For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ చర్మసంరక్షణలో ఐస్ ను జతచేయటం వల్ల కలిగే లాభాలు

By Deepti
|

బిజీ బిజీ రోజుల వల్ల ముందే అనుకున్న చర్మసంరక్షణ పనులు, ప్లానులు ఎన్నో ఆగిపోతాయి. ఇంట్లోనే ఎంతో సమయం తీసుకునే ఫేస్ మాస్క్ లు చేయటం కూడా కష్టం. మార్కెట్లో అమ్మే ఎన్నో ఉత్పత్తులలో మీ చర్మానికి ఏమాత్రం ఉపయోగపడని రసాయనాలు ఉంటాయి. మరైతే ఇంట్లోనే మీ చర్మ ఆరోగ్యాన్ని బాగా చూసుకునే సులభ పద్ధతులేంటి?

దీనికి పరిష్కారం, మన వంటింట్లోనే ఉన్న వస్తువులను సరిగా వాడుకోటమే. వాటిల్లో మొదటిది మంచు లేదా ఐస్. ఐస్ ట్రేలలో మంచి నీరు పోసి ఫ్రిజ్ లో పెట్టండి. తర్వాత ఆ ఐస్ నే చర్మసంబంధ ఉత్పత్తిగా వాడి అద్భుత మార్పులను చూడండి.

మీ చర్మసంరక్షణలో ఐస్ ను జతచేయటం వల్ల కలిగే లాభాలు

ఐస్ ను అందాన్ని పెంపొందించుకోటానికి వాడటం ప్రాచీన కాలం నుండి వస్తున్నదే, కానీ మనం రోజూ దాన్ని వాడటం మర్చిపోయాం. కానీ సమయం లేనప్పుడు ఐస్ ను చర్మంపై రాసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

మీ ఫ్రిజ్ లో ఐస్ క్యూబ్స్ ఉంటే ఈ సమ్మర్ బ్యూటీ క్వీన్ మీరే..!!మీ ఫ్రిజ్ లో ఐస్ క్యూబ్స్ ఉంటే ఈ సమ్మర్ బ్యూటీ క్వీన్ మీరే..!!

ఐస్ ను చర్మసంరక్షణ దినచర్యలో భాగం చేయటానికి, కొన్ని పద్ధతులున్నాయి. వాటిలో పది సులభ పద్ధతులను మీకోసం కింద అందిస్తున్నాం. చదివి మీరే తేడా తెలుసుకోండి.

మేకప్ ప్రాథమిక వస్తువుగా ఐస్

మేకప్ ప్రాథమిక వస్తువుగా ఐస్

మేకప్ చేసుకునేప్పుడు, ఖరీదైన ప్రైమర్ తో కాక, ఐస్ తో మొదలుపెట్టండి. ఐస్ ఎక్కువ సమయం మేకప్ ను చర్మానికి పట్టి ఉంచేలా సాయపడుతుంది. మేకప్ వేసుకునేముందు ఐస్ ను చర్మంపై రాసుకోవటం వల్ల, మెత్తని బేస్ గా చర్మాన్ని మార్చి, తెరచిఉన్న చర్మరంధ్రాలను దగ్గరచేసి అవి కన్పించకుండా చేస్తుంది. ఐస్ ను చర్మంపై పెట్టేముందు, అదనంగా వచ్చే నీరు మీ బట్టలపై లేదా మీ ముఖం తడిగా మారకుండా శుభ్రమైన తువ్వాలు వాడండి. మీ ముఖంపై నీరు పూర్తిగా ఆరాక మాత్రమే మేకప్ ను వేయండి. లేకపోతే మొదట వేసే ఫౌండేషన్ లేదా మాయిశ్చరైజర్ అట్టలు కడుతుంది.

