For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలసిన, నిర్జీవమైన చర్మంను కాంతివంతంగా మార్చే బీట్ రూట్ ఫేస్ మాస్క్

By Lekhaka
|

ఆరోగ్యానికి సహాయపడే సూపర్ ఫుడ్స్ లో బీట్ రూట్ ఒకటి. బీట్ రూట్ జ్యూస్ రెగ్యులర్ గా తాగడం వల్ల కోలన్ శుభ్రం చేస్తుంది. రక్తం ప్యూరిఫై చేస్తుంది. రక్తప్రసరణను క్రమబద్దం చేస్తుంది. బీట్ రూట్ ను ఫేస్ మాస్క్ గా అప్లై చేస్తే చర్మం కొత్తగా కనబడుతుంది. చర్మంలో మ్రుత కణాలు తొలగిపోయి, కొత్త చర్మం ఏర్పడుతుంది??

చర్మ రంద్రాలను శుభ్రం చేసి, ష్రింక్ చేస్తుంది. చర్మంను కాంతివంతంగా ప్రకాశవంతంగా మార్చుతుంది. అంతే కాదు, ఇంకా అనేక రకాలుగా ప్రయోజనాలను అందిస్తుంది! బీట్ రూట్ లో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇది చర్మంలో కొల్లాజెన్ లెవల్స్ పెంచుతుంది, ఇది స్కిన్ ఎలాసిటి పెంచి, స్కిన్ ను సపెల్ గా, స్మూత్ గా మార్చుతుంది.

బీట్ రూట్ లో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి, ఇది స్కిన్ ఇన్ఫ్లమేషన్ నివారిస్తుంది, ఇన్ఫెక్షన్స్ కు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది, నిర్జీవమైన చర్మాన్ని తొలగిస్తుంది.ఇంకా బీట్ రూట్ విటమిన్ సి కి పవర్ హౌస్ వంటిది . ఇది ఫ్రీరాడికల్స్ ను నివారించి, స్కిన్ పిగ్మెంటేషన్ ను తొలగిస్తుంది, ముత్రకణాలను తొలగించి, క్లియర్ స్కిన్ అందివ్వడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. బీట్ రూట్ లో విటమిన్స్, మినిరల్స్ మరియు ఐరన్, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మంలోని మలినాలను తొలగిస్తుంది. డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. దాంతో చర్మం శుభ్రం పడుతుంది. చర్మం క్లియర్ గా కనబడుతుంది.

బీట్ రూట్ లో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల బీట్ రూట్ ను ఉపయోగించి చర్మంలో పింకిస్ గ్లో ను పొందవచ్చు . రెగ్యులర్ గా అప్లై చేయకపోయినా, వారంలో ఒక సారి బీట్ రూట్ స్కిన్ కు అప్లై చేస్తుంటే, చర్మంలో గులాబీ మెరుపులు పూయిస్తుతంది. అందుకోసం కొన్ని బీట్ రూట్ ఫేస్ మాస్క్ లను ఏలా వేసుకోవాలో తెలపబడినది .

బీట్ రూట్ జ్యూస్ ను వివిధ రకాల ఫేస్ ప్యాక్స్ , ఫేస్ మాస్క్ లలో ఉపయోగిస్తుంటారు. ఇది చర్మంను కాంతివంతంగామార్చుతుంది. రేడియంట్ గ్లో ఇస్తుంది. అన్ని రకాల చర్మ సమస్యలకు ఫర్ఫెక్ట్ రెమెడీ. మరి అటువంటి పవర్ ఫుల్ బీట్ రూట్ తో ఫేస్ మాస్క్ ఎలా తయారుచేసుకోవాలి. ఫర్ఫెక్ట్ కాంబినేషన్ ఎంటి అనేది తెలుసుకుందాం..

బీట్ రూట్ అండ్ మయోనైజ్ ఫేస్ మాస్క్

బీట్ రూట్ అండ్ మయోనైజ్ ఫేస్ మాస్క్

బీట్ రూట్ మయోనైజ్ ఫేస్ మాస్క్ డల్ అండ్ డ్రైడ్ స్కిన్ ను త్వరగా ప్రకాశవంతంగా మార్చుతుంది. అందుకు అరకప్పు మయోనైజ్ ను బీట్ రూట్ జ్యూస్ లో మిక్స్ చేసి. ముఖానికి మాస్క్ వేసుకోవాలి. ఈ కాంబినేషన్లో ఉండే ప్రోటీన్స్, విటమిన్స్, యాంటీఆక్సిడెంట్స్ చర్మంలో రేడియంట్ గ్లోను అందిస్తాయి.

బీట్ రూట్ అండ్ బాదం ఆయిల్ మాస్క్

బీట్ రూట్ అండ్ బాదం ఆయిల్ మాస్క్

కొన్ని బీట్ రూట్ ముక్కలు తీసుకుని మెత్తగా పేస్ట్ చేయాలి. తర్వాత ఇందులో కొద్దిగా బాదం ఆయిల్ మిక్స్ చేసి, ముఖానికి అప్లై చేసి మసాజ్ చేసుకోవాలి. ఈ బీట్ రూట్ అండ్ బాదం ఆయిల్ మాస్క్ చర్మంను కాంతివంతంగా..బ్రైట్ గా మార్చుతుంది. చర్మంలో నేచురల్ గ్లో అందిస్తుంది.

