Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
ఎఫెక్టివ్ మొటిమలను నివారించుకోవడానికి పసుపుతో 8 సింపుల్ చిట్కాలు..!!
పసుపు ఒక మ్యాజికల్ స్పైస్ . రెగ్యులర్ గా వంటల్లో వాడే ఒక మసాలా దినుసు. ఇది వంటలకు మంచి ఫ్లేవర్ ను , కలర్ ను అందివ్వడం మాత్రమే కాదు, ఈ మసాలా దినుసులో అనేక మెడిసినల్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
పసుపు ఒక మ్యాజికల్ స్పైస్ . రెగ్యులర్ గా వంటల్లో వాడే ఒక మసాలా దినుసు. ఇది వంటలకు మంచి ఫ్లేవర్ ను , కలర్ ను అందివ్వడం మాత్రమే కాదు, ఈ మసాలా దినుసులో అనేక మెడిసినల్ వాల్యూస్ కూడా ఉన్నాయి. చర్మాన్ని సం రక్షించే పదార్దాలలో, పసుపు ఎంతో ముఖ్యమైనది. ఇది మన చర్మంలోని జిడ్డు తనాన్ని తొలగించి, దద్దుర్లు, మొటిమల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. ఇది మన చర్మాన్ని నిగారింపచేసి ఎంతో అందంగా మరియు మృదువుగా మారుస్తుంది.
స్కిన్ కంప్లెక్షన్ మెరుగుపరచడంలో ఇది గ్రేట్ గా సహాయపడుతుంది. చర్మ సమస్యల్లో సాధారణ సమస్యలైన మొటిమలు, మచ్చలు, డార్క్ స్పాట్స్ ను తొలగించడంలో గొప్పగా సహాయపడుతుంది. పసుపును ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తున్నాచి. ఈ సమస్యల్లో మొటిమలు ఒకటి. మొటిమల సమస్యను నివారించడంలో పసుపు గొప్పగా సహాయపడుతుంది.

చర్మ రంద్రాలు మూసుకుపోయినప్పుడు వాటిని శుభ్రం చేసి మొటిమలను పూర్తిగా మాయం చేస్తుంది. అనేక రకాల స్కిన్ ఇన్ఫెక్షన్స్ ను నివారించడంలో బ్యాక్టీరియాను తొలగించడంలో, చర్మంలో ఎక్సెస్ ఆయిల్ తొలగించడంలో పసుపు గొప్పగా సహాయపడుతుంది.
ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలతో పాటు, యాంటీఆక్సిడెంట్స్ కూడా గొప్పగా ఉన్నాయి, ఇది మొటిమలను నివారించడంలో, ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో గొప్పగా సహాయపడుతుంది. మొటిమలను నివారించుకోవడానికి పసుపును ఏవిధంగా ఉపయోగిస్తారో తెలుసుకుందాం..

తేనె- పసుపు:
ఒక టీస్పూన్ పసుపులో అర టీస్పూన్ తేనె మిక్స్ చేయాలి. రెండూ పేస్ట్ లా చేసి, దీన్ని చర్మం రంద్రాల మీద అప్లై చేయాలి. ఈ పేస్ట్ ను ముఖం మొత్తానికి అప్లై చేయాలి. అరగంట తర్వాత డ్రైగా మారిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. రోజుకు ఒకసారి చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

పెరుగు -పసుపు:
రెండు టేబుల్ స్పూన్ల పెరుగులో అరటీస్పూన్ పసుపు మిక్స్ చేయాలి. ఈ రెండూ బాగా మిక్స్ చేయాలి. దీన్ని మొటిమల మీద అప్లై చేసి, అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో మూడు నాలుగు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. డైరీ ప్రొడక్ట్స్ కు అలర్జీ కలిగి ఉంటే, ఈ రెమెడీని ఉపయోగించకండి.

వేప -పసుపు:
10 వేప ఆకులు, 1/4 టీస్పూన్ పసుపు తీసుకోవాలి. వేపఆకులను వేడి నీటిలో వేసి కొద్దిసేపటి తర్వాత వాటి బయటకు తీసి మొత్తగా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ కు కొద్దిగా పసుపును కలపాలి. ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేయాలి. డ్రైగా మారిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

నిమ్మ -పసుపు :
ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసంలో అరటీస్పూన్ పసుపు మిక్స్ చేయాలి. ఈ రెండు పదార్థాలను మిక్స్ చేసి మొటిమల మీద అప్లై చేయాలి. 15 నిముషాల తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి. రోజుకు ఒకసారి చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

శెనగపిండి, పసుపు:
ఒక టీస్పూన్ శెనగపిండిలో 2 టీస్పూన్ల శెనగపిండి, 3 టీస్పూన్ల రోజ్ వాటర్ మిక్స్ చేయాలి. మెత్తగా పేస్ట్ చేసి, మొటిమల మీద అప్లై చేయాలి. 20 నిముషాల తర్వాత ముఖంను శుభ్రం చేసుకోవాలి. వారంలో రెండు సార్లు వేసుకుంటే గొప్ప ఫలితం ఉంటుంది.

. గంధం -పసుపు:
2 టేబుల్ స్పూన్ల గందం పౌడర్లో 1/2 టీస్పూన్ పసుపును , రోజ్ వాటర్ మిక్స్ చేసి పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ను మొటిమల మీద అప్లై చేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఈ బమాస్క్ ను వారంలో రెండు సార్లు వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

పాలు, పసుపు:
అరటీస్పూన్ పసుపును 2 టేబుల్ స్పూన్ల పాలతో మిక్స్ చేయాలి. కాటన్ బాల్ డిప్ చేసి ముఖం మీద అప్లై చేయాలి. 10 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ చిట్కాను రోజు విడిచి రోజు అప్లై చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

అలోవెర -పసుపు:
రెండు టేబుల్ స్పూన్ల అలోవెర జెల్లో అరటీస్పూన్ పసుపు మిక్స్ చేసి మొటిమల మీద అప్లై చేయాలి. 10 నిముషాల తర్వాత రెగ్యులర్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి.



Click it and Unblock the Notifications