For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రకాశవంతమైన ఛాయ & తాజా చర్మాన్ని వెనిలా ఫేస్ స్క్రబ్స్ తో మీ సొంతం చేసుకోండి

వెనీలా అనేది కేకులలో ఉపయోగించే ముఖ్యమైన ఫ్లేవర్ అని మనందరికీ బాగా తెలుసు. కానీ మంచి ఫ్లేవర్ తో పాటు ఇందులో చర్మం యొక్క రంగు ని మార్చే లక్షణాలతో నిండి ఉంటుందనే విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు.

By Ashwini Pappireddy
|

మీ చర్మం తెల్లబడటానికి మరియు తాజాగా ఉండటానికి కావాల్సిన అన్ని రకాల వెనీలా ఫేస్ స్క్రబ్స్!

వెనీలా అనేది కేకులలో ఉపయోగించే ముఖ్యమైన ఫ్లేవర్ అని మనందరికీ బాగా తెలుసు. కానీ మంచి ఫ్లేవర్ తో పాటు ఇందులో చర్మం యొక్క రంగు ని మార్చే లక్షణాలతో నింవుండదనే విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు.

ఇది శోథ నిరోధక లక్షణాలకు మరియు అనామ్లజనకాల తో నిండివుంటుంది, వనిల్లా మీ చర్మం యొక్క మొత్తం ఆరోగ్యాన్ని మరియు రంగుని పెంచుతుంది.

face scrubs to brighten skin

తరచుగా బాగా చికాకు చెందిన మీ చర్మం కోసం దీనిని ఉపయోగిస్తారు, ఇది మీ చర్మ సంరక్షణ పదార్ధంగా కూడా ఉపయోగపడి మీరు ఒక ప్రకాశవంతమైన ఛాయతో సాధించడానికి సహాయపడుతుంది. ప్రత్యేకంగా వెనిలా ఇతర సహజ పదార్ధాలను కలిపి పేస్ ప్యాక్ రూపంలో ఉపయోగించినప్పుడు, ఇది మీ చర్మంపై సహజమైన ప్రకాశాన్ని అందజేస్తుంది మరియు ఇది మీ ముఖాన్ని ప్రకాశవంతమైనదిగా మరియు తాజాగా కనిపించేలా చేస్తుంది.

ఇవాళ బోల్ద్ స్కైలో, మనం ఇంట్లోనే ఎంతో సులభంగా తయారు చేయగల చర్మాన్ని ప్రకాశవంతంగా చేసే వెనిలా స్క్రబ్స్ గురించి ఇప్పడు మనం తెలుసుకుందాం..

ఈ ఇంట్లో తయారు చేసిన స్క్రబ్ లతో మీ చర్మాన్ని శుద్ధి చేయటం వలన మీరు ఎప్పుడైనా కోరుకున్న చర్మాన్ని పొందడంలో సహాయపడుతుంది.

మరి అవేంటో తెలుసుకుందామా..

రెసిపీ # 1

రెసిపీ # 1

మీరు అవసరమైన పదార్థాలు:

1/2 టీస్పూన్ వెనీలా సారం

1 టీస్పూన్ ఓట్మీల్

1టేబుల్ స్పూన్ రోజ్ వాటర్

ఎలా ఉపయోగించాలి:

పైన తెలిపిన విధంగా అన్ని పరిమాణంలో తీసుకొని స్కర్బ్ లాగ తయారవడానికి బాగా కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీ ముఖం మీద రాసి కాస్సేపు మర్దనా చేయండి. తరువాత గోరువెచ్చని నీటితో దీనిని కడిగేయండి మరియు మీకు ఇష్టమైన చర్మపు టోనర్ను ఉపయోగించండి.

రెసిపీ # 2

రెసిపీ # 2

మీకు కావాల్సిన పదార్థాలు:

1/3 టీస్పూన్ జాజికాయ పొడి

½ టీస్పూన్ వెనిలా సారం

ఎలా ఉపయోగించాలి:

స్క్రబ్బింగ్ పదార్థం సిద్ధంగా అవడానికి ముందుగా ఒక గిన్నెలో పైన తెలిపిన పరిమాణంలో తీసుకొని బాగా కలపాలి. ఇప్పడు దీనిని మీ ముఖం మీద రాసి, ఒక 5 నిమిషాలు పాటు మర్దనా చేసి తర్వాత కడిగేయండి అంతే.

