For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేసవిలో ఎండ నుండి చర్మాన్ని రక్షణ కల్పించే నేచురల్ పదార్థాలు

వేసవికాలంలో చెమట వల్ల ఒంట్లో నీటిని కోల్పోవడం వల్ల డీహైడ్రేషన్ కు గురికావల్సి ఉంటుంది. అధిక చెమట, శరీరంలో నీటి శాతం తగ్గడం వల్ల మన శరీరంలో సాల్ట్ కంటెంట్ తగ్గి అది మనల్ని డీహైడ్రేషన్ కు గురిచేస్తుంది.

|

వేసవిలో చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే హైడ్రేషన్ చాలా అవసరం. శరీరంలో నీరు తగ్గిపోతే, చర్మం డ్రైగా మారుతుంది.దాంతో చర్మం చూడటానికి డల్ గా కనబడుతుంది. వేసవి కాలంలో శరీరం డీహైడ్రేషన్ కు గురికావడం చాలా సాధారణం. సూర్యుని తాపానికి, అధిక వేడితో శరీంలోని నీరంత చెమట రూపంలో బయట విసర్జించబడి శరీరం నీటిశాతాన్ని కోల్పోతుంది. కాబట్టి మీ శరీరం వేసవి వేడి నుండి ఉపశమనం పొందాలి. వేసవికాలంలో చెమట వల్ల ఒంట్లో నీటిని కోల్పోవడం వల్ల డీహైడ్రేషన్ కు గురికావల్సి ఉంటుంది. అధిక చెమట, శరీరంలో నీటి శాతం తగ్గడం వల్ల మన శరీరంలో సాల్ట్ కంటెంట్ తగ్గి అది మనల్ని డీహైడ్రేషన్ కు గురిచేస్తుంది.

దాంతో చర్మం మరింత నిర్జీవంగా తయారవుతుంది. కాబట్టి డీహైడ్రేషన్ ను రీ హైడ్రేషన్ చేసుకోవడానికి వంద శాతం చౌకైన మార్గాలున్నాయి. వీటిని కనుక రెగ్యులర్ గా ఫాలో అయితే, చర్మం హైడ్రేషన్ లో ఉంటుంది. మరియు పిహెచ్ బ్యాలెన్స్ అవుతుంది.

ఈ చౌకైన పదార్థాలో యాంటీఆక్సిడెంట్స్ మరియు న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి. ఇవి మిమ్మల్నీ హెల్తీగా మార్చుతుంది. ముఖ్యంగా వేసవి సీజన్ లో శరీరానికి కావల్సి హైడ్రేషన్ ను అందిస్తుంది . మరి ఇంకెందుకు ఆలస్యం,వేసవి ఇటు ఆరోగ్యాన్ని, అటు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరిచే ఆ పవర్ ఫుల్ నేచురల్ రెమెడీస్ గురించి తెలుసుకుందాం..

అలోవెర జెల్ :

అలోవెర జెల్ :

అలోవెర జెల్ల చర్మానికి స్మూతింగ్ ఎఫెక్ట్స్ ను కలిగిస్తుంది. అధిక ఉష్ణోగ్రతలు, అధిక వేడి నుండి చర్మాన్ని కాపాడుతుంది. అలోవెరజెల్ ను చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మం చల్లగా ఉంటుంది. సూర్యుని వేడి నుండి చర్మాన్ని సంరక్షిస్తుంది.

కీరోదసకాయ

కీరోదసకాయ

కీరదోసకాయలో ఉండే కూలింగ్ లక్షణాలు వేసవిలో చర్మాన్ని హెల్తీగా ఉంచుతుంది. కీరదోసకాయను రెగ్యులర్ డైట్ లో చేర్చుకొని తినడం మాత్రమే కాదు, కీరదోసకాయను బ్యూటి కోసం కూడా ఉపయోగించుకోవచ్చు. దాంతో స్కిన్ ఫ్రెష్ గా ఉంటుంది.

