అదృష్టవశాత్తు, కొన్ని సులభ పద్దతుల ద్వారా కంటి కింద ముడతల సమస్య నుంచి బయటపడవచ్చు. అవొకాడో, ఆలివ్, కొబ్బరి మరియు కాస్టర్ నూనెలు అలాగే పైనాపిల్, బొప్పాయి, ద్రాక్ష అవొకాడో వంటి పండ్లు అలాగే అలోవెరా, మెంతులు మరియు రోజ్ మేరీ వంటి హెర్బ్స్ వంటివి కంటి కింద ముడతలని తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. వీటిలో కొన్ని చర్మం దృఢత్వానికి ప్రధానమైన ఎలాస్టిన్ మరియు కొల్లాజిన్ ఉత్పత్తిని పెంపొందించడానికి ఉపయోగపడితే మరికొన్ని చర్మానికి అవసరమైనంత తేమని అందించడానికి ఉపయోగపడతాయి.

అలాగే, మరికొన్ని చర్మ సౌందర్యానికి అవసరమైన ఏ, సీ, ఈ మరియు కే విటమిన్స్ ను అలాగే యాంటీఆక్సిడాంట్స్ ను కలిగి ఉంటాయి. తద్వారా ఫ్రీ రాడికల్ డేమేజ్ ను అడ్డుకుంటాయి. వీటిని వాడుతూనే మీరు కూడా కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి. స్మోకింగ్ ను మానేసి సన్ స్క్రీన్ను ఉపయోగించడం తప్పనిసరని గుర్తుంచుకోవాలి.

8 Home Remedies For Under-Eye Wrinkles: De-Crease Now

కంటి కింద ముడతల గురించి మీరు అతిగా బాధపడే ముందు ఒక విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ఈ ముడతలలో ఎక్కువ శాతం లాఫ్టర్ లైన్స్ అయి ఉంటాయి. ఇవన్నీ మీరు సంతోషంగా కొని తెచ్చుకున్నవేనని తెలుసుకుని ఆనందించండి. కంటి కింద ఉండే మరికొన్ని ముడతలు వయసు రీత్యా ఏర్పడినవి. ఈ ప్రాంతంలో కొల్లాజెన్ అలాగే ఎలాస్టిన్ ఉత్పత్తి తక్కువగా ఉండటం వలన ముడతలు ఏర్పడతాయి. 20 దాటిన తరువాత చర్మం కొలాజిన్ మరియు ఎలాస్టిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. అందువలన చర్మం కొంచెం వదులుగా ముడతలుగా తయారవుతుంది. అలాగే, చర్మానికి తగిన తేమని అందించే గ్లైకోసామినోగ్లైకాన్స్ ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది.

బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్ ను వాడటం వలన హానికరమైన యూవీ రేస్ నుంచి మీ చర్మాన్ని మీరు సంరక్షించుకోవచ్చు. అలాగే తరచూ ముఖాన్ని శుభ్రపరచుకోవాలి. స్మోకింగ్ కి దూరంగా ఉండాలి.

కెమికల్స్ తో నిండిన అతి ఖరీదైన ఫ్యాన్సీ అండర్ ఐ క్రీమ్స్ ని వాడే బదులు ఈ 8 సహజ నివారణ పద్దతుల ద్వారా మీరు కంటి కింద ముడతలను తగ్గించుకోవచ్చు.

1. కాఫీ బీన్

1. కాఫీ బీన్

తాజాగా నూరిన కాఫీ బీన్స్ సువాసనలు ఎవరు ఆకర్షితులు కారు చెప్పండి? కాఫీ అనేది మీకు ఉత్సాహాన్ని అందించడంతో పాటు మీ చర్మానికి తగిన పోషణని అందిస్తుంది. కాఫీ ప్లాంట్ కు చెందిన ఫ్రూట్స్ (కాఫీ అరబిక)లో కలిగిన శక్తివంతమైన యాంటీఆక్సిడాంట్ మీ చర్మానికి ఫ్రీ రాడికల్స్ వలన కలిగిన డేమేజ్ ను తగ్గిస్తుంది. తద్వారా, ముడతలు, నల్లటి మచ్చలు, ఫైన్ లైన్స్ ను తొలగిస్తుంది. ఈ విధంగా మీ చర్మానికి సహజ నిగారింపుని కలిగిస్తుంది.