బీట్ రూట్ మరియు ముల్తానీ మట్టి ప్యాక్

బీట్ రూట్ మరియు ముల్తానీ మట్టి ప్యాక్

బీట్ రూట్ ను మెత్తగా పేస్ట్ చేసి,అందులో కొద్దిగా ముల్తానీ మట్టిని మిక్స్ చేసి, నిమ్మరసం జోడించి ఫేస్ మాస్క్ తయారుచేసి, ముఖానికి అప్లై చేయాలి. 15 నిముషాల తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. బీట్ రూట్ ముల్తానీ మట్టి ఫేస్ మాస్క్ చర్మంను కాంతివంతంగా మార్చుతుంది. చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ముఖంలో మచ్చలు, మొటిమలు తొలగిపోతాయి. చర్మం కాంతివంతంగా తయారవుతాయి.

బీట్ రూట్ అండ్ పెరుగు ఫేస్ మాస్క్

బీట్ రూట్ అండ్ పెరుగు ఫేస్ మాస్క్

బీట్ రూట్ , పెరుగు కాంబినేషన్ ఫేస్ మాస్క్ ను వేసుకోవడం వల్ల ఏజింగ్ లక్షణాలు దూరం అవుతాయి. డల్ గా ఉన్న చర్మం , ఫ్లాకీ స్కిన్ నివారించబడుతుంది. బీట్ రూట్ పేస్ట్ చేసి, అందులో అరకప్పు పెరుగు మిక్స్ చేసి, అరటీస్పూన్ పసుపు కలిపి పేస్ట్ లా చేయాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి, మసాజ్ చేయాలి. కొన్ని నిముషాల తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

బీట్ రూట్ అండ్ ఆరెంజ్ జ్యూస్ ఫేస్ మాస్క్ :

బీట్ రూట్ అండ్ ఆరెంజ్ జ్యూస్ ఫేస్ మాస్క్ :

బీట్ రూట్ జ్యూస్ ను ఆరెంజ్ జ్యూస్ తో మిక్స్ చేసి, ముఖానికి అప్లై చేయాలి. ఇది నేచురల్ సన్ స్ర్కీన్ లా పనిచేస్తుంది. ఇది చర్మానికి రక్షణ కల్పిస్తుంది. యూవీ కిరణాల నుండి రక్షణ కల్పిస్తుంది. బీట్ రూట్ లో ఉండే ఐరన్, స్కిన్ డ్యామేజ్ ను నివారిస్తుంది.

బీట్ రూట్ లెమన్ మాస్క్ :

బీట్ రూట్ లెమన్ మాస్క్ :

రెండు టీస్పూన్ బీట్ రూట్ జ్యూస్ లో రెండు టీస్పూన్ల నిమ్మరసం మిక్స్ చేసి, అలాగే రెండు టీస్పూన్ల రోజ్ వాటర్ మిక్స్ చేసి, ముఖానికి అప్లై చేయాలి. లెమన్ జ్యూస్ చర్మంలో డార్క్ నెస్, స్కిన్ పిగ్మెంటేషన్ నివారిస్తుంది. బీట్ రూట్ చర్మంను కాంతివంతంగా మరియు పింక్ గా మార్చుతుంది. రోజ్ వాటర్ ను రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల చర్మం బ్రైట్ గా మారుతుంది. చర్మానికి స్మూత్ టచ్ ఇస్తుంది.

బీట్ రూట్ , శెనగపిండి ఫేస్ మాస్క్ :

బీట్ రూట్ , శెనగపిండి ఫేస్ మాస్క్ :

బీట్ రూట్ పేస్ట్ లా చేసి అందులో శెనగిపండి, ఒక కప్పు పాలక్రీమ్, ఒక స్పూన్ గులాబీ రేకుల పొడిచేసి వేయాలి. మొత్తం మిశ్రమాన్ని పేస్ట్ లా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖాని ప్యాక్ లా వేసుకుని, కొద్ది సేపు డ్రైగా మారిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల హెల్తీ గ్లోయింగ్ స్కిన్ పొందుతారు.

బీట్ రూట్, పసుపు ఫేస్ ప్యాక్:

బీట్ రూట్, పసుపు ఫేస్ ప్యాక్:

బీట్ రూట్ , పసుపు కాంబినేషన్ ప్యాక్ నేచురల్ గ్లోను అందిస్తుంది. బ్యూటిని మెరుగుపరుస్తుంది. కొన్ని బీట్ రూట్ ముక్కలను తీసుకుని పేస్ట్ చేయాలి. అందులో పసుపు మిక్స్ చేసి, పేస్ట్ లా చేసి, ముఖానికి మాస్క్ వేసుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు, పాలు మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రంగా చేసుకోవాలి. హెల్తీ గ్లోయింగ్ స్కిన్ పొందుతారు.

English summary

Beetroot Face Masks For Distressed Skin

To rejuvenate dull skin and bring a nice glow onto it, these beetroot face masks are what you need.
Desktop Bottom Promotion