రెసిపీ # 3

రెసిపీ # 3

మీకు కావాల్సిన పదార్థాలు:

1 టీస్పూన్ వెనిలా సారం

1 టీస్పూన్ బ్రౌన్ షుగర్

1 టీస్పూన్ నిమ్మరసం

ఎలా ఉపయోగించాలి:

పైన తెలిపిన అన్ని భాగాలను ఒకదానితో ఒకటి కలపడం ద్వారా ఈ స్కర్బ్ ని చేయండి. మీ ముఖం మీద దీనిని పలుచని పొర లా రాసుకోండి మరియు కొంచం సేపు మర్దనా చేయండి

అవశేషాలను కడగడానికి గోరువెచ్చని నీరు వాడండి.

రెసిపీ # 4

రెసిపీ # 4

మీకు అవసరమైనవి:

1 టీస్పూన్ వెనిలా సారం

1 టీస్పూన్ కాఫీ గ్రౌండ్స్

1 రోజ్ వాటర్ టేబుల్

ఎలా ఉపయోగించాలి:

పైన తెలిపిన విధంగా ఒకదానితో ఒకటి అన్ని పదార్ధాలను మిళితం చేయండి. ఫలితంగా ఏర్పడిన దానితో మీ ముఖం మొత్తం రాసుకొని 5 నిమిషాలు మీ చేతివేళ్ళతో శాంతముగా మర్దనా చేయండి. తర్వాత ఒక తేలికపాటి పేస్ వాష్ తో మరియు వెచ్చని నీటితో మీ ముఖాన్ని కడిగేయండి.

రెసిపీ # 5

రెసిపీ # 5

మీరు కావాల్సినవి:

½ టీస్పూన్ వెనిలా సారం

2 టీస్పూన్ల ఆలివ్ ఆయిల్

1 టీస్పూన్ కోకో పౌడర్

ఎలా ఉపయోగించాలి:

పైన పేర్కొన విధంగా అన్ని పదార్థాలను కలిపి మరియు పేస్ట్ లాగ సిద్ధం అవడానికి కాసేపు వదిలేయండి.ఇప్పడు దీనిని మీ ముఖ చర్మంపై రాసుకోండి మరియు సుమారు 5 నిమిషాలు అక్కడ వదిలివేయండి. ఇలా ఒకసారి చేసిన తరువాత, స్క్రబ్ చేయడానికి మీ చేతివేళ్లు ఉపయోగించండి. కాసేపటి తరువాత వెచ్చని నీటితో మీ ముఖాన్ని కడిగేయండి.

రెసిపీ # 6

రెసిపీ # 6

మీకు అవసరమైనవి:

2-3 బ్లూబెర్రీస్

1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె

1 టీస్పూన్ వెనిలా సారం

ఎలా ఉపయోగించాలి:

ఒక గాజు గిన్నె తీసుకొని, దానిలో బ్లూబెర్రీస్ వేసి పూర్తిగా వాటిని క్రష్ చేయండి. ఇప్పడు మిగిలిన 2 పదార్థాలను వేసి కలపండి. దీనిని మీ ముఖం మీద రాసుకొని మరియు కొద్ది నిమిషాల పాటు శాంతంగా మర్దనా చేసితర్వాత, మీ ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి.

రెసిపీ # 7

రెసిపీ # 7

అవసరమైనవి:

½ టీస్పూన్ శనగపిండి

1 టీస్పూన్ వెనిలా సారం

2 టీస్పూన్ల గ్రీన్ టీ

ఎలా ఉపయోగించాలి:

ఒక గిన్నె లో, అన్ని పైన పేర్కొన్న పదార్థాలను చేర్చి మరియు వాటిని బాగా కలపాలి.

మీ ముఖం మీద దీనిని రాసి శాంతముగా 5-10 నిమిషాలు మర్దనా చేయండి తరువాత, గోరువెచ్చని నీటితో కడిగేయండి. ఉత్తమ ఫలితాల కోసం మీ ముఖం మీద రోజ్ నీటిని రాసుకోవచ్చు.

English summary

face scrubs to brighten skin | face scrubs | vanilla face scrub | face scrub to refresh the skin

A powerhouse of anti-inflammatory properties and antioxidants, vanilla can boost your skin's overall health and appearance. Often used for soothing irritated skin, this skin care ingredient can also help you achieve a brighter complexion.
Story first published:Thursday, December 14, 2017, 16:01 [IST]
Desktop Bottom Promotion