DIY కాఫీ బీన్ ప్యాక్

చక్కగా నూరిన కాఫీ బీన్ పౌడర్ ని వాడితే చర్మ సౌందర్యం దెబ్బతినదు. ఈ కాఫీ బీన్ పౌడర్ కి సమాన పరిమాణంలో కోకోని కలపండి. తగినంత తేనెని కూడా కలపండి. ఈ ప్యాక్ ని మీ ముఖంపై అలాగే మీ మెడపై అప్లై చేసి పదిహేను నిమిషాలపాటు అలాగే ఉంచండి. నార్మల్ వాటర్ తో ముఖాన్ని వాష్ చేసిన తరువాత మెత్తటి టవల్ తో మీ చర్మంపైన తడిని తుడవండి.

2. కొబ్బరి నూనె

2. కొబ్బరి నూనె

శరీరానికి అవసరమైనంత తేమని కొబ్బరి నూనె ద్వారా పొందవచ్చు. తద్వారా ముడతల సమస్య తగ్గుముఖం పడుతుంది. అవసరమైన యాంటీఆక్సిడాంట్స్ తో అలాగే ముఖ్యమైన విటమిన్స్ తో నిండిన కొబ్బరి నూనె మీ చర్మ సౌందర్యాన్ని కాపాడడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. తద్వారా చర్మానికి అవసరమైన తేనె అంది చర్మం నవయవ్వనంగా ప్రకాశిస్తుంది. కొబ్బరి నూనె యొక్క చర్మసంరక్షణ గుణాలను అందుకోవాలంటే మీరు కొబ్బరి నూనెతో మీ చర్మానికి తగిన మసాజ్ ని అందివ్వాలి. స్కిన్ పోర్స్ లోకి కొబ్బరి నూనె వెళ్లే విధంగా మసాజ్ చేయాలి. ఇలా చేస్తే చర్మంలో తేమ తగినంత ఉండటం వలన ముడతలకు అలాగే ఫైన్ లైన్స్ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

DIY కొబ్బరినూనె మరియు పసుపు మాస్క్

ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె తీసుకుని అందులో ఒక చిటికెడు పసుపుని కలపండి.

ఈ మిశ్రమాన్ని ముడతలపై అప్లై చేసి దాదాపు 20 నిమిషాల వరకు అలాగే ఉంచండి.

ఆ తరువాత శుభ్రమైన నీటితో కడగండి.

బాదం నూనె, యూకలిఫ్టస్ నూనె, చమోమైల్ లేదా కొబ్బరి నూనెలను వాడుకొని ముఖంపై అలాగే మెడపైనున్న ముడతలను తగ్గించుకోవచ్చు.

3. ఆలివ్ నూనె:

3. ఆలివ్ నూనె:

ఆలివ్ నూనె కేవలం వంటలకు చక్కటి సువాసనలను అందచేయడానికి మాత్రమే కాదు మీ సౌందర్యానికి మెరుగులు దిద్దడానికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది. ఐ బ్యాగ్స్ ని తగ్గించడంలో ఆలివ్ ప్రధాన పాత్ర పోషిస్తుంది అనడంలో సందేహం లేదు. విటమిన్ ఈ మరియు కే లతో పాటు ప్రోటెక్టివ్ యాంటీఆక్సిడాంట్స్ ఆలివ్ నూనెలో పుష్కలంగా ఉండడం వలన ప్రీమెచ్యూర్ ఏజింగ్ సమస్యనుంచి మనల్ని మనం సంరక్షించుకోవచ్చు. కంటి కింద చర్మం తేమను త్వరగా కోల్పోతుంది. ఆలివ్ నూనె ని చర్మానికి అప్లై చేయడం వలన చర్మానికి అవసరమైనంత తేమ అంది చర్మం మృదువుగా కోమలంగా ఉంటుంది. మీ చర్మం యొక్క మృదుత్వాన్ని తిరిగి దక్కించుకోవడం కోసం కొన్ని చుక్కల నిమ్మరసాన్ని కూడా జతచేయండి.

DIY ఆలివ్ ఆయిల్ ఫేస్ మసాజ్

కొంత ఆలివ్ నూనెను తీసుకుని మీ ముఖంపై మృదువుగా పదినిమిషాల పాటు మర్దనా చేయండి.

