For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వింటర్ స్కిన్ కేర్ కోసం అన్ని రకాల ఆలివ్ ఆయిల్ పేస్ మాస్క్స్!

ఆలివ్ ఆయిల్ అనేది అత్యంత విలువైన సహజ పదార్ధంగా ఉంది, ఇది చర్మం సంబంధిత సమస్యల యొక్క ఆధిపత్యం కోసం శతాబ్దాలుగా ఉపయోగించబడింది..

By Ashwini Pappireddy
|

ఆలివ్ ఆయిల్ అనేది అత్యంత విలువైన సహజ పదార్ధంగా ఉంది, ఇది చర్మం సంబంధిత సమస్యల యొక్క ఆధిపత్యం కోసం శతాబ్దాలుగా ఉపయోగించబడింది.

ఆలివ్ ఆయిల్ అనేది అనేక రకాల సహజ లక్షణాలతో నిండి ఉంటుంది. దీనిని కొన్ని శతాబ్దాలుగా చర్మ సంబంధిత సమస్యల కు గొప్ప ఔషధంగా ఉపయోగిస్తున్నారు.

ఫైటోస్టెరోల్స్, పోలిఫెనోల్స్ మరియు విటమిన్ ఇ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధంగా నిండివుంటుంది. ఆలివ్ నూనెను చర్మ సంబంధిత సమస్యలకోసం చికిత్స చేస్తున్నప్పుడు ఇది మీ చర్మం యొక్క స్థితిని గణనీయంగా మెరుగుపరుస్తుంది.

Face Masks For Winter Skin Care

అన్ని సహజమైన లక్షణాలతో నిండివున్న ఈ నూనె ఏడాది పొడవునా ఉపయోగించబడుతుంది; అయితే, ముఖ్యంగా ఇది శీతాకాలంలో, పొడి బారిన మరియు ఇతర చర్మ సమస్యలను నివారించడంలో ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది.

ఆలివ్ నూనెలోవుండే మంచి లక్షణాలు మీ చర్మాన్ని పోషించడంలో ఉపయోగపడతాయి

మరియు అన్ని సమయాలలో మీ చర్మాన్ని పొడిబారనివ్వకుండా చేసి తేమగా ఉండేలా చేస్తుంది మరియు బాగా హైడ్రేట్ చేస్తుంది.

శీతాకాలంలో మీ చర్మం పొడిబారనివ్వకుండా కాపాడుకోవడానికి ప్రతి రోజూ పడుకోబోయే ముందు ఈ నూనెని మీ చర్మానికి రాసుకొని మసాజ్ చేయడం ఉత్తమమైన మార్గం. ఇంకా మీ చర్మాన్ని శీతాకాలం మొత్తం అందంగా వుంచుకోవడానికి ఆలివ్ నూనెని వివిధరకాలుగా ఉపయోగించవచ్చు.

ఇక్కడ, మేము కొన్ని ఇతర ప్రయోజనకరమైన పదార్థాల తో ఆలివ్ నూనె ని కలపడం ద్వారా పొందే ఇతర మాస్క్ ల గురించి మరింత తెలుసుకుందాం.

వీటిని ప్రయత్నించి మరియు శీతాకాలంలో మీ చర్మం పొడిబారనివ్వకుండా కాపాడుకోండి.

1. ఆలివ్ ఆయిల్ + తేనె

1. ఆలివ్ ఆయిల్ + తేనె

తేనె మరియు ఆలివ్ నూనె కలయిక మీ చర్మం కోసం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీనిని ఉపయోగించడంవలన ప్రకాశవంతమైన మరియు అందమైన చర్మాన్ని మీ సొంతం చేసుకోవచ్చు.

తయారీ విధానం:

- ఒక చిన్న బౌల్ లో 1 టీస్పూన్ తేనె మరియు ఆలివ్ నూనె లను కలపండి.

- ఇప్పడు ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి 10 నిముషాల పాటు ఆరనివ్వండి.

- బాగా ఆరిన తరవాత గోరువెచ్చని నీటితో కడిగేయండి.

- ఉత్తమ ఫలితాల కోసం ఈ మాస్కని వారానికి 2-3సార్లు ఉపయోగించండి.

2.ఆలివ్ ఆయిల్ + అరటి

2.ఆలివ్ ఆయిల్ + అరటి

ఆలివ్ నూనెని చర్మానికి అధిక ప్రయోజనాలని అందించే విటమిన్ B6 లక్షణాలతో అధికంగా నిండివున్న అరటి పండుని కలిపి మీ చర్మానికి వాడడంవలన అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఇది మీ చర్మాన్ని సమర్థవంతంగా మెరిసేలా చేసి మరియు అది బాగా మోయిస్తూరిజ్ ని అందిస్తుంది.

తయారీ విధానం:

- బాగా పండిన ఒక అరటి పండుని మాష్ చేసి దానికి ఒక టేబుల్ స్పూన్ తేనెని కలపండి.

- దీనిని మీ ముఖం మరియు మెడపై రాసుకొని, దానిని 20 నిముషాల పాటు వదిలేయండి.

- బాగా ఆరిన తరవాత మీ చర్మాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి.

- ఈ మాస్క్ ని వారానికి ఒకసారి వుపయోగించి మంచి ఫలితాలని పొందండి.

3. ఆలివ్ ఆయిల్ + మెంతులు

3. ఆలివ్ ఆయిల్ + మెంతులు

ఈ ప్రత్యేకమైన మాస్క్ వయస్సు పైబడినట్లు కనిపించే వారికోసం సిఫార్సు చేయబడింది. సుదీర్ఘకాలంలో ముడుతలతో మరియు సున్నితమైన మచ్చల వంటి వృద్ధాప్య సంకేతాలను పోగొట్టడానికి చలికాలంలో దీనిని ఉపయోగించండి.

