For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వింటర్లో డ్రై స్కిన్ నివారణకు 5 సింపుల్ న్యాచురల్ ఫేస్ ప్యాక్స్

By Mallikarjuna
|

చలికాలం వచ్చిందంటే.. చలితో వణికిపోవడం మాత్రమే కాదు.. చర్మం కూడా పొడిబారిపోయి చికాకు తెప్పిస్తుంటుంది. మాయిశ్చరైజర్ రాసుకున్నా.. ఏమాత్రం ఫలితం కనిపించదు. ముఖంపై చర్మం మరీ పొడిబారుతుంది. అలాగే పెదాల చుట్టూ చర్మం తెల్లగా మారిపోయి.. అసహ్యంగా కనిపిస్తుంది. ఈ సమస్య ఏ ఒక్కరికో పరిమితం కావడం లేదు. చలికాలం వచ్చిందంటే.. అందరినీ వెంటాడే సమస్య ఇది.

మన చర్మం చాలా సున్నితమైనది. చర్మం పైపొరల్లో నూనెలు మరియు మాయిశ్చరైజర్ కలిగి ఉంటుంది. ఇది చర్మంలోపలి పొరకు రక్షణ కల్పిస్తాయి. కఠినమైన పొడి, తడి గాలుల వల్ల చర్మంలో తేమ తగ్గిపోయి, చర్మం పగుళ్ళకు కారణం అవుతుంది. దాంతో చర్మం డ్రైగా దురదగా అనిపిస్తుంది. ఆయిల్ గ్రంథుల్లో కూడా చురుకుదనం తగ్గుతుంది. తక్కువ ఆయిల్ ఉత్పత్తి అవుతుంది. వంటిర్లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది.

Amazing remedies to cure Dry Skin

వింటర్లో డ్రై స్కిన్ వల్ల అనేక సమస్యలు వస్తాయి. చర్మంలో దురద, ఇన్ఫ్లమేషన్, ఉన్ని దుస్తులు దరించడానికి కూడా కష్టం అవుతుంది. డ్రై స్కిన్ కూడ నిర్జీవంగా, డల్ గా కనబడుతుంది. కొన్ని సందర్భాల్లో చర్మం ఎక్కువగా పగలడం వల్ల చర్మం క్రాక్స్ ఏర్పడుతాయి. దాంతో వాటిల్లోకి కంటికి కనబడని క్రిముల చేరడానికి సులభం అవుతుంది.

వింటర్లో చర్మ సంరక్షణ కోసం తీసుకునే మాయిశ్చరైజర్లు ఇన్ స్టాంట్ గా మాత్రమే పనిచేస్తాయి. అయితే మాయిశ్చరైజర్స్ కూడా చర్మం తత్వాన్ని బట్టి ఎంపిక చేసుకోవాలి. ఇలా చేయడంలో చాలా మందికి కష్టం అనిపించవచ్చు.అలాగే ఎక్కువ కఠినమైన క్రీమ్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ తీసుకోవడం వల్ల చర్మం రంద్రాలను మూసుకోపేల చేసి, మొటిమలకు దారిస్తుంది. అందువల్ల వింటర్లో మీ చర్మానికి సరిపోయే వాటిని ఎంపిక చేసుకోవాలి.

వింటర్లో డ్రై స్కిన్ స్మూత్ గా, నిగారిస్తూ ఉండాలంటే.. తగిన జాగ్రత్తలు తీసుకుంటాం. అయితే చలికాలంలో ఇది అసాధ్యమని చాలా మంది ఫీలవుతూ ఉంటారు. ఎందుకంటే.. చర్మం పొడిబారి నిర్జీవంగా మారిపోతుంది కాబట్టి. కానీ.. ఇంట్లోనే చక్కటి రెమిడీస్ ఫాలో అవడం వల్ల ఈ సమస్యకు గుడ్ బై చెప్పవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

1) అలోవెరా జెల్

1) అలోవెరా జెల్

పొడిబారిన చర్మానికి త్వరిత ఉపశమనం కలిగించడానికి అలోవెరా జెల్ చక్కటి పరిష్కారం. అలోవెరా జెల్ లో ఉండే యాసిడ్స్ డెడ్ స్కిన్ సెల్స్ ని నాశనం చేస్తాయి. కాబట్టి న్యాచురల్ గా లభించే ఆలోవెరా మొక్క తీసుకుని దాన్ని కట్ చేస్తే జెల్ వస్తుంది. దాన్ని ముఖానికి పట్టించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