కొన్ని నిమిషాలపాటు ఆలా ఉంచండి.

ఆ తరువాత శుభ్రమైన నీటితో కడగండి. మెత్తటి టవల్ తో తడిని తుడవండి.

ఈ పద్దతిని తరచూ పాటించడం వలన ఆశించిన ఫలితాలు పొందగలరు.

పెరుగు(యోగర్ట్)

పెరుగు(యోగర్ట్)

పెరుగు(యోగర్ట్) ఆరోగ్యకరమైన ఆహారమే కాదు అనేకరాల రూపాలలో మనకు డిజర్ట్స్ రూపంలో దర్శనమిస్తూ మన టేస్ట్ బడ్స్ ను సంతృప్తిపరచే ఆహారం కూడా. పెరుగుతో సలాడ్స్, స్మూతీస్, డిజర్ట్స్ వంటివి చేస్తారు. ఇలా ఎన్నో రకాలుగా పెరుగు మన ఆహారంలో భాగమైపోయింది. పెరుగులో లాక్టిక్ యాసిడ్ తో పాటు అల్ఫాహైడ్రాక్సీ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇవి చర్మం యొక్క మృతకణాలను తొలగించడంతో పాటు ఫైన్ లైన్స్ ని అలాగే ముడతలని తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. మీ స్కిన్ కేర్ రొటీన్ లో పెరుగుని గనక మీరు జతచేసినట్లైతే మీరు అద్భుతాలను గమనిస్తారు. పెరుగులోనున్న చర్మ సంరక్షణ గుణాలను స్వయంగా తెలుసుకుంటారు.

DIY యోగర్ట్ ఫేస్ ప్యాక్

ఒక టేబుల్ స్పూన్ యోగర్ట్

ఒక టీస్పూన్ తేనె

కొన్ని చుక్కల రోజ్ వాటర్

ఈ పదార్థాలన్నిటినీ కలిపి ఒక మిశ్రమంగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేసుకుని 20 నిమిషాలపాటు అలాగే ఉంచాలి. ఆ తరువాత శుభ్రమైన నీటితో కడగాలి. ఈ ప్యాక్ వలన చర్మం కోమలంగా తయారవుతుంది. కంటి కింద ముడతలు తగ్గుముఖం పడతాయి.

5. గ్రేప్స్

5. గ్రేప్స్

ద్రాక్షలో ఆరోగ్యానికి అవసరమైన గుణాలెన్నో ఉన్నాయి. అంతే కాదు, చర్మ సౌందర్యాన్ని పరిరక్షించే గుణాలు కూడా ద్రాక్షలో అనేకమున్నాయి. గింజలు ఉన్న ద్రాక్ష అయినా లేని ద్రాక్ష అయినా పోషక విలువలు మెండుగా ఉండే ఈ పండులో రెస్వెరత్రోల్ అనే యాంటీఆక్సిడాంట్ ఉంటుంది. ఇది కంటి కింద ముడతలను తొలగించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.

DIY గ్రేప్ ఫేస్ మాస్క్

అయిదు గ్రేప్స్

ఓక టీస్పూన్ తేనె లేదా పెరుగు

గ్రేప్స్ ని గుజ్జులా చేసుకుని అందులో తేనె లేదా పెరుగుని కలపండి. ముఖంపై ఈ మిశ్రమంతో మృదువుగా అప్లై చేసుకోండి. కాసేపటి తరువాత, గోరువెచ్చటి నీటిని తీసుకుని ముఖాన్ని శుభ్రపరుచుకోండి.

ఇప్పుడు, గ్రేప్స్ కేవలం డిజర్ట్స్ కి లేదా వైన్ కి మాత్రమే పరిమితం కాదు కంటి కింద ముడతలని తగ్గించుకోవడానికి కూడా ఉపయోగపడతాయని తెలిసింది కదూ.