తయారీ విధానం:

- ఒక చిన్న గిన్నెలో రాత్రి పడుకోబోయే ముందు కొన్ని మెంతులని నీటిలో నానబెట్టి ఉదయాన్నే నీటిని వడగట్టి వాటిని మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకోవాలి.

- ఇప్పడు ఈ పేస్ట్ కి 1 టీస్పూన్ ఆలివ్ నూనె ని కలపండి.

- దీనిని మీ చర్మానికి రాసుకొని కాస్సేపు మసాజ్ చేసుకోండి మరియు 5 నిమిషాల పాటు

ఆరనివ్వండి.

- కాస్సేపటి తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయండి.

4. ఆలివ్ ఆయిల్ + ఎగ్ వైట్

4. ఆలివ్ ఆయిల్ + ఎగ్ వైట్

ఈ సహజ లక్షణాలతో నిండివున్న ఆలివ్ నూనె మాస్క్ మీ చర్మాన్ని బిగించి, చలికాలంలో చల్లని గాలిని నిరోధించడానికి సహాయపడుతుంది మరియు ఎగ్ వైట్ వృద్ధాప్య సంకేతాలను పోగొడుతుంది.

తయారీ విధానం:

- ఒక గిన్నెలోతెల్ల గుడ్డుని తీసుకొని మరియు 1 టేబుల్ స్పూన్ ఆలివ్ నూనెని దానికి జోడించండి.

- ఒక మృదువైన పేస్ట్ లా సిద్ధం అవడానికి దీనిని బాగా కలపాలి.

- తర్వాత మీ ముఖం మరియు మెడ మీద ఈ పేస్ట్ ని మంద పాటి మాస్క్ లాగా రాయాలి.

- 10 నిముషాలపాటు మీ చర్మం మీద ఉండనిచ్చి తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి.

- గొప్ప ఫలితాలను పొందడానికి ప్రతి వారంలో ఈ మాస్క్ ఉపయోగించండి.

5. ఆలివ్ ఆయిల్ + అవోకాడో

5. ఆలివ్ ఆయిల్ + అవోకాడో

మీ ఇంట్లో ఉండే ఆలివ్ నూనె పేస్ మాస్క్ మీ చర్మాన్ని శీతాకాలంలో పొడిబారనివ్వకుండా మరియు తేమగా ఉండటానికి సహాయపడుతుంది.

తయారీ విధానం:

- ఒక అవోకాడో ని తీసుకొని బాగా మాష్ చేసి మరియు దానికి 2 టీస్పూన్స్ఆలివ్ నూనె ని

కలపాలి.

- మీ ముఖం దీనిని రాసుకొని 10 నిముషాల పాటు ఉంచండి.

- ఆరిన తరవాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి.

- గుర్తించదగ్గ ఫలితాలు కోసం నెలకు కనీసం 2-3 సార్లు ఈ మాస్క్ ని వాడండి.

6.ఆలివ్ ఆయిల్ + గ్లిజరిన్

6.ఆలివ్ ఆయిల్ + గ్లిజరిన్

శీతాకాలంలో మీ చర్మం అందం నాశనం చేయకుండా వికారమైన చర్మాన్ని పొందకుండా ఆలివ్ నూనె మరియు గ్లిసరిన్ కలయిక కాపాడుతుంది.

తయారీ విధానం:

- 1 టేబుల్ స్పూన్ ఆలివ్ నూనెతో ½ టీస్పూన్ గ్లిజరిన్ ని కలపండి

- దీనిని మీ ముఖం మరియు మెడ మీద రాసుకోండి

- గోరు వెచ్చని నీటితో శుభ్రం చేయడానికి ముందు 10 నిమిషాల పాటు ఉండనివ్వండి.

- ఈ మిశ్రమాన్ని ప్రతినెలా ఉపయోగించడం వలన మీ చర్మం నిగారిస్తూ ఉంటుంది.

7.ఆలివ్ ఆయిల్ - ఆల్మాండ్ ఆయిల్ + గ్రామ్ ఫ్లోర్(శనగ పిండి)

7.ఆలివ్ ఆయిల్ - ఆల్మాండ్ ఆయిల్ + గ్రామ్ ఫ్లోర్(శనగ పిండి)

బాదం నూనె లో విటమిన్ ఎ అధిక మొత్తంలో ఉంటుంది మరియు శనగ పిండి లో ఆంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగివుంటుంది. ఆలివ్ నూనె మీ చర్మం రంధ్రాల శీతాకాలంలో మలినాలతో నిండకుండా

ఫ్రీగా ఉండడానికి సహాయపడుతుంది. ఈ మూడింటి కలయిక అద్భుతమైన ఫలితాలనిస్తుంది.

తయారీ విధానం:

-1 టీస్పూన్ ఆలివ్ నూనె మరియు బాదం నూనె ½ టీస్పూన్ శనగ పిండి తో కలిపి

మీ చర్మంపై కాస్సేపు మర్దనా చేయండి.

- గోరువెచ్చని నీటితో శుభ్రం చేయడానికి ముందు దానిని10-15 నిమిషాల పాటు వదిలివేయండి.

- ఉత్తమ ఫలితాల కోసం కనీసం వారానికి ఒకసారి ఈ ఆలివ్ నూనె మాస్క్ ని ఉపయోగించండి.

English summary

All-natural Olive Oil Face Masks For Winter Skin Care

Having a stable heartbeat is very important for the normal body functioning. Any irregularity in the heartbeat can cause serious heart problem, and in addition, it can also lead to other major health issues. According to a new research, higher levels of thyroid hormone in the blood has been found to increase the risk of having an irregular heartbeat..
Desktop Bottom Promotion