2) బొప్పాయి ఫేస్ ప్యాక్:

2) బొప్పాయి ఫేస్ ప్యాక్:

బొప్పాయలో అనేక స్కిన్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవి శీతాకాలంలో చర్మ సంరక్షణకు అద్భుతంగా సహాయపడుతాయి . ఇది చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది మరియు చర్మం టైట్ చేస్తుంది. బాగా పండిన బొప్పాయిని గుజ్జులా చేసి అందులో కొద్దిగా పాలు మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. పది నిముషాల తర్వాత శుభ్ర చేయడం వల్ల అద్భుతంగా ఉంటుంది.

3) అవొకాడకో ఫేస్ ప్యాక్:

3) అవొకాడకో ఫేస్ ప్యాక్:

అవొకాడో పండు తినడానికి మాత్రమే కాదు. అవొకాడోలో బయోటిన్ పుష్కలంగా ఉన్నందు వల్ల, దీని ఆహారంతో పాటు తీసుకోవడం వల్ల పొడిబారిన చర్మాన్ని, చిట్లిన కురులను, చిట్లిన గోళ్ళ సంరక్షణ బాగా ఉపయోగపడుతుంది. అవకాడో ఫేస్ మాస్క్ పొడిబారిన చర్మానకి చాలా ఫర్ ఫెక్ట్ గా పనిచేస్తుంది. ముఖంగా శీతాకాలంలో చర్మం పొడిబారి దురదగా ఉండటం వంటి లక్షణాలను అవకాడో ఫేస్ మాస్క్ పోగొడుతుంది. తాజాగా ఉన్న అవాకోడోను బాగా మెత్తగా చేసి దానికి ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి బాగా ముఖానికి అప్లై చేయాలి. ఈ ఫేషియల్ మాస్క్ చర్మానికి కావాలసిన మినరల్స్, విటమిన్స్, యాంటిఆక్సిడెంట్స్ అందించి చర్మాన్ని నునుపుగా మార్చుతుంది. శీతాకాలంలో చర్మం పొడిబారనీయకుండా చేస్తుంది.

4) కీరదోస కాయ:

4) కీరదోస కాయ:

కీరోదసకాయలో 80శాతం నీళ్ళు ఉంటాయి. డ్రై స్కిన్ కు ఇది బెస్ట్ చాయిస్, ఇది డ్రై స్కిన్ నివారిస్తుంది, స్కిన్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. చర్మంలో తేమను రీస్టోర్ చేస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ చర్మంను స్మూత్ గా ఉంచుతుంది. సన్ డ్యామేజ్ నుండి రక్షణ కల్పిస్తుంది. చర్మం పొడిబారిన చర్మానికి కొన్ని కీరదోసకయా ముక్కలు అప్లై చేసి రుద్దడం వల్ల కొంత వరకూ ఉపశమనం కలుగుతుంది

5) వేపనూనె:

5) వేపనూనె:

వేపనూనె యాంటీసెప్టిక్ లక్షణాలు కలది. ఇందులో మాయిశ్చరైజింగ్ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది చర్మంలో దురద, చీకాకును తొలగిస్తాయి. బ్యాక్టీరియాను తొలగిస్తుంది, ఇన్ఫెక్షన్స్ నుండి కాపాడుతుంది. వేపనూనె మార్కెట్లో అందుబాటులో ఉంటుంది,. దీన్ని తీసుకొచ్చి రెగ్యులర్ గా ఉపయోగించుకోవచ్చు. ఇది డ్రై స్కిన్ తొలగించడం మాత్రమే కాదు, చర్మానికి పోషణ కూడా అందిస్తుంది.ఈ నూనెలో ఉండే ఓమేగా ఫ్యాటీ యాసిడ్స్ స్కిన్ సెల్స్ స్ట్రాంగ్ గా ఉంచి, పోషణ అందిస్తుంది. పొడిబారకుండా చేస్తుంది

English summary

Amazing remedies to cure Dry Skin

Amazing remedies to cure Dry Skin,During winter season, home remedies are the best in getting rid of dry skin. Read to know which are the best known home remedies that can be used to treat
Desktop Bottom Promotion