6. అలో వెరా

6. అలో వెరా

అలో వెరాలో సమర్థవంతమైన స్కిన్ రిపైర్ ప్రాపర్టీస్ కలవు. అందుకే, కంటి కింద ముడతలను తగ్గించడంలో అలోవెరా ప్రధాన పాత్ర పోషిస్తుంది. విటమిన్ సీ, ఈ మరియు బీటా కెరోటిన్ లు పుష్కలంగా కలిగిన అలో వేరే చర్మసౌందర్యాన్ని కాపాడడంలో అద్భుతమైన పనితనం చూపిస్తుంది. చర్మాన్ని మృదువుగా, కోమలంగా మార్చి తగిన నిగారింపుని అందిస్తుంది అలోవెరా. అలోవెరాని నేరుగా చర్మంపై అప్లై చేయవచ్చు లేదా తేనెతోగాని పసుపుతో గాని కలిపి చర్మంపై అప్లై చేయవచ్చు. హైడ్రేషన్ ప్రాపర్టీస్ అలోవెరాలో పుష్కలంగా ఉంటాయి. అందువల్ల, చర్మం పోగొట్టుకున్న దృఢత్వాన్ని తిరిగి పొందేందుకు అలోవెరా ఎంతగానో ఉపయోగపడుతుంది. తద్వారా అండర్ ఐ బ్యాగ్స్ ను అలాగే కంటి కింద ముడతలను తగ్గించుకోవచ్చు.

DIY అలోవెరా ఫేస్ ప్యాక్

2:1:4 నిష్పత్తిలో అలోవెరా, పెరుగు మరియు దోసకాయ రసాన్ని కలపాలి.

ఈ మిశ్రమంతో చర్మంపై సర్క్యూలర్ మోషన్ లో 10 నిమిషాలపాటు మృదువుగా మసాజ్ చేయాలి.

20 నిమిషాల తరువాత నీటితో ముఖాన్ని శుభ్రపరచుకోవాలి.

7. మిల్క్ పౌడర్

7. మిల్క్ పౌడర్

మిల్క్ పౌడర్ లో సహజసిద్ధమైన ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్ అయిన లాక్టిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటుంది. అందువలన, ఈ పదార్ధం చర్మంపైనున్న మృతకణాలను సులువుగా తొలగిస్తుంది. అంతే కాదు, చర్మం దృఢత్వానికి అవసరమైన కొలాజెన్ స్థాయిలను పెంపొందించే లక్షణం కూడా ఈ పదార్థంలో ఉంది. అందుకే, మిల్క్ పౌడర్ కేవలం ఎముకలను దృఢంగా ఉంచడంతో పాటు చర్మసంరక్షణకు కూడా ఉపయోగపడుతుంది.

DIY మిల్క్ పౌడర్ ఫేస్ ప్యాక్

ఒక టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్

ఒక టీస్పూన్ తేనె లేదా రోజ్ వాటర్

వీటన్నిటినీ ఒక బౌల్ లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో శుభ్రంగా కడగాలి.

8. కుకుంబర్

8. కుకుంబర్

కుకుంబర్ అందించే చల్లదనాన్ని మీ కళ్ళు ఇష్టపడతాయి. యాంటీఆక్సిడాంట్ శాతం ఎక్కువగా ఉండడంచేత కుకుంబర్ మీ చర్మాన్ని దృఢంగా ఉంచడంతో పాటు కోమలంగా మృదువుగా కూడా ఉంచడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.

DIY కుకుంబర్ మాస్క్

కొంచెం పెరుగుతో కుకుంబర్ గుజ్జుని కలుపుకుని మిశ్రమంగా తయారుచేసుకోవాలి.

ఈ గుజ్జును కళ్లు మూసుకుని కంటిపైన సున్నితంగా అప్లై చేసుకోవాలి.

20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి.

ఆ తరువాత చల్లటి నీటితో శుభ్రపరచాలి.

ఈ పద్దతిని వారానికి ఒకటి లేదా రెండు సార్లు ప్రయత్నించాలి.

English summary

8 Home Remedies For Under-Eye Wrinkles: De-Crease Now

To remove under-eye wrinkles, use oils like avocado, olive, coconut, and castor; fruits like pineapple, papaya, grapes, and avocado; and herbs like fenugreek, aloe vera, and rosemary. Some of these boost collagen and elastin to keep the skin firm, while the others lock in moisture and fight free radical damage with vitamins A, C, E, and K and other antioxidants. Milk, yogurt, and finely ground coffee beans also help. Also use a good sunscreen and quit smoking.
Desktop Bottom Promotion