ఫేస్ మిస్ట్ గా ఐస్

ఫేస్ మిస్ట్ గా ఐస్

ఫేస్ మిస్ట్ మీ ముఖాన్ని అప్పటికప్పుడు తాజాగా కనపడేలా చేస్తుంది. ఉదాహరణకి మీ ఆఫీసులో అనుకోకుండా వెంటనే మీటింగ్ కానీ జరగబోతుంది, మరియు మీరు హుందాగా, మంచిగా కన్పించాలనుకోండి, అప్పుడు ఈ ఫేస్ మిస్ట్ ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు దీన్ని తీసుకెళ్ళడం మర్చిపోతే- ఐస్ ను ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు.

మొటిమల నివారణ-సౌందర్య పోషణకు చిట్కాలు...!మొటిమల నివారణ-సౌందర్య పోషణకు చిట్కాలు...!

ఫ్రిజ్ లోంచి ఐస్ ను తీసుకుని, కర్చీఫ్ లో చుట్టి, మీ మొహంపై రాయండి. చల్లగా ఉండి మీరు అందంగా కన్పించేలా చేస్తుంది.కానీ మీకు సమయం ఎక్కువ ఉన్నప్పుడు ఇది చేస్తే కరిగే నీరును ఆపటం కష్టం.

మొటిమలకి ఐస్

మొటిమలకి ఐస్

మొహంపై వచ్చే మొటిమలకి ఐస్ మంచి మందు. కానీ ఇది రాత్రికిరాత్రి జరిగిపోయే అద్భుతం కాదు. సహనంగా, క్రమం తప్పకుండా వాడితే ఫలితాలు కన్పిస్తాయి. ఐస్ చర్మంతో చర్య జరపటానికి సమయం తీసుకున్నా, ఫలితాలు మెరుగ్గా ఉంటాయి.

పోషకాలందించే ఐస్

పోషకాలందించే ఐస్

పండ్లు క్రమం తప్పకుండా తినడం చర్మకాంతిని పెంచే మంచి మార్గం. కానీ ఐస్ ను చర్మసంరక్షణకి పండ్లతో పాటు జతచేస్తే మరిన్ని పోషకాలు వంటబట్టే అవకాశం ఉంది.

కానీ ఇది చేయటానికి, కేవలం ఐస్ మాత్రమే సరిపోదు. ఈ ఐస్ ట్రేలో ఏదోఒక పళ్ళ రసం పోసి ఫ్రిడ్జ్ లో పెట్టండి. కార్యట్లు, నిమ్మకాయలు, టమాటాలు, రేగుపళ్ళు, దోసకాయ వంటి అనేక రకాలను దీనికోసం వాడవచ్చు.

కళ్ళచుట్టూ నల్లని వలయాలు, వాచిన కళ్ళకి ఐస్

కళ్ళచుట్టూ నల్లని వలయాలు, వాచిన కళ్ళకి ఐస్

కంటిచుట్టూ నల్లని వలయాలు, ఉబ్బిన కళ్ళతో బాధపడే అనేకమంది ఆన్ లైన్ లోనూ, విడిగానూ కొత్త ఉత్పత్తుల కోసం వెతుకుతూనే ఉంటారు. సులువైన పరిష్కారం ఐస్ ను ప్రతిరోజూ పొద్దున్నే లేదా రాత్రి పడుకునేముందు కళ్ళచుట్టూ రాసుకోడమే. నేరుగా ఐస్ ను చర్మంపై పెట్టడం సౌకర్యంగా లేకపోతే, తువ్వాలు లేదా టిష్యూలో పెట్టి వాడండి.

అవాంఛిత రోమాల చికిత్సలో ఐస్

అవాంఛిత రోమాల చికిత్సలో ఐస్

అవాంఛిత రోమాలను తొలగించటానికి మీరు సెలూన్ కి వెళ్ళినపుడు, వారు మొదట ఐస్ వాడతారు. ఎందుకో తెలుసా? వ్యాక్సింగ్ లేదా థ్రెడింగ్ ప్రక్రియలో మీ చర్మానికి బాధ, నొప్పి కలుగుతాయి. అందుకని అవి మొదలుపెట్టే ముందు, ఐస్ ను మీ చర్మంపై రాస్తే, అది మీ నెప్పిని తగ్గించి ఆ పని తొందరగా అయ్యేట్లు సాయపడుతుంది. ఒకవేళ మీరు రేజర్ ను వాడుతున్నట్లయితే అప్పుడు కూడా ఐస్ ను పెట్టుకోండి. కానీ అవాంఛిత రోమాలను తీసే ముందు మాత్రమే పెట్టండి, తర్వాత కాదు.