టమోటో గుజ్జు

టమోటో గుజ్జు

టమోటోలో 93% వాటర్ ఉంది, మరియు ఇందులో యాంటీఆక్సిడెంట్స్, లైకొపిన్ పుష్కలంగా ఉండి శరీరం నుండి టాక్సిన్స్ ను శుభ్రపరచడానికి వయస్సు మీదపడకుండా కాపాడుతుంది.టమోటో గుజ్జును ముఖానికి అప్లౌ చేయడం వల్ల చర్మంలో అద్బుత మార్పులు కనబడుతాయి. ముఖ్యంగా వేసవిలో టమోటోలో అద్భుత ప్రయోజనాలున్నాయి. ఇది చర్మంలోని పిహెచ్ లెవల్స్ ను మెయింటైన్ చేస్తుంది. స్కిన్ ఫ్రెష్ గా, క్లీన్ గా , హైడ్రేషన్ లో ఉంటుంది.

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్

కొద్దిగా ఆలివ్ ఆయిల్ ను చర్మానికి అప్లై చేయాలి. ముఖ్యంగా వేసవి సీజన్ లో ఆలివ్ ఆయిల్ ను స్కిన్ కు అప్లై చేయడం వల్ల, ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ హాటీ, హుముడిటిని నుండి చర్మానికి రక్షణ కల్పిస్తుంది. స్కిన్ స్ట్రక్చర్ మెరుగుపరుస్తుంది.

తేనె

తేనె

తేనె మరో ఎక్సలెంట్ నేచురల్ రెమెడీ. దీన్ని వేసవిలో డైలీ స్కిన్ కేర్ లో ఉపయోగించడం వల్ల చర్మానికి గ్రేట్ గా సహాయపడుతుంది. తేనె చర్మంలోని మలినాలను తొలగిస్తుంది. రేడియంట్ స్కిన్ అందిస్తుంది.

అవొకాడో

అవొకాడో

అవొకాడోలో విటమిన్స్ మరియు న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి. ఇది స్కిన్ హెల్తీగా మార్చుతుంది,. మొటిమలను మచ్చలను తొలగిస్తుంది. స్కిన్ బ్రేక్ అవుట్స్ ను నివారిస్తుంది. అవొకాడో ప్యాక్ ను వారంలో మూడు రోజులు వేసుకుంటే అద్భుత ప్రయోజనం ఉంటుంది.

బొప్పాయి గుజ్జు

బొప్పాయి గుజ్జు

బాగా పండిన బొప్పాయి గుజ్జు తీసుకుని చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మం చల్లటా తేమగా ఉంటుంది. దీన్ని నేరుగా చర్మానికి అప్లై చేయడం వల్ల డీహైడ్రేషన్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. చర్మం కూల్ గా మారుతుంది.

రోజ్ వాటర్

రోజ్ వాటర్

రోజ్ వాటర్ ఒక నేచురల్ పదార్థం ఇది డీహైడ్రేషన్ ను నివారిస్తుంది. చర్మానికి కావల్సిన హైడ్రేషన్ అందిస్తుంది. రోజ్ వాటర్ ను స్ప్రే బాటిల్లో నింపి చర్మానికి అప్పుడప్పుడు స్ప్రే చేయడం వల్ల చర్మం ఫ్రెష్ గా మరియు క్లీన్ గా మారుతుంది.

యాపిల్ సైడర్ వెనిగర్

యాపిల్ సైడర్ వెనిగర్

యాపిల్ సౌడర్ వెనిగర్ లో ఉండే ఎసిటిక్ యాసిడ్ చర్మంలో ఫిహెచ్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేయడానికి గ్రేట్ గా సహాయపడుతుంది. దాంతో చర్మం ఎప్పుడూ హైడ్రేషన్ లో ఉంటుంది. దీన్ని నీళ్లతో కలిపి చర్మానికి అప్లై చేయాలి.

English summary

9 Natural Ingredients To Keep Your Skin Hydrated During The Summer Season

Get to know about the simple remedies that you could try at home to keep your skin hydrated during the dry summer months.
Story first published: Monday, April 10, 2017, 12:45 [IST]
Desktop Bottom Promotion