చర్మగాయాలకు ప్రథమ చికిత్స ఐస్

చర్మగాయాలకు ప్రథమ చికిత్స ఐస్

కోసుకోవటం, కాలటం, అలర్జీ లేదా వాపు- అన్నిటికీ ఐస్ ను చర్మంపై రాయటం ఉపయోగం. వెనువెంటనే ఆ ప్రదేశాన్ని మొద్దుబారేట్లు చేసి, నొప్పి తీవ్రతను తగ్గిస్తుంది. చాలాసార్లు తీవ్ర చర్మసంబంధ వ్యాధులతో బాధపడేవారికి, ఆ స్థలంలో ఐస్ రాయటం కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఆ ప్రదేశానికి కొంచెం దూరం నుండి ఐస్ ను రుద్దుతూ వస్తూ మెల్లిగా అసలుచోటికి వెళ్ళండి.

చర్మసౌందర్యానికి, శుభ్రతకి ఐస్

చర్మసౌందర్యానికి, శుభ్రతకి ఐస్

మీకు మీ చర్మం పాలిపోయినట్లు, రంగు తగ్గినట్లు అనిపిస్తే మొదట ఐస్ ను ప్రయత్నించండి. ఎందుకంటే ఐస్ చర్మం రంగు మెరుగుపర్చి, లోపలిపొరలు కూడా శుభ్రపరుస్తుంది. అయితే దానికి కాస్త నిమ్మరసాన్ని జోడించండి. ఉప్పు,పంచదార లేకుండా కేవలం నిమ్మరసాన్ని గడ్డకట్టించి రోజుకి రెండుసార్లు చర్మంపై రాస్తూ మంచి ఫలితాలను చూడండి.

మొటిమల నివారణ-సౌందర్య పోషణకు చిట్కాలు...!మొటిమల నివారణ-సౌందర్య పోషణకు చిట్కాలు...!

చర్మ అలర్జీలకు ఐస్

చర్మ అలర్జీలకు ఐస్

అలర్జీలు ఎప్పుడైనా రావచ్చు. అయితే దానికి ఊరికే మందులు వేసుకోవటం కన్నా ఐస్ థెరపీని ప్రయత్నించండి. ఐస్ అలర్జీని వెనువెంటనే మటుమాయం చేస్తుంది. దీనికి కూడా ఒక ప్రత్యేక పద్ధతి ఉంది. సరిసమాన భాగాల్లో నీటిని, కొబ్బరినూనెను తీసుకుని ఫిజ్ లో పెట్టండి. ఈ కొబ్బరినూనెతో కూడిన ఐస్ ను చర్మంపై రాయటం వల్ల చర్మ అలర్జీలనుండి సత్వర ఉపశమనం దొరుకుతుంది.

జుట్టు సమస్యలకు ఐస్

జుట్టు సమస్యలకు ఐస్

ఎవరి తలపైనైనా బబుల్ గమ్ అంటుకుంటే వారి పరిస్థితి ఊహించండి. దాన్ని లాగి, పీకినా జుట్టు ఊడొస్తుందేమో కానీ అది మాత్రం రాదు.ఇక్కడే మన ఐస్ గొప్పగా పనిచేస్తుంది. ఐస్ ను ఆ ప్రాంతంలో రుద్దటం వల్ల చూయింగ్ గమ్ త్వరగా ఊడొస్తుంది. కానీ ఐస్ ను నేరుగా జుట్టుపై కానీ, మరే ఇతర భాగాల్లో కానీ రాయవద్దు- జలుబు చేస్తుంది.

English summary

Benefits of adding ice to the skin care regime

Benefits of adding ice to the skin care regime,To add ice to the skin care regime, there are certain ways to do it right and here is listing ten easy ways of using ice on your skin to see a difference.
Desktop Bottom Promotion